IPL 2025: ఐపీఎల్ 18వ సీజన్ లో 10 టీమ్ లు.. గెలిచే జట్టు ఏదంటే..

IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్ కు రంగం సిద్ధమైంది. మార్చి 22 నుంచి రిచ్ క్రికెట్ లీగ్ మొదలుకానుంది. కోల్ కతా లోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా డిపెండింగ్ ఛాంపియన్ కోల్ కతా, బెంగళూరు జట్లు తొలి మ్యాచ్ ఆడనున్నాయి.
గత సీజన్లో బెంగళూరు, కోల్ కతా రెండుసార్లు తలపడ్డాయి. రెండుసార్లు కూడా కోల్ కతా విజయం సాధించింది. అంతేకాదు ఆ సీజన్లో కోల్ కతా విజేతగా నిలిచింది. అయితే మెగా వేలంలో బెంగళూరు జట్టు గతంలో కంటే గొప్ప గొప్ప ఆటగాళ్లను కొనుగోలు చేసింది. కోల్ కతా జట్టు మాత్రం గత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ను కొనుగోలు చేయలేదు. దీంతో అతడు పంజాబ్ జట్టుకు నాయకుడు అయిపోయాడు. ప్రస్తుతం కోల్ కతా జట్టుకు రహానే నాయకత్వం వహిస్తున్నాడు. ఇతడి ఆధ్వర్యంలో కోల్ కతా జట్టు కొత్త శిఖరాలను అధిరోహిస్తుందని మేనేజ్మెంట్ భావిస్తోంది. ఇక ఈ సీజన్లో 10 జట్లు ట్రోఫీ కోసం పోటీ పడుతున్నాయి. అన్ని జట్లూ బలంగా ఉన్నప్పటికీ.. ప్రధాన పోటీ మాత్రం నాలుగు జట్ల మధ్య మాత్రమే ఉంటుందని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.
బ్యాటింగ్ లైనప్ ప్రకారం..
బ్యాటింగ్ లైనప్ ప్రకారం హైదరాబాద్ జట్టు బలంగా కనిపిస్తోంది. హెడ్, క్లాసెన్, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, అభిషేక్ శర్మ పెను విధ్వంసాన్ని సృష్టించగలరు. క్షణంలో మ్యాచ్ స్వరూపాన్ని పూర్తిగా మార్చేయగలరు. ఇక బౌలింగ్ లోనూ హైదరాబాద్ జట్టు బలంగా ఉంది. కమిన్స్, మహమ్మద్ షమి గొప్పగా బౌలింగ్ చేయగలరు.. గత సీజన్లో హైదరాబాద్ జట్టు వెంట్రుక వాసిలో కప్ ను కోల్పోయింది. ఈసారి మాత్రం ఆ అవకాశానికి తావు ఇవ్వకూడదని హైదరాబాద్ జట్టు భావిస్తోంది. అందువల్లే బలంగా ఆడాలని.. ట్రోఫీ కొట్టాలని అనుకుంటున్నది.
ఇక ముంబై జట్టు కూడా ఈ టోర్నీలో టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతోంది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ , హార్దిక్ పాండ్యా, బుమ్రా, సూర్య కుమార్ యాదవ్, తిలక్ వర్మ వంటి వారితో అత్యంత దుర్భేద్యంగా ముంబై జట్టు ఉంది. అయితే గత సీజన్లో ముంబై జట్టు అంతగా ఆకట్టుకోలేదు. కెప్టెన్ మార్పు వల్ల జట్టులో సానుకూలత లేకుండా పోయింది. మరి ఈసారి ఎలా ఆడుతుందనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే ముంబై జట్టు ఐదుసార్లు ఛాంపియన్ గా అవతరించిన విషయం తెలిసిందే.
చెన్నై జట్టు కూడా బలంగా కనిపిస్తోంది రుతు రాజ్ గైక్వాడ్ ఆధ్వర్యంలో చెన్నై జట్టు గత సీజన్లో మెరుగైన ఆట తీరు ప్రదర్శించింది. అంతకుముందు సీజన్లో గుజరాత్ జట్టును ఓడించి చెన్నై విజేతగా నిలిచింది.. గత సీజన్లో ప్లే ఆఫ్ దశ దాకా వచ్చింది. రచిన్ రవీంద్ర, మహేంద్ర సింగ్ ధోని, కాన్వే, రాహుల్ త్రిపాటి వంటి వారితో బలంగా కనిపిస్తోంది. ఇప్పటివరకు చెన్నై జట్టు ఐదుసార్లు విజేతగా నిలిచింది. మరి ఈ సీజన్లో ఎలాంటి ఆట తీరు ప్రదర్శిస్తుందో చూడాలి.
కోల్ కతా జట్టు కూడా టైటిల్ ఫేవరెట్ గా కనిపిస్తోంది. గత సీజన్లో ఈ జట్టు ట్రోఫీ అందుకుంది. గత సీజన్లో ప్రారంభం నుంచి చివరి వరకు అద్భుతమైన ఆట తీరును కోల్ కతా ప్రదర్శించింది. బ్యాటింగ్, బౌలింగ్ లో ఆకట్టుకుంది..కోల్ కతా జట్టుకు అజింక్య రహానే నాయకత్వం వహిస్తున్నాడు.. రింకూ సింగ్, డికాక్, రఘు వంశీ, పావెల్, మనీష్ పాండే వంటి వారితో బ్యాటింగ్ లైనప్ బలంగా ఉంది. వెంకటేష్ అయ్యర్, అండ్రీ రసెల్ వంటి భీకరమైన ఆల్ రౌండర్లు కూడా ఉన్నారు. మొత్తంగా చూస్తే కోల్ కతా ఈ సీజన్లోనూ భీకరమైన ఆట తీరు ప్రదర్శించే అవకాశం కనిపిస్తోంది..
-
MS Dhoni : ఐపీఎల్లో సీఎస్కేకి ఫ్యూచర్ ఉందా? ధోని ఏమైనా ప్లాన్ చేశాడా?
-
Abhishek Sharma : అభిషేక్ శర్మ రికార్డ్.. ఏకంగా రాహుల్‌నే దాటేసి!
-
ICC : ఐసీసీ కీలక నిర్ణయం.. ఒక బంతితోనే వన్డే!
-
Jasprit Bumrah: ముంబై ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. వచ్చేస్తున్న బుమ్రా
-
Hardik Pandya: ఐపీఎల్ హిస్టరీలోనే కెప్టెన్‌గా హార్దిక్ రికార్డు
-
IPL 2025: ఐపీఎల్లో రిటైర్డ్ ఔట్ ప్లేయర్స్ లిస్ట్ ఇదే