Telangana : నువ్వు ఉచితాలు ఇవ్వకుంటే.. ఉద్యోగాలు వచ్చేవి.. రేవంత్ పై మాజీ ఉద్యోగి ఫైర్..
Telangana : మా ఉద్యోగులు కట్టే పన్నులతో మిమ్మల్ని ఉచితాలు ఎవడు ఇవ్వమన్నాడు. నువ్వు ఉచితాలు పెట్టకుండా కంపెనీలు తెచ్చి ఉంటే ఉద్యోగాలు వచ్చేవని" తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న జీతభత్యాల గురించి అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడగా..

Telangana : మా ఉద్యోగులు కట్టే పన్నులతో మిమ్మల్ని ఉచితాలు ఎవడు ఇవ్వమన్నాడు. నువ్వు ఉచితాలు పెట్టకుండా కంపెనీలు తెచ్చి ఉంటే ఉద్యోగాలు వచ్చేవని” తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న జీతభత్యాల గురించి అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడగా.. ఓ విశ్రాంత మహిళా ఉద్యోగి పై విధంగా వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగులకు సంబంధించి జీతభత్యాలు పెండింగ్లో ఉన్నాయి.. వాస్తవానికి గత భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు ఉద్యోగులకు వేతనాలు సక్రమంగా వచ్చేవి కావు. రోజుకో జిల్లా చొప్పున వేతనాలు వేసేవారు. ఇక విశ్రాంత ఉద్యోగులకు సంబంధించిన ప్రయోజనాల విషయంలో ప్రభుత్వం అంతగా ఉదారత చూపలేదని ఆరోపణలు వినిపించాయి. ఈ క్రమంలో ఎన్నికల మేనిఫెస్టోలో ఉద్యోగులకు ప్రతినెల ఒకటో తేదీన వేతనాలు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగులకు ఒకటవ తేదీన వేతనాలు ఇవ్వడం మొదలుపెట్టింది. అయితే విశ్రాంత ఉద్యోగులకు సంబంధించిన ప్రయోజనాల చెల్లింపు విషయంలో ప్రభుత్వం అంతగా స్పందించడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. దాదాపు 8 వేల కోట్ల వరకు ఉద్యోగులకు ప్రయోజనాల చెల్లింపులకు సంబంధించిన బిల్లులు పెండింగ్లో ఉన్నాయని సమాచారం. అయితే వీటిని దశల వారీగా పూర్తి చేస్తామని ఇటీవలే ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క ఉద్యోగులకు హామీ ఇచ్చారు. వచ్చే రోజుల్లో ఉద్యోగుల సంబంధించిన చెల్లింపుల విషయంలో ఎటువంటి జాప్యం ఉండదని ఆయన పేర్కొన్నారు..
మండిపడిన విశ్రాంత మహిళా ఉద్యోగి
తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న జీతభత్యాల గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల మాట్లాడారు. ఈ క్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యల పట్ల ఓ విశ్రాంత మహిళా ఉద్యోగి తనదైన శైలిలో స్పందించారు..” ఉద్యోగులు చెల్లించే పన్నులతో జీతాలు ఎవడు ఇవ్వమన్నాడు. ఉచితంగా పథకాలు ఇచ్చి మా జీవితాలను ఎవడు నాశనం చేయమన్నాడు. నువ్వు ఉచితాలు పెట్టకుండా కంపెనీలు తెచ్చి ఉంటే ఉద్యోగాలు వచ్చేవి. అసలు మీ పార్లమెంటు సభ్యులు.. శాసనసభ సభ్యులు.. శాసనమండలి సభ్యులకు జీతాలు ఎందుకు.. 10 కార్లు ఎందుకు.. మీ సొంత పైసలు వాడుకోండి” అంటూ ఆ విశ్రాంత మహిళా ఉద్యోగి ముఖ్యమంత్రి సెల్ఫీ వీడియోలో అభిప్రాయపడింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై తీవ్రంగా విమర్శలు చేసింది. జీతభత్యాలకు సంబంధించిన బిల్లులు పెండింగ్లో ఉండటం వల్ల తమ ఇబ్బంది పడుతున్నామని.. పిల్లల చదువులు.. పెళ్లిళ్లు ఆగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేసింది.. ప్రభుత్వం ఉచిత పథకాల అమలును నిలిపివేసి.. దీర్ఘకాలిక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని ఆమె కోరింది. “పథకాలు ప్రకటించామని.. వాటిని గొప్పగా అమలు చేస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. కానీ ఉద్యోగులకు కనీసం జీతభత్యాలు కూడా ఇవ్వలేకపోతున్నారు. ఇలా అయితే విశ్రాంత ఉద్యోగులు ఎలా బతుకుతారు. వారి గురించి ప్రభుత్వం ఆలోచించాలి. అవసరమైతే ఉచిత పథకాల అమలును నిలిపివేయాలి. శాశ్వత అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి సారించాలి. అప్పుడే పరిపాలన బాగుంటుంది. రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని” ఆ మహిళా ఉద్యోగి అభిప్రాయపడింది. అయితే ఆమె చేసిన వ్యాఖ్యలను గులాబీ అనుకూల సోషల్ మీడియా విభాగంలో తెగ ప్రచారం చేస్తున్నారు.. రేవంత్ రెడ్డి పై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు.
తెలంగాణలో పెండింగ్లో ఉన్న జీత భత్యాల గురించి అసెంబ్లీలో రేవంత్ రెడ్డి మాటలపై మండిపడ్డ రిటైర్డ్ మహిళా ఉద్యోగి
మా ఎంప్లాయిస్ కట్టే టాక్సులతో మిమ్మల్ని ఉచితాలు ఎవడు ఇవ్వమన్నాడు.. ఉచిత పథకాలు ఇచ్చి మా జీవితాలు ఎవరు నాశనం చేయమన్నారు
నువ్వు ఉచితాలు పెట్టకుండా.. కంపెనీలు తెచ్చి ఉంటే… pic.twitter.com/9seezkucEB
— Telugu Scribe (@TeluguScribe) March 17, 2025