Rohit Sharma : రోహిత్ శర్మ ఖాతాలో మరో చెత్త రికార్డు
Rohit Sharma : ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ చెత్త రికార్డును నమోదు చేసుకున్నాడు. క్రీజులోకి వెళ్లిన వెంటనే డకౌట్ అయ్యాడు. నాలుగు బంతులు వేస్తే కనీసం ఒక్క పరుగు కూడా తీయకుండా పెవిలియన్ చేరాడు. ఈ క్రమంలో రోహిత్ శర్మ చెత్త రికార్డును నమోదు.

Rohit Sharma : ఐపీఎల్ 18 సీజన్ ప్రారంభమైంది. దీనిలో భాగంగా ఆదివారం రెండు మ్యాచ్‌లు జరిగాయి. సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మధ్య ఒక మ్యాచ్ జరగ్గా ఇందులో హైదరాబాద్ గెలిచింది. రెండో మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరగ్గా ఇందులో చెన్నై సూపర్ కింగ్స్ గెలిచింది. అయితే ఈ సీజన్లో ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ చెత్త రికార్డును నమోదు చేసుకున్నాడు. క్రీజులోకి వెళ్లిన వెంటనే డకౌట్ అయ్యాడు. నాలుగు బంతులు వేస్తే కనీసం ఒక్క పరుగు కూడా తీయకుండా పెవిలియన్ చేరాడు. ఈ క్రమంలో రోహిత్ శర్మ చెత్త రికార్డును నమోదు. ఐపీఎల్ చరిత్రలో ఎక్కువ సార్లు డకౌట్ అయిన ఆటగాడిగా రోహిత్ శర్మ రికార్డు సృష్టించాడు. గతంలో దినేష్ కార్తీక, గ్లెన్ మాక్స్వెల్ పేరిట రికార్డులు ఉండగా.. ఇప్పుడు రోహిత్ శర్మ ఫస్ట్ ప్లేస్‌లోకి చేరాడు. మ్యాచ్ మొదటి ఓవర్లోనే రోహిత్ శర్మ ఔట్ కావడంతో ఫ్యాన్స్ కూడా నిరుత్సాహ పడ్డారు.
ఖలీల్ అహ్మద్ బంతి వేయగా.. దాన్ని లెగ్ సైడ్ వైపు ఫ్లిక్ చేయడానికి ప్రయత్నించాడు. అప్పుడు మిడ్ వికెట్లో శివమ్ దూబే సైడ్ వెళ్లింది. దీంతో దూబే క్యాచ్ పట్టడంతో రోహిత్ డకౌట్ అయ్యాడు. అయితే రోహిత్ శర్మ ఇప్పటి వరకు ఐపీఎల్లో 18 సార్లు డకౌట్ అయ్యాడు. అయితే గతంలో ఈ రికార్డు ఆస్ట్రేలియా బ్యాటర్ గ్లెన్ మాక్స్వెల్, టీమిండియా మాజీ బ్యాటర్ దినేష్ కార్తీక్‌లను వెనక్కి నెట్టి ఈ చెత్త రికార్డును రోహిత్ శర్మ తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే గ్లెన్ మ్యాక్స్‌వెల్ మొత్తం 129 మ్యాచ్‌లలో 18 సార్లు డకౌట్ అయ్యాడు. రోహిత్ శర్మ 253 ఇన్నింగ్స్‌లో 18 సార్లు డకౌట్ కాగా.. దినేష్ కార్తీక్ 257 ఇన్నింగ్స్‌లలో డకౌట్ అయ్యాడు. అయితే ఐపీఎల్ చరిత్రలో ఎక్కువ డకౌట్లు అయిన ఓపెనర్‌గా చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో చాలా మంది నెటిజన్లు రోహిత్ శర్మపై ట్రోల్ చేస్తున్నారు. దీంతో పలువురు ఇది కరెక్ట్ కాదు. ఫస్ట్ మ్యాచ్ దేవుడికి ఇచ్చేశామని అంటున్నారు. ఈ మ్యాచ్‌లో ముంబై జట్టు తడబడింది. రోహిత్ శర్మ డకౌట్ కావడంతో కాస్త తడబడింది. ముంబై మొదటి బ్యాటింగ్ చేసి 9 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. చెన్నై సూపర్ కింగ్స్ ఈ టార్గెట్‌ను సాధించి మ్యాచ్ గెలిచింది.
ఐపీఎల్లో అత్యధిక డకౌట్లు అయిన ఆటగాళ్లు వీరే
1) రోహిత్ శర్మ – 18
2) గ్లెన్ మాక్స్వెల్ – 18
3) దినేష్ కార్తీక్ – 18
4) పియూష్ చావ్లా – 16
5) సునీల్ నరైన్ – 16
-
MS Dhoni : ఐపీఎల్లో సీఎస్కేకి ఫ్యూచర్ ఉందా? ధోని ఏమైనా ప్లాన్ చేశాడా?
-
Abhishek Sharma : అభిషేక్ శర్మ రికార్డ్.. ఏకంగా రాహుల్‌నే దాటేసి!
-
ICC : ఐసీసీ కీలక నిర్ణయం.. ఒక బంతితోనే వన్డే!
-
Jasprit Bumrah: ముంబై ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. వచ్చేస్తున్న బుమ్రా
-
Hardik Pandya: ఐపీఎల్ హిస్టరీలోనే కెప్టెన్‌గా హార్దిక్ రికార్డు
-
IPL 2025: ఐపీఎల్లో రిటైర్డ్ ఔట్ ప్లేయర్స్ లిస్ట్ ఇదే