Donald Trump : వీటిని ఎల్లప్పుడూ కూడా క్యారీ చేయాల్సిందే.. ట్రంప్ న్యూ రూల్
Donald Trump : ఈ న్యూ రూల్ వల్ల అమెరికాలో ఉంటున్న వలసదారులు అడిగిన ప్రతీసారి కూడా పత్రాలు సమర్పించాలి.18 ఏళ్లు కంటే ఎక్కువ ఉన్నవారు తప్పకుండా వెంట తీసుకెళ్లాలి. అయితే ఈ నిబంధనలు ఎవరైనా పాటించకపోతే మాత్రం వారికి అమెరికాలో ఉండే అర్హత లేదని తెలిపింది.

Donald Trump : అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఎన్నో మార్పులు వస్తున్నాయి. వీసా, సుంకాలు ఇలా ఎన్నో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. అయితే భారీ సుంకాలు విధించిన ట్రంప్ అమెరికాలో మరో కొత్త రూల్‌ను అమల్లోకి తీసుకురానున్నారు. అమెరికాలో ఇండియన్స్ చాలా మంది ఉంటున్నారు. అయితే వీరిలో వివిధ కేటగిరీల్లో కార్డులు ఉంటాయి. కొందరికి వీసాలు, గ్రీన్ కార్డులు ఉంటాయి. అయితే వీటిని బయటకు వెళ్లినప్పుడు ఎవరూ తీసుకెళ్లరు. కానీ ఇకపై ఇండియన్స్ మాత్రం బయటకు వెళ్లి్నా కూడా తమ పత్రాలను వెంట తీసుకెళ్లాలి. అయితే కేవలం కేవలం భారతీయులు మాత్రమే కాకుండా అమెరికన్లు కూడా పత్రాలను బయటకు తీసుకెళ్లాలి. అయితే పిల్లల వయస్సు 14 ఏళ్లు కంటే ఎక్కువ ఉన్నవారు వేలిముద్రలు సమర్పించి, రీ రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుందని రూల్ తీసుకొచ్చారు. ఈ న్యూ రూల్ వల్ల అమెరికాలో ఉంటున్న వలసదారులు అడిగిన ప్రతీసారి కూడా పత్రాలు సమర్పించాలి.18 ఏళ్లు కంటే ఎక్కువ ఉన్నవారు తప్పకుండా వెంట తీసుకెళ్లాలి. అయితే ఈ నిబంధనలు ఎవరైనా పాటించకపోతే మాత్రం వారికి అమెరికాలో ఉండే అర్హత లేదని తెలిపింది.
అమెరికాలో అక్రమంగా ప్రవేశించే వలసదారుల కోసం ఈ కొత్త రూల్‌ను తీసుకొచ్చారు. అయితే ఈ కొత్త రూల్‌ను పాటించకపోతే మాత్రం జైలు శిక్ష కూడా ఉంటుందని తెలిపింది. అయితే ఈ కొత్త రూల్ ఏప్రిల్ 11వ తేదీ నుంచి అమల్లోకి రానుంది. ఈ రూల్ వల్ల వలసదారులు ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొవలసి వస్తుందో చూడాలి. అయితే ఈ కొత్త రూల్ వల్ల భారతీయ హెచ్-1బీ వీసాదారులపై కూడా ప్రభావం పడుతుంది. ఎందుకంటే స్టడీ, వర్క్, ట్రావెల్ వంటి వీసాలు ఉన్నవారు ఎప్పటికప్పుడు కూడా అన్ని డాక్యుమెంట్స్‌ను ఎప్పటికప్పుడు వెంట పెట్టుకుని తిరగలేరు. దీనివల్ల చాలా ఇబ్బంది పడుతుందని అంటున్నారు. ఇప్పటికే ట్రంప్ విధించిన సుంకాల వల్ల దేశాలు ఇబ్బంది పడుతున్నాయి. అన్ని దేశాల కంటే చైనాపై అమెరికా ఎక్కువగా సుంకం విధించింది. వీటివల్ల చాలా రంగాల్లో ఆర్థికంగా ఇబ్బందులు రానున్నాయి. ఇప్పటికే స్టాక్ మార్కెట్లు నష్టాల బాట పట్టాయి. ఇన్వెస్టర్ల లక్షల కోట్లు పోయాయి. ఇక బంగారం విషయానికొస్తే.. ఇది కూడా భారీగా తగ్గింది. మళ్లీ పెరుగుతోంది. బంగారం ధరలు ఎప్పుడూ కూడా పెరుగుతూనే ఉంటాయి. కానీ ఈ మధ్య కాలంలో బంగారం ధరలు బాగా తగ్గాయి. ఇదంతా కూడా ట్రంప్ సుంకాల ఎఫెక్ట్. ట్రంప్ సుంకాల ఎఫెక్ట్ వల్ల ఇంకా ఎన్ని మార్పులు చూడాల్సి వస్తుందో అని ఇండియన్స్‌తో పాటు అమెరికన్లు కూడా అంటున్నారు. వరుస మార్పులు చేస్తున్నారు.
-
Trump Warns: ఇప్పుడు వదిలిపోండని.. అమెరికాలో ఉంటున్న విదేశీయులకు ట్రంప్ వార్నింగ్
-
Sunita Williams: సునీతా విలియమ్స్‌కు స్వాగతం పలికిన డాల్ఫిన్లు.. వీడియో చూసారా?
-
Sunita Williams: సునీతా విలియమ్స్ భువిపై రావడానికి ఎన్ని కోట్లు ఖర్చు అయ్యిందంటే?
-
Tulsi Gabbard: ఆ విషయంలో మోదీ, ట్రంప్ వైఖరి ఒక్కటే.. ప్రశంసించిన తులసీ గబ్బార్డ్
-
NASA: అండర్ గ్రాడ్యుయేట్స్ ఇది మీకోసమే.. నాసాలో ఇంటర్నెషిప్ ప్రోగ్రామ్.. ఎలా అప్లై చేసుకోవాలంటే?