Dwakra Group: మహిళలకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. కేవలం 6 నెలలు దాటితే చాలు రూ.5 లక్షలు పొందవచ్చు.. ఎలాగంటే..

Dwakra Group:
మహిళలకు ప్రభుత్వం ఒక మంచి శుభవార్త చెప్పింది. ఇంకా ఎవరైనా డ్వాక్రా సంఘాల్లో చేరని వాళ్ళు ఉంటే వాళ్ళు ఇప్పటికైనా చేరితే ఉత్తమం. దీని ద్వారా వాళ్లు సులభంగా రుణం పొందే అవకాశం.
మహిళలకు ప్రభుత్వాలు అధిక ప్రాధాన్యత ఇస్తున్న సంగతి తెలిసిందే. మహిళలు స్వయం ఉపాధి దిశగా నడిచేలా ప్రభుత్వాలు అవకాశాలు కల్పిస్తున్నాయి. ఈ క్రమంలోనే వాళ్లు మహిళల కోసం అనేక రకాల స్కీమ్స్ తీసుకొని వస్తున్నాయి. ఆర్థికంగా వాళ్లకు చేయూత కలిగిస్తున్నాయి. ప్రభుత్వాలు మహిళా సంఘాలను బలోపేతం చేస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డ్వాక్రా మహిళా సంఘాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాయి. రాష్ట్రంలోని డ్వాక్రా మహిళలకు ఉచిత భీమా మరియు సులభంగా రుణాలు అందేలా ప్రభుత్వాలు చూస్తున్నాయి. ఇప్పటివరకు డ్వాక్రా సంఘాల్లో చేరని మహిళలు కూడా గ్రూపుల్లో చేరేందుకు వాళ్లను ప్రోత్సహిస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ కొత్త కార్యవర్గాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టినట్టు తెలుస్తుంది. ముందుగా గ్రామాల్లో ఆ తర్వాత మండల స్థాయిలో కొత్త కార్యవర్గాలను చేపట్టనున్నారు. ప్రభుత్వం డ్వాక్రా సంఘాల్లో చేరి ఆరు నెలలు దాటిన మహిళలకు రూ. 5 లక్షల వరకు బ్యాంకు లింకేజీ రుణాన్ని మంజూరు చేస్తుంది. గ్రూప్ లో పదిమంది ఉన్నట్లయితే ఒక్కొక్కరికి 50,000 వస్తాయని తెలుస్తుంది. సమయం గడిచే కొద్దీ ఈ రుణపరిమితి కూడా పెరుగుతుంది. 20 లక్షల వరకు రుణం కూడా పొందవచ్చు. అప్పుడు ఒక్కొక్కరికి రూ.2 లక్షల వరకు రుణం లభిస్తుంది. అయితే అంత సులభంగా 2 లక్షల లోను ఇవ్వరు. డ్వాక్రా సంఘాల మహిళలు ప్రతి ఏటా డబ్బులు కరెక్టుగా జమ చేస్తూ ఉండే వాళ్లకు మాత్రమే ఈ ప్రయోజనం ఉంటుంది. కొంతమంది రుణం తీసుకొని కట్టకుండా ఉంటారు.
అలాంటి వాళ్లకు రెండు లక్షల లోన్ వచ్చే అవకాశం ఉండదు. డ్వాక్రా సంఘాలలో బ్యాంకులో పొదుపు డబ్బులు జమ చేయడం, బ్యాంకుకు రుణ వాయిదా చెల్లించడం, గ్రూపుల బుక్స్ నిర్వహణ, సమావేశాలు నిర్వహించడం వంటి వివిధ రకాల పనులకు కొత్త కార్యవర్గాన్ని ఎంచుకున్నట్లు సమాచారం. వీటికోసం డ్వాక్రా సంఘాల్లోని మహిళలనే ఎన్నుకుంటారు. ఈ ప్రక్రియ గ్రామాలలో ఈ నెల 12వ తేదీ లోపు పూర్తి అవుతుంది.
12వ తేదీన మండల కార్యవర్గాన్ని ఎన్నుకుంటున్నట్లు సమాచారం. హైదరాబాద్ పరిసర గ్రామాల్లోని సంఘాలలో సమావేశాలు కూడా జరుగుతాయి. డ్వాక్రా సంఘాల్లో చేరేందుకు కనీస వయసు 18 ఏళ్ళు ఉండాలి. అయితే ఈ కనీస వయసును 15 ఏళ్లకు తగ్గించనున్నారు. ఈ క్రమంలో మరింత మంది అమ్మాయిలకు డ్వాక్రా సంఘాల్లో చేరేందుకు అవకాశం ఉంటుందని తెలుస్తుంది