Starlink: భారత్ లో ఎయిర్టెల్, జియో ద్వారా స్టార్ లింక్ ఇంటర్నెట్ చాలా చౌకగా మారనుందా..

Starlink: ఉపగ్రహ సేవలు మరియు హార్డ్‌వేర్ ఖర్చులు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇది స్తోమతను కూడా తగ్గిస్తుంది అన్న సంగతి తెలిసిందే.
మనదేశంలో ప్రజలు ఎయిర్టెల్ మరియు రిలయన్స్ జియో ద్వారా సరసమైన ధరలకు స్టాలిన్ సేవను పొందవచ్చు. వీటితోపాటు దేశంలోని ప్రజలకు సులభమైన చెల్లింపు ఎంపికల ప్రయోజనాన్ని కూడా కలిగించవచ్చు. స్టార్ లింక్ టెలికాం కంపెనీలు ఎయిర్టెల్ మరియు రిలయన్స్ జియో తో చేతులు కలిపిన సంగతి తెలిసిందే. వీళ్ళు కలిసినప్పటి నుంచి కొత్త అప్డేట్లు వస్తున్నాయి. ప్రజలు కూడా ఈ స్టార్ లింక్ గురించి తెలుసుకోవడానికి బాగా ఆసక్తి చూపిస్తున్నారు. దీనికి సంబంధించి ఇటీవల ఒక నివేదిక వెలువడింది. ఈ నివేదికలో పరిశ్రమ అధికారులు మరియు నిపుణులు స్టార్ లింకుకి నేరుగా కనెక్ట్ అయ్యే బదులుగా ఎయిర్టెల్ లేదా రిలయన్స్ జియో ద్వారా కనెక్ట్ అవ్వడం చాలా చౌకగా ఉంటుందని తెలిపారు. ఎకనామిక్ టైమ్స్ ఇచ్చిన నివేదిక ప్రకారం ఎయిర్టెల్ మరియు రిలయన్స్ జియో కూడా తమ పోర్టు పోలియోలో స్టార్ లింకును సులభమైన చెల్లింపు మరియు ఇన్స్టాలేషన్ ఎంపికలతో చేర్చవచ్చు అని తెలుస్తుంది. దేశంలోని ప్రజలకు స్టాలిన్ సేవను సరితమైన ఎంపికగా మార్చవచ్చు అని తెలుస్తుంది. అయితే విశ్లేషకులు భారతీయ మార్కెట్లో ఫైబర్ మరియు ఫిక్స్డ్ వైర్లెస్ సేవలు చాలా చౌకైన ఎంపికలుగా ఉంటాయని చెప్తున్నారు. ఈ రెండు సేవలు అందుబాటులో లేని స్టార్లింగ్స్ సేవను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి అనుకుంటున్నారు.
ఈవై ఇండియా మార్కెట్ లీడర్ మరియు టెలికాం సెక్టార్ లీడర్ ప్రశాంత్ సంఘాల ఎకనామిక్ టైమ్స్ తో మాట్లాడుతూ ప్రజలు స్థానిక టెలికం కంపెనీలతో స్టార్ లింక్ భాగస్వామ్యం వల్ల చాలా ప్రయోజనాలు పొందుతారని తెలిపారు. అయితే ఉపగ్రహ ఇంటర్నెట్ కోసం ఉపయోగించే రూటర్ ధర ఎక్కువగా ఉంటుంది. కానీ ఎయిర్టెల్ మరియు జియో చేతులు కలపడం వలన స్టార్టింగ్ రూటర్ల ధర తగ్గవచ్చు. స్టార్ లింక్ ఎయిర్టెల్ మరియు జియో తో ఒప్పందం ప్రజలకు ప్రయోజనకరంగా ఉంటుంది. భారతదేశంలో సాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ ధరలపై ఆధారపడి ఉంటుందని ప్రశాంత్ సింగాల్ చెప్పుకొచ్చారు.
అయితే నిపుణుల అంచనా ప్రకారం ఉపగ్రహ కమ్యూనికేషన్ సేవలు మరియు హార్డ్‌వేర్ ధర చాలా ఎక్కువగా ఉంటుందని తెలుస్తుంది. యుఎస్ లో స్టార్ లింక్ నెలవారి ధరలు 120 డాలర్ల నుంచి 500 డాలర్ల వరకు ఉన్నాయని సమాచారం. వన్ టైం ఆ డ్ వేర్ చార్జర్ కోసం 599 డాలర్ల నుండి 2500 డాలర్ల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అయితే కెన్యా వంటి దేశాలలో ఇది కొంచెం చౌకగానే ఉంటుందని తెలుస్తుంది. అక్కడ నెలవారి ప్రణాళికలో పది డాలర్ల నుంచి ప్రారంభమవుతాయి. హార్డ్‌వేర్ ధర కూడా 178 డాలర్ల నుండి 381 డాలర్ల వరకు ఉంటుందని సమాచారం.