MP and MLA Salary: ఎంపీ, ఎమ్మెల్యేల జీతాలు ఎంతంటే?
MP and MLA Salary: ఐదు సంవత్సరాలకు ఒకసారి ప్రతి రాష్ట్రంలో కూడా ఎమ్మెల్యేలు, ఎంపీలు మారుతుంటారు. మంచి విధివిధానాలు కలిగిన వారు అలాగే ఉండిపోతే కొందరు మాత్రం మారిపోతుంటారు. ప్రజలకు నచ్చిన వారిని సీట్లలో కూర్చూబెడుతారు.

MP and MLA Salary:
ఐదు సంవత్సరాలకు ఒకసారి ప్రతి రాష్ట్రంలో కూడా ఎమ్మెల్యేలు, ఎంపీలు మారుతుంటారు. మంచి విధివిధానాలు కలిగిన వారు అలాగే ఉండిపోతే కొందరు మాత్రం మారిపోతుంటారు. ప్రజలకు నచ్చిన వారిని సీట్లలో కూర్చూబెడుతారు. అయితే ఈ ఎంపీలు, ఎమ్మెల్యేలను ఎన్నికల ద్వారా ఎంపిక చేస్తారు అనే విషయం తెలిసిందే. దేశానికి, ప్రజలకు సేవ చేయడానికి వీరందరూ నిజంగానే పని చేస్తున్నారా? అనేది పక్కన పెడితే ఈ డ్యూటీ చేయడం కోసం వారికి ప్రభుత్వం నుంచి ఎంత డబ్బు వస్తుందో మీకు తెలుసా? కానీ వాస్తవానికి చాలా డబ్బు వస్తుంది. ఇందులో జీతం వేరు, ఇతర అలవెన్సులు వేరు. ఎమ్మెల్యేలకు వారి జీతాలతో పాటు ఇతర అలవెన్సులు కూడా ఇవ్వాలనే నిబంధన ఉంది. కానీ ఈ ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రతి సంవత్సరం ఎంత డబ్బు సంపాదిస్తారు? అనే విషయం ఇప్పుడు మనం తెలుసుకుందాం.
శాసనసభ్యులకు జీతం
ఎమ్మెల్యేలకు ప్రతి నెలా నిర్ణీత జీతం ఇస్తారు. దీనితో పాటు, ఆ ఎమ్మెల్యే తన ప్రాంత ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం నుంచి ఎమ్మెల్యే నిధి నుంచి నిర్ణీత మొత్తాన్ని కూడా పొందుతాడు. అంతేకాదు ప్రతి రాష్ట్ర ఎమ్మెల్యే జీతం భిన్నంగా ఉంటుంది. జీతంతో పాటు, వారికి లభించే సౌకర్యాల జాబితా కూడా చాలా పెద్దదే. ప్రతి రాష్ట్ర ఎమ్మెల్యే జీతం రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయిస్తుంది. ఉత్తరప్రదేశ్ ఎమ్మెల్యేలకు రూ.1 లక్ష 87 వేల జీతం లభిస్తుంది. వారి వార్షిక ఆదాయం రూ.21 లక్షల 24 వేలు. మధ్యప్రదేశ్‌లో ఎమ్మెల్యేల జీతం నెలకు రూ.1.10 లక్షలు. వారి వార్షిక ఆదాయం రూ. 13 లక్షల 20 వేలు. ఇక తెలంగాణ ఎమ్మెల్యేలకు రూ.20,000 జీతం, రూ.2,30,000 ఎన్నికల భత్యం లభిస్తాయి. మొత్తం మీద వారికి ప్రతి నెలా రూ. 2.50 లక్షలు జీతం వస్తుంది. ఇలా లెక్కిస్తే సంవత్సరానికి రూ. 30 లక్షలకు పైగానే. అది సరే గానీ వీళ్లు కోటీశ్వరులు ఎలా అవుతున్నారు?
ఎంపీల వార్షిక ఆదాయం
ప్రస్తుతం, పార్లమెంటు సభ్యుల (జీతాలు, భత్యాలు, పెన్షన్) చట్టం, 1954 ప్రకారం, ఎంపీల మూల జీతం నెలకు రూ. 1 లక్ష. ఇందులో అలవెన్సులు, ఇతర సౌకర్యాలు యాడ్ చేయరు. ఏప్రిల్ 1, 2023 నుంచి వర్తించే నియమం ప్రకారం, ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి ఎంపీల జీతం, రోజువారీ భత్యం పెంచుతారు. ప్రయాణ భత్యం కాకుండా, ప్రతి సభ్యునికి పార్లమెంటుకు సంబంధించిన ఏదైనా పని కోసం ప్రయాణించడానికి ప్రత్యేక భత్యం లభిస్తుంది. ఎంపీలకు విధుల్లో ఉన్నప్పుడు రూ. లక్ష జీతంతో పాటు రూ. 2,000 భత్యం ఇస్తారు. ఎంపీలు నెలకు మొత్తం రూ.2.3 లక్షల జీతం, అలవెన్సులతో పాటు పొందుతారు. విధి నిర్వహణలో ఉన్నప్పుడు ప్రత్యేక అలవెన్స్ కూడా లభిస్తారు. వీరు కూడా కోటీశ్వరులు అవుతున్నారు. ఎలాగంట?
Disclaimer : అవగాహన కోసం మాత్రమే ఈ సమాచారం అందిస్తున్నాము. దీన్ని ట్రెండింగ్ తెలుగు నిర్ధారించదు. దయచేసి గమనించగలరు.
Also Read: Anasuya Bharadwaj: కుటుంబ సభ్యులతో కలిసి కాశీ యాత్రకు వెళ్లిన అనసూయ…ఫొటోస్ వైరల్..