New Phone Setting : కొత్త మొబైల్ కొన్నారా.. ఈ సెట్టింగ్స్ మార్చడం మరిచిపోవద్దు

New Phone Setting :
ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్ యుగం నడుస్తోంది. చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకు అందరూ కూడా మొబైల్ వాడుతున్నారు. ముఖ్యంగా ఎప్పటి కప్పుడూ మొబైల్స్ మారుస్తున్నారు. మార్కెట్‌లోకి ఏ కొత్త మొబైల్ వచ్చినా సరే వెంటనే కొనేస్తున్నారు. అయితే కొత్త మొబైల్ అంటే కొత్తగా ఉంటుంది. ఎవరు వాడరు కాబట్టి ఎలాంటి సెట్టింగ్‌లు కూడా మారి ఉండవని అనుకుంటారు. కానీ కొత్త ఫోన్ కొన్న తర్వాత కూడా కొన్ని సెట్టింగ్‌లు మార్చాలి. లేకపోతే మీ ఫోన్ పనితీరు సరిగ్గా ఉండదట. కొత్త ఫోన్ కొన్న తర్వాత తప్పకుడా సెట్టింగ్స్ మారిస్తేనే మీరు చక్కగా ఉపయోగించుకోగలరు. అయితే కొత్త ఫోన్ కొన్న తర్వాత మార్చుకోవాల్సిన ఆ సెట్టింగ్స్ ఏంటో ఈ స్టోరీలో చూద్దాం.
మొబల్ కొత్తది కొన్న తర్వాత మంచిగా వర్క్ చేయాలంటే తప్పకుండా కొన్ని సెట్టింగ్స్ మార్చాలి. మీరు మొబైల్ కొన్న తర్వాత స్క్రీన్ లాక్‌ను స్ట్రాంగ్‌గా పెట్టుకోవాలి. మీరు దీనికోసం పిన్ లేదా ఫింగర్, ఫేస్ లాక్ ఇలా ఏదో ఒకటి పెట్టుకోవచ్చు. దీంతో పాటు ఫైండ్ మై డివైజ్‌ను ఎనేబుల్ చేయాలి. ఎందుకంటే సడెన్‌గా మీ మొబైల్ పోతే వెంటనే గుర్తించివచ్చు. అలాగే మీ డేటాను కూడా క్లియర్ చేయవచ్చు. కొత్త మొబైల్ అంటే ఏం అప్‌డేట్ చేయకపోయినా పర్లేదని కొందరు అనుకుంటారు. కానీ కొత్త మొబైల్‌ను కూడా అప్‌డేట్ చేయాలి. ఆటోమెటిక్ అప్‌డేట్ ఆన్ చేయాలి. దీంతో ఫోన్‌లో ఉన్న కొత్త సాఫ్ట్‌వేర్, సెక్యూరిటీ ప్యాచ్‌లు ఆటోమేటిక్‌గా అవి అప్‌డేట్ అవుతాయి. కాబట్టి మీరు ఆటోమెటిక్ ఆప్‌డేట్ ఆప్షన్ ఎంచుకోవాలి. కొత్త మొబైల్‌లో కొన్ని ప్రీ ఇన్ స్టాల్ చేసిన యాప్స్ అనేవి ఉంటాయి. వీటిని కొందరు వాడరు. వీటివల్ల స్టోరేజీ, బ్యాటరీ కూడా వేస్ట్. కాబట్టి వీటిని వెంటనే తొలగించండి. ఎక్కువ స్టోరేజ్ కనుక ఆక్రమించి ఉంటే తప్పకుండా తొలగించండి. కొత్త ఫోన్ బ్యాటరీ బాగా కాస్తు్ందని ఎక్కువగా వాడవద్దు. ఆటోమెటిక్‌గా తగ్గుతుంది. కాబట్టి బ్యాటరీ సేవర్ మోడ్‌ను ఆన్ చేసుకోండి. అలాగే ఏయే యాప్స్ ఎక్కువగా బ్యాటరీని వినియోగిస్తున్నాయో వాటిని కట్టుదిట్టం చేయండి. దీనివల్ల మీ మొబైల్ ఛార్జింగ్ తొందరగా కాదు.
కొందరు కొత్త మొబైల్ అని ఎక్కువగా వాడుతుంటారు. అలాగే ఎక్కువ సమయం ఛార్జింగ్ పెడుతుంటారు. అయితే రోజులో ఎక్కువ సార్లు ఛార్జింగ్ పెట్టకూడదు. ఒకేసారి పెట్టాలి. 20 శాతం కంటే తక్కువగా ఛార్జింగ్ అయితే వెంటనే పెట్టాలి. అలాగే మొబైల్‌కి ఫుల్ ఛార్జింగ్ పెట్టకూడదు. 95 వచ్చే సరికి ఆపేయాలి. 20 కంటే తక్కువగా ఉన్నప్పుడు ఎక్కువగా మొబైల్ వినియోగించవద్దు. అలాగే ఛార్జింగ్ పెట్టుకుంటూ మొబైల్స్ వాడవద్దు. వీటివల్ల మొబైల్ తొందరగా పాడవుతుంది. కాబట్టి సెట్టింగ్స్ మారుస్తూ.. నియమాలు పాటించండి.