Thermometer On Plane: విమానంలోకి థర్మామీటర్ కు నో ఎంట్రీ? ఎందుకంటే?
Thermometer On Plane: ఎక్కువ దూరం వెళ్ళాలి అంటే బెస్ట్ వే విమానం. దీన్ని ఎక్కితే గంటల్లోనే ఎక్కడికి అయినా సరే చేరుకోవచ్చు. కానీ విమానం ఎక్కాలంటే కొన్ని నియమాలను పాటించాలి.

<h3>Thermometer On Plane</h3>: ఎక్కువ దూరం వెళ్ళాలి అంటే బెస్ట్ వే విమానం. దీన్ని ఎక్కితే గంటల్లోనే ఎక్కడికి అయినా సరే చేరుకోవచ్చు. కానీ విమానం ఎక్కాలంటే కొన్ని నియమాలను పాటించాలి. ఆ ప్రొటోకాల్స్ ఉపయోగిస్తేనే మీరు లోపలికి అలో ఉంటుంది. లేదంటే ఉండదు. వీటి వల్ల ఎవరికి ఇబ్బంది కలగదు. ఎవరికి ఇబ్బంది కలగకుండా వారు చాలా నియమాలను పాటిస్తారు. ఈ భద్రతను దృష్టిలో ఉంచుకొని విమానంలో కొన్ని వస్తువులను తీసుకెళ్లవద్దు అంటారు. అవి నిషేధం విమానంలో…అందులో ఒకటి ధర్మామీటర్. మరి దీన్ని ఎందుకు నిషేధించారు. తీసుకొని వెళ్తే ఏం జరుగుతుంది వంటి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
పాదరసం మానవులకు చాలా డేంజర్. ఇదొక భారీ లోహం. మానవ శరీరానికి, ముఖ్యంగా నాడీ వ్యవస్థ, మూత్రపిండాలు, మెదడుకు చాలా హానికరం. థర్మామీటర్ పగిలి పాదరసం బహిర్గతమైతే, అది గాలిలోకి ఆవిరైపోయి ప్రయాణీకులకు తీవ్రమైన ఆరోగ్య ప్రమాదాన్ని కలిగిస్తుంది అంటున్నారు నిపుణులు. విమానం మూసివేసిన వాతావరణంలో ఈ సమస్య మరింత ఎక్కువ అవుతుంది. దీని వల్ల చాలా ప్రమాదం కూడా జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే అక్కడ గాలి కదలిక చాలా పరిమితంగా ఉంటుంది.
దీన్ని గనుక తెలియకుండా విమానంలోకి తీసుకొని వెళ్తే భద్రత ప్రమాదం సంభవిస్తుంది. పాదరసం ఇతర లోహాలతో, ముఖ్యంగా విమాన నిర్మాణంలో ప్రధానంగా ఉపయోగించే అల్యూమినియంతో చర్య జరుపుతుంది. అల్యూమినియం పాదరసం ప్రభావానికి గురైనప్పుడు బలహీనపడుతుంది. విమానం నిర్మాణాన్ని దెబ్బతీసే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది అంటున్నారు నిపుణులు. ఇది విమానం, ప్రయాణీకుల భద్రతకు తీవ్రమైన ముప్పును కలిగిస్తుంది.
పాదరసం ప్రమాదాల కారణంగా, విమానయాన అధికారులు పాదరసం కలిగిన పరికరాలను విమానాలలో తీసుకెళ్లడానికి అలో చేయరు. ప్రయాణీకులు, విమాన సిబ్బంది భద్రత కోసం ఈ నియమాలు కచ్చితంగా తీసుకొని వచ్చారు కాబట్టి కచ్చితంగా పాటించాల్సిందే. ఈ రోజుల్లో, పాదరసం థర్మామీటర్ల స్థానంలో, డిజిటల్ థర్మామీటర్లు చాలా వరకు అందుబాటులో ఉన్నాయి. ఇవి పాదరసం కంటే సురక్షితమైనవే. కాబట్టి అవసరమైతే, మీరు విమానంలో పాదరసం థర్మామీటర్‌కు బదులుగా డిజిటల్ థర్మామీటర్‌ను తీసుకొని వెళ్లవచ్చు.
పాదరసం థర్మామీటర్లను విమానంలోకి తీసుకొని వెళ్లకూడదు అని తెలుసు కాబట్టి మీరు కూడా ఈ సారి వెళ్తే అసలు తీసుకొని వెళ్లకండి. విమానంలో థర్మామీటర్ తో ఎవరైనా మీ కంట పడినా సరే వారికి ఈ విషయం చెప్పండి. అయితే విమానంలోకి కొబ్బరిని కూడా తీసుకొని వెళ్లవద్దు. దీనికి కూడా రీజన్ ఉంది. ఆ విషయం మనం ఇంకో స్టోరీలో తెలుసుకుందాం. బట్ మీరు మాత్రం ఈ రెండింటిని స్కిప్ చేసేయండి.
Disclaimer : అవగాహన కోసం మాత్రమే ఈ సమాచారం అందిస్తున్నాము. దీన్ని ట్రెండింగ్ తెలుగు నిర్ధారించదు. దయచేసి గమనించగలరు.