Android mobiles : ఆండ్రాయిడ్ యూజర్లకు బిగ్ షాక్.. కేంద్రం హెచ్చరికలు జారీ
Android mobiles: ఆండ్రాయిడ్ యూజర్ల డేటా హ్యాక్ అవుతుందని, దీనివల్ల వినియోగదారులకు ఇబ్బంది ఏర్పడుతుందని తెలిపింది. హ్యాకర్లు డేటాను దొంగలిస్తారని వెల్లడించింది. అయితే ఆండ్రాయిడ్ 13, 14,15 వెర్షన్లకు ముందు ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌లు ఎక్కువగా హ్యాక్ అవుతాయని తెలిపింది.

Android mobiles : ప్రస్తుతం అందరూ కూడా ఎక్కువగా మొబైల్స్ వాడుతున్నారు. కొందరు ఐఫోన్ వాడితే మరికొందరు ఆండ్రాయిడ్ వాడుతున్నారు. నిజానికి ఎక్కువ శాతం మంది ఆండ్రాయిడ్ మొబైల్స్ వాడుతున్నారు. అయితే ఆండ్రాయిడ్ మొబైల్స్ వాడేవారికి కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం ఈ విషయాన్ని తెలిపింది. ఆండ్రాయిడ్ యూజర్లకు ఎక్కువగా ప్రమాదం పొంచి ఉందని వెల్లడించింది. ఆండ్రాయిడ్ యూజర్ల డేటా హ్యాక్ అవుతుందని, దీనివల్ల వినియోగదారులకు ఇబ్బంది ఏర్పడుతుందని తెలిపింది. హ్యాకర్లు డేటాను దొంగలిస్తారని వెల్లడించింది. అయితే ఆండ్రాయిడ్ 13, 14,15 వెర్షన్లకు ముందు ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌లు ఎక్కువగా హ్యాక్ అవుతాయని తెలిపింది.
ఆండ్రాయిడ్ పర్యావరణ వ్యవస్థలోని వివిధ భాగాల నుంచి సమస్యలు వస్తున్నాయి. వీటిలో సిస్టమ్ ఫ్రేమ్ వర్క్‌లోని లోపాలు ఉన్నాయని గుర్తించింది. గూగుల్సిస్టమ్ అప్డేట్లను ప్లే చేసి డేటా హ్యాక్ అయినట్లు గుర్తించారు. దీనివల్ల సైబర్ దాడులు ఇంకా ఎక్కువగా జరుగుతాయని వెల్లడించారు. పాస్వర్డ్, ఆర్థిక వివరాలు, లావాదేవీలు ఇలాంటి వాటి డేటాను దొంగతనం చేసే అవకాశం ఎక్కువగా ఉందని గుర్తించారు. అయితే ఎవరైతే ఎక్కువగా స్మార్ట్‌ఫోన్ వాడుతున్నారో వారికే ఎక్కువగా ప్రమాదం ఉంటుంది. ఈ ప్రపంచంలో చాలా మంది ఆండ్రాయిడ్ మొబైల్ వాడుతున్నారు. ఇలాంటి వారందరికీ కూడా ఈ సమస్య ఉందని అంటున్నారు.
ప్రస్తుతం రోజుల్లో అందరూ కూడా స్మార్ట్ ఫోన్లు వాడుతున్నారు. వీటివల్ల ఉపయోగాలు కంటే నష్టాలు కూడా ఉన్నాయి. వీటిని చూసి యువత బాగా చెడు అలవాట్లు నేర్చుకుంటుంది. అలాగే అంతా ఆన్లైన్ కావడంతో సైబర్ క్రైమ్ కూడా ఎక్కువగా జరుగుతోంది. ఈ ఆండ్రాయిడ్ యూజర్లకు ఇలాంటి మోసాలు ఇంకా ఎక్కువగా జరుగుతాయని అంటున్నారు. ఇదే కనుక జరిగితే ఎన్ని స్కామ్‌లు ఇంకా జరుగుతాయో చూడాలి. ఇప్పుడున్న రోజుల్లో అయితే చాలా వరకు మొబైల్‌తో మోసాలు జరుగుతున్నాయి. ఎక్కువగా సైబర్ క్రైమ్‌లు జరుగుతున్నాయి. వీటివల్ల చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. అందులోనూ వృద్ధులు అయితే చాలా డబ్బులు పోగోట్టుకుంటున్నారు. ఎందుకంటే సైబర్ నేరగాళ్లు వారిని ఏదో ఒకటి చెప్పి నమ్మిస్తున్నారు. దీనివల్ల వారి దగ్గర ఉన్న కోట్ల డబ్బు పోతుంది. ఇలాంటి సంఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఇకపై పర్సనల్ డేటా కూడా దొంగలించనున్నారు. దీనివల్ల ఇంకా సైబర్ మోసాలు పెరుగుతాయని అంటున్నారు.