UPI Transaction: యూపీఐ ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయ్యి.. అకౌంట్ నుంచి కట్ అయ్యాయా?
UPI Transaction సాంకేతిక కారణాల వల్ల కొన్నిసార్లు ఇలా జరుగుతుంది. అయితే మీరు ఇలా లావాదేవీలు చేసినప్పుడు ఫెయిల్ అయితే వాటిని భద్రపరచుకోవాలి. వెంటనే ఆ కాపీలను జిరాక్స్ తీసి బ్యాంకుకు వెళ్లాలి. అయితే డబ్బులు మళ్లీ రిఫండ్ రావడానికి కాస్త సమయం పడుతుంది.

UPI Transaction: ప్రస్తుతం అంతా కూడా యూపీఐ నడుస్తోంది. ఏ చిన్న వస్తువు కొనుగోలు చేయాలన్నా కూడా తప్పకుండా యూపీఐ వాడుతున్నారు. అసలు నెట్ క్యాష్ వాడటమే మానేశారు. ఆఖరుకి రూపాయి చాక్లెట్ కొన్నా కూడా యూపీఐ పేమెంట్స్ చేస్తున్నారు. దీనివల్ల ఒక రకంగా మంచి జరగుతోంది. మరోరకంగా చూస్తే నష్టం కూడా ఉంది. ఎందుకంటే అంతా ఆన్లైన్ అయిపోతే సైబర్ క్రైమ్‌లు కూడా ఎక్కువగా పెరుగుతున్నాయి. మళ్లీ తెలిసో తెలియక ఇతరుల అకౌంట్‌కి పంపించండం, తెలిసిన వారికి పంపిన తర్వాత కూడా వారికి వెళ్లకపోవడం ఇలా ఎన్నో సమస్యలు ఉంటాయి. అయితే కొందరు అవసరాల కోసం డబ్బులు పంపిస్తారు. అలాంటి సమయాల్లో డబ్బులు అయితే కట్ అవుతాయి. కానీ ఇతరుల అకౌంట్‌కి అయితే అసలు వెళ్లవు. ఇలాంటి సమయాల్లో చాలా మంది ఇబ్బందులు పడతారు. అయితే అకౌంట్ నుంచి కట్ అయిన డబ్బులు.. వేరే వాళ్లకి అకౌంట్లోకి వెళ్లకపోతే ఏం చేయాలో ఈ స్టోరీలో చూద్దాం.
సాంకేతిక కారణాల వల్ల కొన్నిసార్లు ఇలా జరుగుతుంది. అయితే మీరు ఇలా లావాదేవీలు చేసినప్పుడు ఫెయిల్ అయితే వాటిని భద్రపరచుకోవాలి. వెంటనే ఆ కాపీలను జిరాక్స్ తీసి బ్యాంకుకు వెళ్లాలి. అయితే డబ్బులు మళ్లీ రిఫండ్ రావడానికి కాస్త సమయం పడుతుంది. కాబట్టి మీరు అన్ని వివరాలను ఉంచుకోవాలి. మీకు అకౌంట్ బ్యాంకు లేదా కస్టమర్ కేర్‌ను సంప్రదించితే నిర్ణీత సమయంలో డబ్బులు మీ అకౌంట్లోకి వస్తాయి. అప్పటికీ కూడా డబ్బులు మీ అకౌంట్లోకి రాకపోతే మాత్రమే యూపీఐ యాప్ సపోర్ట్ టీమ్‌ను సంప్రదించవచ్చు. మీరు ఏ యాప్ నుంచి పంపించారో అందులో కంప్లైంట్ కూడా రైజ్ చేయవచ్చు. మీరు డబ్బులు లావాదేవీలు చేసిన సమయం, తేదీ అన్ని వివరాలను కూడా అందులో ఎంటర్ చేస్తే మీకు బ్యాంక్ కస్టమర్ సర్వీస్ కాల్ వస్తుంది. అప్పుడు మీరు బ్యాంక్ బ్రాంచ్‌ను సంప్రదిస్తే సరిపోతుంది. అప్పటికీ కూడా డబ్బులు రాలేదంటే.. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వెబ్‌సైట్‌కి వెళ్లి కూడా ఫిర్యాదు చేయవచ్చు. మీరు ఇలా ఫిర్యాదు చేసినా కూడా రాకపోతే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకింగ్ అంబుడ్స్‌మన్‌కి ఫిర్యాదు చేయవచ్చు. యూపీఐ లావాదేవీలకు సంబంధించిన అన్ని వివాదాలను కూడా ఇలా ఈజీగా పరిష్కరించుకోవచ్చు.
ప్రస్తుతం రోజుల్లో సైబర్ క్రైమ్‌లు ఎక్కువగా జరుగుతున్నాయి. యూపీఐ వాడటం వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో.. అంతే నష్టాలు కూడా ఉన్నాయి. యూపీఐ వాడటం వల్ల కొన్నిసార్లు బాగా ఉపయోగపడుతుంది. బయటకు వెళ్లకుండానే ఇంటి దగ్గరకే అన్ని కూడా తెచ్చుకోవచ్చు. అయితే ఈ యూపీఐ వల్ల చదువు లేకపోయిన వారు ఎక్కువగా ఇబ్బందులు పడుతున్నారు. చాలా మంది ఈ యూపీఐ ద్వారా కోట్ల డబ్బులు కాజేస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఎక్కువగా సైబర్ క్రైమ్ మోసాలు జరుగుతున్నాయి. కాబట్టి డబ్బులు పంపించేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి.