IPL 2025: ఐపీఎల్లో వచ్చి వెళ్లిపోయిన టీమ్స్ ఇవే
IPL 2025 ఐపీఎల్లో డెక్కన్ ఛార్జర్స్ జట్టునుహైదరాబాద్ ఫ్రాంచైజీ కొనుగోలు చేసింది. డెక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ లిమిటెడ్ ఫ్రాంచైజీని తీసుకుంది.

IPL 2025: ప్రస్తుతం ఐపీఎల్ 18వ సీజన్ జరుగుతోంది. మొత్తం 10 జట్లు ఈ సీజన్లో ఆడుతున్నాయి. రాయల్స్ ఛాలెంజర్స్ బెంగళూరు, లక్నో సూపర్ జెయింట్స్, పంజాబ్ కింగ్స్, చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్ రైడర్స్, ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న జట్లులో చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్టు ఖరీదైనవి. అయితే ఐపీఎల్లో గత సీజన్లో కొన్ని జట్లు ఉన్నాయి. ఇవి కొన్ని సీజన్లలో మాత్రమే ఉన్నాయి. మరి ఐపీఎల్లో కొన్ని సీజన్లలో మాత్రమే వచ్చి వెళ్లిపోయిన జట్లు ఏవో ఈ స్టోరీలో చూద్దాం.
డెక్కన్ ఛార్జర్స్
ఐపీఎల్లో డెక్కన్ ఛార్జర్స్ జట్టునుహైదరాబాద్ ఫ్రాంచైజీ కొనుగోలు చేసింది. డెక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ లిమిటెడ్ ఫ్రాంచైజీని తీసుకుంది. అయితే కొన్ని ఆర్థిక సమస్యల కారణంగా దీన్ని క్లో్జ్ చేశారు. డెక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ లిమిటెడ్ , డెక్కన్ ఛార్జర్స్ జట్టు యజమాని దీన్ని 2008లో స్థాపించారు. ఆర్థిక సమస్యల కారణంగా 2013లో దీన్ని రద్దు చేశారు. దీంతో అప్పటి నుంచి ఈ జట్టు ఐపీఎల్లో కనిపించలేదు.
కొచ్చి టస్కర్స్ కేరళ
కొచ్చి టస్కర్స్ కేరళ అనే ఫ్రాంచైజీ జట్టును 2010లో స్థాపించారు. ఆ తర్వాత ఏడాదికే దీన్ని క్లోజ్ చేశారు. ప్రస్తుతం ఐపీఎల్లో ఈ జట్టు లేదు. కేరళలోని కొచ్చి నగరానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఆడింది. అయితే మొదట ఈ జట్టు పేరును ఇండి కమాండోస్ అని పెట్టారు. ఆ తర్వాత దీని పేరును మార్చారు. ఈ జట్టుకి ఇద్దరు యజమానులు ఉండేవారు. వీరి మధ్య వివాదం కారణంగా ఫ్రాంచైజీ క్లోజ్ చేయాల్సి వచ్చింది. 2011 సీజన్ స్టార్ట్ కావడానికి ముందే వీరు చెల్లించాల్సిన ఫ్రాంచైజ్ ఫీజులో 10% బ్యాంక్ గ్యారెంటీ మూలకాన్ని చెల్లించలేదు. అప్పటికీ ఫ్రాంచైజ్ యజమానులకు చెల్లింపు కోసం సమాచారం అందించనిప్పటికీ కూడా ఎలాంటి స్పందన రాలేదు. దీంతో క్లోజ్ అయ్యింది.
గుజరాత్ లయన్స్
గుజరాత్ లయన్స్ జట్టు 2016, 2017 సీజన్లో ప్రాతినిధ్యం వహించింది. రాజ్‌కోట్ ఫ్రాంఛైజీతో ఐపీఎల్లో అలరించింది. అయితే ఈ జట్టు యాజమాని కేశవ్ బన్సల్ (ఇంటెక్స్ టెక్నాలజీస్). అనుకోని కారణాల వల్ల ఈ ఫ్రాంచైజీని క్లోజ్ చేయాల్సి వచ్చింది.
పుణే వారియర్స్ ఇండియా
పూణే వారియర్స్ ఇండియా అనే జట్టును 2010లో స్థాపించారు. ఇది మహారాష్ట్ర నుంచి వచ్చి ఐపీఎల్ ఫ్రాంచైజీలో ఒకటి. ఈ జట్టు సహారా గ్రూప్ స్పోర్ట్స్ లిమిటెడ్ యాజమాన్యంలో ఉండేది. ఇది భారతీయ వ్యాపార సంస్థ సహారా ఇండియా పరివార్ గ్రూప్ కంపెనీ . అయితే లీగ్ వార్షిక ఫ్రాంచైజ్ ఫీజు మూల్యాంకనం కారణంగా ఈ ఫ్రాంచైజీని రద్దు చేశారు.
రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్
ఇది పూణే ప్రాతినిధ్యం వహించిన ఫ్రాంచైజీ జట్టు. ఇది సంజీవ్ గోయెంకా కు సంబందించినది. 2016లో ప్రారంభమైంది. ఆర్.పి – సంజీవ్ గోయెంకా గ్రూప్ దక్కించుకుంది. అయితే రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్‌ను మరో యజమాని కొనుగోలు చేసి లక్నో సూపర్ జెయింట్స్‌గా మార్చాడు. ప్రస్తుతం ఈ లక్నో సూపర్ జెయింట్స్‌గా ఐపీఎల్లో ఆడుతుంది.
-
MS Dhoni : ఐపీఎల్లో సీఎస్కేకి ఫ్యూచర్ ఉందా? ధోని ఏమైనా ప్లాన్ చేశాడా?
-
Jasprit Bumrah: ముంబై ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. వచ్చేస్తున్న బుమ్రా
-
Hardik Pandya: ఐపీఎల్ హిస్టరీలోనే కెప్టెన్‌గా హార్దిక్ రికార్డు
-
IPL 2025: ఐపీఎల్లో రిటైర్డ్ ఔట్ ప్లేయర్స్ లిస్ట్ ఇదే
-
Tilak Varma: తిలక్ వర్మ రిటైర్డ్ ఔట్.. తెలుగు కుర్రాడికి ఘోర అవమానం
-
Jasprit Bumrah: ముంబై ఇండియన్స్‌ను గుడ్ న్యూస్.. బుమ్రా ఎంట్రీ అప్పుడే?