Rishabh Pant: ఒక్కో కోటికి ఒక్కో పరుగు లెక్క.. ఒత్తిడికి గురవుతున్న పంత్
Rishabh Pant ఈ మ్యాచ్ తర్వాత సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో రిషబ్ పంత్ కమ్ బ్యాక్ ఇస్తాడని అందరూ అనుకున్నారు. కానీ అంతా రివర్స్ అయ్యింది. ఈ మ్యాచ్లో కూడా రిషబ్ పంత్ 15 బంతుల్లో 15 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.

Rishabh Pant: ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాడు రిషబ్ పంత్. లక్నో సూపర్ జెయింట్స్ రూ.27 కోట్లకు కొనుగోలు చేసింది. మొత్తం అన్ని ఐపీఎల్ సీజన్‌లో చూసుకుంటే ఇంత ధరకు ఏ ఆటగాడు కూడా పలకలేదు. అత్యంత ఖరీదైన ఆటగాడు అంటే ఎవరూ ఊహించని విధంగా ఆడాలి. కానీ అత్యధిక ఖరీదైన ఆటగాడిగా ఉన్నా అని రిషబ్ పంత్ అదృష్టమూ.. లేకపోతే ఒక్క మ్యాచ్ కూడా సరిగ్గా ఆడటం లేకపోవడం దురదృష్టం. గతంలో ఢిల్లీ జట్టుకి కెప్టెన్‌గా ఉన్నా రిషబ్ పంత్ ఈ సీజన్‌లో మొదటి మ్యాచ్ ఆ జట్టుతోనే ఆడాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఆడి 6 బంతులు మాత్రమే చేసి డకౌట్ అయ్యాడు. మొదటి మ్యాచ్‌లోనే పంత్ డకౌట్ కావడంతో ఫ్యాన్స్‌తో పాటు జట్టు నుంచి కూడా విమర్శలు వచ్చాయి.
ఈ మ్యాచ్ తర్వాత సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో రిషబ్ పంత్ కమ్ బ్యాక్ ఇస్తాడని అందరూ అనుకున్నారు. కానీ అంతా రివర్స్ అయ్యింది. ఈ మ్యాచ్లో కూడా రిషబ్ పంత్ 15 బంతుల్లో 15 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత వరుస మ్యాచ్‌ల్లో కూడా రిషబ్ పంత్ ఔట్ అయ్యాడు. తాజాగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 బంతులు ఆడి 2 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. ఇలా ఒక్కో కోటికి ఒక్కో పరుగు లెక్క తీశాడు. ప్రతీ మ్యాచ్‌లోనూ ఇలానే సింగిల్ డిజిట్‌లో పరుగులు చేస్తుంటే.. ఫ్రాంచైజీ ఓనర్ గోయెంకా కూడా ఒత్తిడి తెస్తున్నాడు. ఇన్ని కోట్లు తీసుకుని కూడా కనీసం పరుగులు చేయడం లేదని అంటున్నారు. దీంతో పంత్ బాగా ఒత్తిడికి గురవుతున్నట్లు తెలుస్తోంది.
ఎంతో ఆశతో లక్నో పంత్‌ను భారీ ధరకు కొనుగోలు చేసి కెప్టెన్‌ను చేసింది. కానీ పంత్ మొదటి మ్యాచ్‌లోనే డకౌట్ కావడంతో క్రికెట్ ఫ్యాన్స్ కూడా నిరుత్సాహ పడ్డారు. మొదటి మ్యాచ్‌లోనే డకౌట్ కావడంతో పలువురు సోషల్ మీడియాలో రూ.27 కోట్లు బొక్క అని కామెంట్లు కూడా చేశారు. అన్ని కోట్లు పెట్టి కొనుగోలు చేస్తే నమ్మకంతో కనీసం అద్భుతంగా ప్రదర్శన చేయడం లేదని బాగా విమర్శలు చేశారు. మొత్తం ఐపీఎల్‌లోనే క్యాస్ట్‌లీ ప్లేయర్ అనే ట్యాగ్‌ని రిషబ్ పంత్ భరించలేకపోతున్నాడని అభిమానులు అంటున్నారు. ఒక పక్క క్యాస్ట్‌లీ ప్లేయర్.. మరో పక్క పరుగులు చేయడం లేదనే ఒత్తిడితో ఎక్కువగా ఫెయిల్ అవుతున్నాడని అభిమానులు అంటున్నారు.