Sunita Williams: కొన్నాళ్లు జీవితం భారమే.. ఆమెకు వచ్చే ఆరోగ్య సమస్యలివే
Sunita Williams: నాసా ఆస్ట్రోనాట్స్ సునీత విలియమ్స్ అండ్ బుచ్ విల్ మోర్ భూమ్మీదకి అడుగుపెట్టారు. దాదాపు తొమ్మిది నెలల తర్వాత వీరిద్దరూ నేలపైకి వచ్చారు.

Sunita Williams: నాసా ఆస్ట్రోనాట్స్ సునీత విలియమ్స్ అండ్ బుచ్ విల్ మోర్ భూమ్మీదకి అడుగుపెట్టారు. దాదాపు తొమ్మిది నెలల తర్వాత వీరిద్దరూ నేలపైకి వచ్చారు. అయితే ఇప్పుడు మీరు నేలపై జీవనానికి అలవాటు పడాలంటే కొన్ని వారాలు పడుతుంది. సాధారణంగా భూమి మీద నుంచి 400 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో భారరహిత స్థితిలో తెలియడం అందరికీ సరదాగానే అనిపిస్తుంది. కానీ ఆ తర్వాత నేలపైకి వచ్చేసరికి వారు ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా గురుత్వాకర్షణ లేమి కారణంగా దీర్ఘకాలిక రోదసి యాత్రిలకు ఆరోగ్యం పై ప్రభావం చూపుతుంది. అంతేకాకుండా వారు అంతరిక్ష కేంద్రం నుంచి నేల మీదకి తిరిగి వచ్చాక.. సరిగా చూడలేకపోవడం, నడవలేకపోవడం, పక్కకు తిరగడం, నిలబడడం వంటి చర్యల్లో ఎన్నో ఇబ్బందులు పడతారు.
ఎముకలు, కండరాళ్లు
వ్యోమగాములు రోదసిలో ఉన్నప్పుడు గురుత్వాకర్షణలేమి కారణంగా నడక, కదలికల కోసం ఎక్కువగా శ్రమించాల్సిన అవసరం ఉండదు. దీని ఫలితంగా కండరాలు, ఎముకలపై అధిక భారం పడదు. అదే వీరికి ఇప్పుడు ఒక సమస్యగా మారుతుంది. దీనివల్ల ఎముకలు కండరాల్లో క్షీణత మొదలవుతుంది. ఇప్పుడు వీరు నేలపైకి రావడంతో నడవాలన్నా, నిల్చోవాలన్నా ఇబ్బంది పడాల్సి ఉంటుంది. ఈ సమస్య వల్ల వ్యోమగాములకు ఎముకలు విరిగే ముప్పు ఎక్కువగా ఉంటుంది. ఎముకల సాంద్రత తిరిగి సాధారణ స్థితికి రావడానికి దాదాపు నాలుగు సంవత్సరాల వరకు పట్టే అవకాశం ఉంది.
అలాగే శరీరం పై గురుత్వాకర్షణ శక్తి లేకపోతే కండరాలు చాలా బలహీన పడిపోతాయి. దీనివల్ల కూర్చున్నప్పుడు, నిలబడినప్పుడు మేడ, వీపు, పిక్కలు వంటి భాగాల్లోని కండరాలపై ఎక్కువగా ప్రభావం చూపుతుంది.
నిలకడ
రోదసిలో బార రహిత స్థితి వల్ల వెస్టిబ్యులర్ అవయవాలకు అందే ఇన్ఫర్మేషన్ చాలా వరకు మారిపోతుంది. దీని కారణంగా మెదడులో గందరగోళం ఏర్పడుతుంది. అదే సమయంలో కళ్ళు తిరగడం, కడుపులో వికారం, తలనొప్పి, వాంతులతో సహా మరెన్నో సమస్యలు వస్తాయి.
కంటి చూపు
రోదసిలో ఎక్కువ కాలం ఉండే వ్యోమ గాములు భూమ్మీదకి వచ్చిన తర్వాత వారి కంటి చూపు క్షీణిస్తుంది. కంట్లో అనేక రకమైన మార్పులకు ఆస్కారం ఉంటుంది.