Monkeys: కోతులకు అల్లం రుచి ఎందుకు తెలియదు?
Monkeys: కోతులకు అల్లం రుచి తెలియదు అనే సామెతను విన్నారా? ఇది చిన్నప్పటి నుంచి చాలా మంది వింటూనే పెరుగుతారు. ఎక్కువ వినియోగంలో ఉండే సామెత ఇది.

Monkeys: కోతులకు అల్లం రుచి తెలియదు అనే సామెతను విన్నారా? ఇది చిన్నప్పటి నుంచి చాలా మంది వింటూనే పెరుగుతారు. ఎక్కువ వినియోగంలో ఉండే సామెత ఇది. ఇంతకీ కోతులకు అల్లం రుచి ఎందుకు తెలియదో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? కోతులు ఎప్పుడు చూసినా సరే ఆ పండ్లు, కూరగాయలు తింటాయి. మీరు కూడా ఇదే చూశారు కదా. ఈ మధ్య వింత వింత పదార్థాలను కూడా తింటున్నాయి కొన్ని కోతులు. కానీ ఇవి ముఖ్యంగా పండ్లు, కూరగాయలను మాత్రమే తింటాయి. అయితే ఇవి అల్లం రుచిని ఎందుకు అర్థం చేసుకోలేవు? అనే ప్రశ్న మీకు వచ్చిందా?
ప్రస్తుతం ఫుల్ వినియోగంలో ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఈ ప్రశ్న అడిగితే భలే ఆన్సర్ ఇచ్చింది తెలుసా? తెలిస్తే కచ్చితంగా మీరు షాక్ అవుతారు. తెలుసుకున్న తర్వాత, మీరు కూడా ఈ ఇడియం నిజంగా పూర్తిగా శాస్త్రీయంగా ఉందని కూడా నమ్ముతారు. కోతి, అల్లం గురించి AI ఏమని సమాధానం ఇచ్చిందంటే?
ChatGPT ప్రకారం, కోతుల స్వభావం, వాటి ఆహారపు అలవాట్లు మానవులకు భిన్నంగా ఉంటాయి. అలవాట్లలో ఈ వ్యత్యాసం వాటి అభిరుచిని ప్రభావితం చేస్తుంది. మానవులు వివిధ రకాల ఆహారాలను తీసుకుంటారు. వివిధ వస్తువుల రుచిని ఖచ్చితంగా గ్రహిస్తారు. కానీ కోతులు ఎక్కువగా పండ్లు, ఆకులు, గింజలు, పువ్వులు వంటి వాటిని తింటాయి. ఇవి ఎక్కువగా తీపి, కారం, చేదుగా ఉండేవి కూడా ఉంటాయి. అల్లం వంటి కారంగా ఉండే పదార్థాలు వాటి సహజ ఆహారంలో భాగం కావు అంటుంది చార్ట్ జీపీటీ. సో కోతులు వీటి రుచిని తెలుసుకోలేవు. ఈ కారణంగానే కోతికి అల్లం రుచి తెలియదు అంటుంది ఏఐ.
మానవులలో రుచి గ్రాహకాల పరిణామం, రుచిని గుర్తించే సామర్థ్యం మన ఆహార వ్యవస్థను ప్రభావితం చేస్తాయి. మానవులు రుచి, వాసన, ఆకృతిని గ్రహించగలరు. కానీ కోతుల రుచి ఎక్కువగా వాటి శరీరానికి పోషణను అందించే వాటికే పరిమితం. అల్లం వంటి సుగంధ ద్రవ్యాలు మనకు రుచికరమైనవి. జీర్ణం కావడం సులభం, కానీ కోతులకు అవి అసహజమైన రుచిని కలిగి ఉండవచ్చు.
ఇది కాకుండా, కోతుల జీర్ణవ్యవస్థ కూడా మానవుల జీర్ణవ్యవస్థ కంటే భిన్నంగా ఉంటుంది. అల్లంలో జింజెరాల్ మరియు షోగోల్ వంటి రసాయనాలు ఉంటాయి, ఇవి మన శరీరానికి మేలు చేస్తాయి, కానీ ఈ అంశాలు కోతులకు తగినవి కాకపోవచ్చు. దీని అర్థం కోతుల శరీరాలు అల్లంను జీర్ణించుకోలేవు లేదా అర్థం చేసుకోలేవు కాబట్టి అవి అల్లం రుచి చూడలేవు.
కోతులు వాటి ఆహార ధోరణులు, జీర్ణవ్యవస్థ ప్రకారం వివిధ ఆహారాలను గుర్తించి తీసుకుంటాయని చెప్పవచ్చు. వాటికి అల్లం వంటి అసహజమైన లేదా వాటి శరీరానికి అనారోగ్యకరమైన ఆహారాల గురించి తెలియదు. అందువల్ల కోతులకు అల్లం రుచి తెలియదు. ఎందుకంటే అది వాటి సహజ ఆహారంలో భాగం కాదు. వాటి శరీరం దానిని జీర్ణించుకోలేదు. రుచి చూడలేవు.
Disclaimer : అవగాహన కోసం మాత్రమే ఈ సమాచారం అందిస్తున్నాము. దీన్ని ట్రెండింగ్ తెలుగు నిర్ధారించదు. దయచేసి గమనించగలరు.