Ravindra Jadeja: రియల్ పుష్పనే జడేజా బీట్ చేశాడుగా.. పిచ్చెక్కిస్తున్న ప్రమోషన్ వీడియో

Ravindra Jadeja:
పుష్ప అంటే ఫ్లవర్ కాదు.. ఫైర్.. అనేది ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించాడు. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన పుష్ప సినిమా బాక్సాఫీస్ దగ్గర రికార్డులు సృష్టించింది. ఈ సినిమా హిట్ కావడంతో గతేడాది పుష్ప 2:ది రూల్'(Pushpa 2: the Rule) వచ్చింది. ఈ సినిమాలోని డైలాగ్‌లు, పుష్ప మ్యానరిజమ్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. పుష్ప 2 కూడా బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపించింది. అయితే మార్చి 22వ తేదీ నుంచి ఐపీఎల్ ప్రారంభం కాబోతుంది. ఈ క్రమంలో టీమిండియా క్రికెటర్ రవీంద్ర జడేజా పుష్ప మేనరిజమ్ చూపించాడు.
ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ టీంలో ఆడుతున్నాడు. ఈ సందర్భంగా పుష్ప సినిమాలోని సన్నివేశాన్ని స్పూఫ్ చేస్తూ ఓ వీడియోను అప్లోడ్ చేశాడు. ప్రసుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బాగా ట్రెండ్ అయిన పుష్ప అంటే పేరు కాదు.. పుష్ప అంటే బ్రాండ్ అనే డైలాగ్ ఎంత ఫేమస్ అందరికీ తెలిసిందే. దీనిని జడేజా చెబుతూ.. జడ్డు అంటే పేరు కాదు.. జడ్డు అంటే బ్రాండ్ అని పుష్ప మేనరిజమ్ చూపించాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే జడేజా ఇప్పుడేం కొత్తగా చేయలేదు. గతంలో కూడా పుష్ప గెటప్‌లో రెడీ అయి సోషల్ మీడియాలో ఫొటోలు అప్లోడ్ చేశారు. ఇవి అప్పట్లో బాగా వైరల్ అయ్యాయి. నిజం చెప్పాలంటే పుష్ప మేనరిజమ్‌ను ప్రపంచ స్థాయిలో చాలా మంది చూపించారు.
ఇదిలా ఉండగా.. టీమిండియా ఇటీవల ఛాంపియన్స్ ట్రోఫీని సొంతం చేసుకుంది. న్యూజిలాండ్‌పై నాలుగు వికెట్ల తేడాతో గెలిచింది. ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ తర్వాత రవీంద్ర జడేజా రిటైర్మెంట్ ప్రకటిస్తాడని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగింది. ఈ వార్తలకు రవీంద్ర జడేజా సోషల్ మీడియా వేదికగా స్పందించాడు. సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశాడు. కేవలం నాలుగు పదాలతో రిటైర్మెంట్ పుకార్లకు చెక్ పెట్టేశాడు. అనవసరమైన పుకార్లు వద్దు.. ధన్యవాదాలు అని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. నాలుగు పదాలతో రిటైర్మెంట్ వార్తలకు పూర్తిగా చెక్ పెట్టేశాడు. అయితే టీ 20 వరల్డ్ కప్ తర్వాత 2024లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా రిటైర్మెంట్ ప్రకటించారు. ఈ క్రమంలోనే ఈ వన్డే క్రికెట్‌కు కూడా ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత రిటైర్మెంట్ ప్రకటిస్తారని జోరుగా ప్రచారం సాగింది.
-
Rashid Khan: బుమ్రా రికార్డ్ బ్రేక్ చేసిన రషీద్ ఖాన్
-
Vignesh Putur: చెన్నైకి చెమటలు పట్టించిన పుతుర్.. ఇంతకీ ఎవరు?
-
IPL: ఐపీఎల్లో చీర్లీడర్లు ఒక్కో మ్యాచ్‌కు ఎంత సంపాదిస్తారంటే?
-
IPL: ఐపీఎల్ సీజన్లో ఈ స్టాక్స్ కొంటే.. లాభమంతా మీదే!
-
IPL క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. Airtel, VI సూపర్ ప్లాన్స్..!
-
IPl 2025:క్రికెట్ ఫ్యాన్స్ షాకింగ్ న్యూస్.. ఆ మ్యాచ్ రీ షెడ్యూల్?