Video Viral: ఐస్‌క్రీమ్ షాప్ వాడికి చుక్కలు చూపించిన మహానటి.. వీడియో వైరల్
Video Viral:
మహానటి కీర్తి సురేష్ (Keerthi Suresh) గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇటీవల పెళ్లి చేసుకున్న కీర్తి (Keerthi Suresh) ప్రస్తుతం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. పెళ్లయినప్పటి నుంచి తన భర్తతో కలిసి ఉన్న ఫొటోలను, బయటకు ఇద్దరు కలిసి వెళ్లిన ఫొటోలను సోషల్ మీడియాలో (Social Media) పోస్ట్ చేస్తుంటుంది. తాజాగా కీర్తి సురేశ్ ఓ షాపుకు వెళ్లింది. తనకి ఇష్టమైన ఐస్‌క్రీమ్‌ను (Ice Cream) కొనుగోలు చేయగా.. ఆ షాపు వెండర్ తనని ఆటపట్టించాడు. అలాగే కీర్తి సురేష్ కూడా ఆటపట్టించాడు. వీరిద్దరి మధ్య జరుగుతున్న వీడియో సోషల్ మీడియాలో ఒకటి వైరల్ అవుతోంది.
షాపు వెండర్‌ను తనకి నచ్చిన ఐస్‌క్రీమ్ ఇమ్మని అడిగింది. అయితే ఆ షాపు వెండర్ ఆమెకు ఐస్ క్రీమ్ ఇవ్వకుండా ఆటపట్టించాడు. ఆ తర్వాత కీర్తి సురేష్ కూడా ఈ షాపు వెండర్‌ను ఆటపట్టించింది. చేతికి డబ్బులు ఇచ్చినట్లే ఇచ్చి.. ఆటపట్టించింది. అయితే చివరకు ఆ ఐస్ క్రీమ్ షాపు వెండర్ కీర్తి సురేష్ చేయిని పట్టుకుని డబ్బులు తీసుకునే ప్రయత్నం చేశాడు. వీరిద్దరి మధ్య జరిగిన ఈ సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్లు స్పందిస్తూ.. మహానటితో పెట్టుకుంటే ఇలాగే ఉంటుందని అంటున్నారు.
Keerthy Suresh flips the script! 🍦😂 When the ice cream vendor trolls, but she trolls right back! @KeerthyOfficial#KeerthySuresh #ReverseUno #IceCreamWars #siima pic.twitter.com/f65oE7Z1Zq
— SIIMA (@siima) March 20, 2025
కీర్తీ సురేష్ తన చిన్ననాటి స్నేహితుడు అయిన ఆంటోనీని గతేడాది వివాహం చేసుకుంది. హిందు, క్రిస్టియన్ పద్ధతిలో వీరి వివాహం జరిగింది. ప్రస్తుతం కీర్తి సురేష్ కూడా సినిమాలతో బిజీగా ఉంటుంది. పెళ్లయిన వెంటనే బేబీ జాన్ మూవీ రిలీజ్ అయ్యింది. పెళ్లి అయి ఎన్ని రోజులు కాకుండానే బేబీ జాన్ కోసం ప్రమోషన్స్‌కి వచ్చింది. అయితే ఈ సినిమా మంచి లాభాలను తీసుకురాలేదు. ఈ సినిమా అంత హిట్ కాలేదు. దీని తర్వాత కూడా కీర్తి సురేశ్ సినిమాల్లో నటిస్తుంది. ఒక పక్క సినిమాల్లో నటిస్తూనే భర్తతో కలిసి షికారులకు వెళ్తుంది.
Also Read: Viral Video: మహేష్‌తో సితారా కొత్త యాడ్.. వైరల్ అవుతున్న వీడియో
ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ఫొటోలు పెడుతుంది. అయితే భర్త కంటే తన డామినేషన్ ఎక్కువగా ఉంటుందని ఇటీవల మహానటి తెలిపింది. అయితే కీర్తి సురేశ్ సినిమాలు ఫ్లాప్ అవుతున్నా కూడా వరుస సినిమాలు చేస్తోంది. తెలుగులో కంటే బాలీవుడ్లో ఎక్కువగా నటిస్తోంది. తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. నేను శైలజ సినిమా మంచి హిట్ కొట్టడంతో పాటు ఆ తర్వాత వచ్చిన మహానటి సినిమా మంచి హిట్ కొట్టడంతో కీర్తి ఫేమ్ ఒక్కసారిగా మారిపోయింది.
-
Ice cream : ఐస్ క్రీమ్ లో రెండు రకాలు.. ఆ రెండోది తింటే మీకు గుండె ఫెయిల్ ఖాయం
-
Villain Rami Reddy : అచ్చం ఒకప్పటి టాలీవుడ్ విలన్ రామిరెడ్డిలా ఉన్న వ్యక్తి.. వీడియో వైరల్..
-
Hero Siddharth-aditi rao hydari: సిద్ధార్థ్, అదితి న్యూ యాడ్ చూశారా.. పెళ్లి తర్వాత కలిసి చేసిన ఫస్ట్ షూట్ ఇదేనేమో!
-
Viral Video: టీమిండియా ఘన విజయం.. విరాట్, అనుష్క క్యూట్ వీడియో వైరల్