Ghibli Trend: జిబ్లీ ట్రెండ్ ట్రై చేస్తున్నారా.. ఈ విషయం తెలిస్తే దాని జోలికి అసలు పోరు
Ghibli Trend జిబ్లీ ట్రెండ్‌ను క్రియేట్ చేయడానికి మీ ఫొటోలను ఏఐ చాట్ జీపీటీలో వేస్తారు. అయితే మీకు తెలియకుండానే మీ ఐడెంటిటీని మీరు ఇతరులకు ఇస్తున్నారు. దీనివల్ల భవిష్యత్తులో మీ ఫొటోలు దుర్వినియోగం అయ్యే అవకాశం ఉందని టెక్ నిపుణులు చెబుతున్నారు.

Ghibli Trend: సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి రోజూ ఏదో ఒకటి ట్రెండ్ అవుతూనే ఉంటుంది. అయితే గత రెండు రోజుల నుంచి సోషల్ మీడియాలో జిబ్లీ ఫొటోస్ ట్రెండ్ అవుతున్నాయి. ఏఐ చాట్ జీపీటీతో ఒరిజినల్ ఫొటోస్ పెడితే కార్టూన్‌లా చేసి మనకి ఇస్తుంది. ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా ఇవే ఫొటోలు ట్రెండ్ అవుతున్నాయి. ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, ఎక్స్ ఇలా ఏది ఓపెన్ చేసినా కూడా జిబ్లీ ఫొటోస్ ట్రెండ్ అవుతున్నాయి. అయితే ఏదో సరదాకి వీటిని చేసినా కూడా వీటివల్ల ప్రమాదం పొంచి ఉందని సైబర్ సేఫ్టీ అధికారులు అంటున్నారు. సామాన్య మనుషులు నుంచి సెలబ్రిటీల వరకు అందరూ కూడా ఈ జిబ్లీ ట్రెండ్‌ను ఫాలో అవుతున్నారు. వారి ఫొటోలను క్రియేట్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ జిబ్లీ ట్రెండ్ బాగా అవుతుంది. ఏ సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్ ఓపెన్ చేసినా కూడా ఇదే ట్రెండ్ కనిపిస్తోంది. అయితే ఈ జిబ్లీ ట్రెండ్ ఫొటోలు ఎందుకు ప్రమాదకరం? వీటివల్ల భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు వస్తాయో పూర్తి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం.
జిబ్లీ ట్రెండ్‌ను క్రియేట్ చేయడానికి మీ ఫొటోలను ఏఐ చాట్ జీపీటీలో వేస్తారు. అయితే మీకు తెలియకుండానే మీ ఐడెంటిటీని మీరు ఇతరులకు ఇస్తున్నారు. దీనివల్ల భవిష్యత్తులో మీ ఫొటోలు దుర్వినియోగం అయ్యే అవకాశం ఉందని టెక్ నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే గతంలో కూడా ఇలాంటి సంఘటనలే జరిగాయి. గతేడాది ఆస్ట్రేలియన్ కంపెనీ ఔటాబాక్స్ డేటా లీక్ కావడంతో సమస్య తలెత్తింది. మొత్తం 1.05 మిలియన్ల మంది ఫేస్ స్కాన్ ఐడెంటిటీ, డ్రైవింగ్ లైసెన్స్‌లు, అడ్రస్ ఫ్రూఫ్‌లు లీక్ అయ్యాయి. హేవ్ ఐ బీన్ ఔటాబాక్స్డ్ అనే సైట్‌లో ఉంచడం వల్ల వారి డేటా లీక్ అయ్యింది. దానికి దీనికి లింక్ ఏంటని మీరు అనుకోవచ్చు. అయితే మీరు జిబ్లీ ట్రెండ్‌ను క్రియేట్ చేయడానికి ఫొటోలు అప్‌లోడ్ చేస్తారు. దీంతో సైబర్ నేరగాళ్లు డీప్ ఫేక్ క్రియేట్ చేసి మిమ్మల్ని బెదిరించవచ్చు.
జిబ్లీ ఫొటోలను క్రియేట్ చేయాలంటే ఏఐ చాట్ జీపీటీలో రోజుకి రెండు మాత్రమే అవుతాయి. అయితే ఎక్కువ కావాలని అనుకునే వారు డబ్బులు చెల్లించి మరి క్రియేట్ చేసుకుంటున్నారు. మీకు తెలియకుండానే డబ్బులు పెట్టి కొని మీ డేటాను ఇతరులకు అమ్ముతున్నారు. దీనివల్ల మీ ఫ్యూచర్‌కు భంగం కలుగుతుంది. మీ పర్సనల్ డేటా అంతా కూడా లీక్ అయిపోతుంది. కాబట్టి ఊరికే ట్రెండ్‌ను ఫాలో కావద్దు. మీరు డబ్బులు పెట్టి మరి మీ లైఫ్‌ను ఇరకాటంలో పెట్టవద్దు. ఇలా చేస్తే భవిష్యత్తులో సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా జిబ్లీ ట్రెండ్ ఆపండి.