Antutu Score: ఫోన్ కొంటున్నారా? ఈ స్కోర్ తప్పక చూడాల్సిందే?
Antutu Score ప్రపంచవ్యాప్తంగా దీని ఆధారంగానే మొబైల్ ఫోన్స్ కొంటుంటారు. అందువల్లనే ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీలు సైతం అత్యధిక స్కోర్ తమ మొబైల్ దే అంటూ ప్రచారం చేసుకుంటుంటాయి.

Antutu Score: ప్రపంచవ్యాప్తంగా మొబైల్ ఫోన్స్ వినియోగించే వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. ఒకప్పుడు కేవలం ఫోన్ కెమెరా ఎంత, బ్యాటరీ బ్యాకప్ ఎన్ని రోజులు వస్తుంది అనేది చూసేవారు. కానీ ఇప్పుడు మాత్రం ఫోన్ గేమ్ కోసం పనికొస్తుందా?.. దాని ప్రాసెసర్ ఎంత?.. దానితో గేమ్ స్పీడ్ గా రన్ అవుతుందా? లేదా అనేవి చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆంటుటు స్కోర్ అనే పదం విపరీతంగా వినిపిస్తోంది. అందువల్ల ఆంటుటు అంటే ఏంటి?.. అది మొబైల్ ఫోన్లకు ఎలా యూజ్ అవుతుంది. దానిని ఎలా కొలుస్తారు? అనేది పూర్తిగా తెలుసుకుందాం. స్మార్ట్ ఫోన్స్ లేదా ట్యాబ్ ల సామర్థ్యాన్ని కొలిచే బెంచ్ మార్క్ ఇండెక్స్ లలో ఆంటుటు స్కోర్ ఒకటిగా ఉంది.
ప్రపంచవ్యాప్తంగా దీని ఆధారంగానే మొబైల్ ఫోన్స్ కొంటుంటారు. అందువల్లనే ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీలు సైతం అత్యధిక స్కోర్ తమ మొబైల్ దే అంటూ ప్రచారం చేసుకుంటుంటాయి. ఈ ఆంటుటు స్కోర్ ద్వారానే మొబైల్ గ్రాఫిక్స్, ఫోన్ స్పీడ్, ఫోన్ ర్యామ్, యూజర్ ఎక్స్పీరియన్స్ వంటి వాటిని టెస్ట్ చేసి సామర్థ్యాన్ని తెలుసుకుంటారు. వీటన్నింటినీ కలిపి ఒక నెంబర్ రూపంలో ఇచ్చేదానిని ఆంటుటు స్కోర్ అంటారు. అయితే ఈ ఆంటుటు స్కోర్ ఎక్కువగా ఉండే మొబైల్ అంత శక్తివంతమైనదిగా.. వేగవంతమైనదిగా అర్థం చేసుకోవచ్చు. ఎక్కువ ఆంటుటు స్కోరు ఉంటే ఎన్ని యాప్స్ డౌన్లోడ్ చేసిన ఏం కాదు. ఎలాంటి గేమింగ్స్ ఆడిన ఫోన్ హ్యాంగ్ అవ్వదు. పెద్ద పెద్ద ఆన్లైన్ గేమ్స్ కూడా ఆడుకోవచ్చు. ఒకవేళ తక్కువ స్కోరు ఉంటే మాత్రం ఫోన్ త్వరగా హ్యాంగ్ అయిపోతుంది. అలాగే స్క్రీన్ ఆగిపోవడం, యాప్స్ పని చేయకపోవడం ఇలాంటి ఇబ్బందులు ఎదురవుతాయి.
అయితే ఈ ఆంటుటు స్కోర్ ఎవరికి ఎక్కువగా యూజ్ అవుతుందో తెలుసుకుందాం. మొబైల్ కొనేటప్పుడు కేవలం కెమెరా లేదా కాల్స్ కోసం అనుకునే వారు ఈ ఆంటుటు స్కోర్ గురించి పట్టించుకోవలసిన పనిలేదు. కానీ బెస్ట్ గేమింగ్ కోసం వాడాలి అనుకునే వాళ్ళకి మాత్రం ఈ ఆంటుటు స్కోర్ చాలా అవసరం.
ఎంట్రీ లెవెల్ ఫోన్లలో 2,00,000 నుంచి 4,00,000 ఆంటుటు స్కోర్ ఉంటుంది. ఫోన్ కాల్స్, మెసేజెస్, నార్మల్ యాప్స్ వినియోగించే వారికి సరిపోతుంది.
మిడ్ రేంజ్ ఫోన్లలో 4,00,000 నుంచి 7,00,000 స్కోర్ తో వస్తాయి. గేమ్స్, మల్టీ టాస్కింగ్ యూజ్ చేసే వారికి ఈ స్కోర్ సరిపోతుంది.
ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్స్ లో 7,00,000 నుంచి 15,00,000+ స్కోరును కలిగి ఉంటుంది. వీడియో ఎడిటింగ్, హై అండ్ గేమ్స్, మరిన్ని పెద్ద పెద్ద వాటిని హ్యాండిల్ చేయాలంటే స్కోర్ ఉండాల్సిందే.
అయితే ఈ ఆంటుటు స్కోర్ స్కోర్ అనేది చైనీస్ యాప్. దీనిని కంపెనీ అఫీషియల్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆ వెబ్ సైట్లో ర్యాంకింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని సెలెక్ట్ చేయగానే లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ల స్కోర్ కనిపిస్తుంది. ఈ స్కోర్ లో మొదటి ప్లేస్ లో ఐక్యూ మొబైల్ ఉంది. ఈ మొబైల్ 13,26,98,668 స్కోర్ తో ఫస్ట్ ప్లేస్ లో కొనసాగుతోంది. ఎక్కువగా మొబైల్ ఫోన్లను మార్కెట్లో రిలీజ్ చేసినప్పుడు ఆ కంపెనీలు తమ స్కోర్ ను డిస్ప్లే చేస్తూ ఉంటాయి.