IPL 2025: ఐపీఎల్లో రిటైర్డ్ ఔట్ ప్లేయర్స్ లిస్ట్ ఇదే
IPL 2025 ఐపీఎల్ హిస్టరీలో రిటైర్డ్ ఔట్ అయి పెవిలియన్ చేరిన మొదటి క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్. ఇతను 2022 సీజన్ టైంలో రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడాడు. లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్ ఆడుతుండగా.. రిటైర్డ్ ఔట్ అయ్యాడు.

IPL 2025: లక్నో సూపర్ జెయింట్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో తెలుగు కుర్రాడు తిలక్ వర్మ ఇన్నింగ్స్ మధ్యలోనే రిటైర్డ్ ఔట్ అయ్యాడు. దీంతో రిటైర్డ్ ఔట్ అనే పదం బాగా వినిపిస్తోంది. అయితే ఇలా రిటైర్డ్ ఔట్ అయిన క్రికెటర్ తిలక్ వర్మ మాత్రమే కాదు.. ఇప్పటి వరకు చాలా మంది బ్యాటర్లు ఇలా రిటైర్డ్ ఔట్ అయ్యారు. ఈ మ్యాచ్‌లో తిలక్ వర్మ 23 బాల్స్‌లో 25 రన్స్ చేసి పెవిలియన్ చేరాడు. ఐపీఎల్ చరిత్రలో ఇలా రిటైర్డ్ ఔట్ అయి పెవిలియన్ చేరిన ఆటగాళ్లు ఉన్నారు. మరి ఆ ఆటగాళ్లు ఎవరో ఈ స్టోరీలో చూద్దాం.
రవిచంద్రన్ అశ్విన్
ఐపీఎల్ హిస్టరీలో రిటైర్డ్ ఔట్ అయి పెవిలియన్ చేరిన మొదటి క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్. ఇతను 2022 సీజన్ టైంలో రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడాడు. లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్ ఆడుతుండగా.. రిటైర్డ్ ఔట్ అయ్యాడు. బ్యాటింగ్ ఆర్డర్లో ముందు వచ్చిన అశ్విన్ 19వ ఓవర్లో మొదటి రెండు బాల్స్ ఆడి ఆ తర్వాత రియాన్ పరాగ్ రిటైర్డ్ ఔట్ అయ్యాడు. అయితే అది మ్యాచ్ కోసం మాత్రమే అలా రిటైర్డ్ ఔట్ అయ్యాడు.
అథర్వ టైడ్
యంగ్ బ్యాటర్ అథర్వ టైడ్ పంజాబ్ కింగ్స్ తరపున ఆడి రిటైర్డ్ ఔట్ అయ్యాడు. 2023 ఐపీఎల్ సీజన్ టైంలో ఢిల్లీ క్యాపిటల్స్‌పై పంజాబ్ 124 పరుగులు చేయాల్సి ఉంది. అయితే ఈ సమయంలో అథర్వ పరుగులు చేయలేక చాలా ఇబ్బంది పడ్డాడు. పంజాబ్ జట్టు చివరి 5 ఓవర్లలో 71 రన్స్ చేయాలి. దీంతో ఆడలేకపోయినా అథర్వ రిటైర్డ్ ఔట్ అయ్యి పెవిలియన్ చేరాడు.
సాయి సుదర్శన్
బ్యాటర్ సాయి సుదర్శన్ గుజరాత్ టైటాన్స్ జట్టు నుంచి ఇలాగే రిటైర్డ్ ఔట్ అయ్యాడు. 2023 ఐపీఎల్ సీజన్లో ముంబై ఇండియన్స్ తరఫున ఆడుతున్న సమయంలో రషీద్ ఖాన్ కోసం పెవిలియన్ చేరాడు. రెండు బాల్స్‌లో ఓ ఫోర్ కొట్టాడు. కానీ రిటైర్డ్ ఔట్ అయ్యాడు.
తిలక్ వర్మ
ఈ సీజన్లో ముంబై, లక్నో మ్యాచ్ మధ్యలో తిలక్ వర్మ రిటైర్డ్ ఔట్ అయ్యాడు. లక్నోపై ముంబై విజయం సాధించాలంటే 12 బంతుల్లో 29 పరుగులు చేయాల్సి ఉంది. ఈ సమయంలో హార్దిక్, తిలక్ వర్మ క్రీజులో ఉన్నారు. ఈ సమయంలో తిలక్ వర్మ టైమింగ్‌ను కాస్త తడబడుతూ.. 23 బంతుల్లో 25 పరుగులు చేశాడు. దీంతో ముంబై ఇండియన్స్ అతన్ని రిటైర్డ్ ఔట్‌గా పెవిలియన్ చేరాడు. మ్యాచ్ బట్టి జట్టు నిర్ణయం తీసుకుంటుంది. మ్యాచ్‌లో కొన్నిసార్లు ఇలా జరుగుతుంది. కెప్టెన్, టీం అంతా కూడా నిర్ణయించుకుని ఈ డెసిషన్‌కు వస్తారు.
-
MS Dhoni : ఐపీఎల్లో సీఎస్కేకి ఫ్యూచర్ ఉందా? ధోని ఏమైనా ప్లాన్ చేశాడా?
-
Jasprit Bumrah: ముంబై ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. వచ్చేస్తున్న బుమ్రా
-
Hardik Pandya: ఐపీఎల్ హిస్టరీలోనే కెప్టెన్‌గా హార్దిక్ రికార్డు
-
Tilak Varma: తిలక్ వర్మ రిటైర్డ్ ఔట్.. తెలుగు కుర్రాడికి ఘోర అవమానం
-
Jasprit Bumrah: ముంబై ఇండియన్స్‌ను గుడ్ న్యూస్.. బుమ్రా ఎంట్రీ అప్పుడే?
-
Shreyas Iyer: రూ.23 కోట్లకు న్యాయం చేసిన అయ్యర్.. ఒక్క మ్యాచ్‌తో నోళ్లు మూయించేశాడుగా!