Rishabh Pant: రూ.27 కోట్లు వేస్ట్.. పంత్‌ను ఏకిపారేస్తున్నా గోయెంకా
Rishabh Pant: లక్నో సూపర్ జెయింట్స్ రిషబ్ పంత్‌ను కోట్లు పెట్టి మరి తీసుకుంది. ఐపీఎల్ చరిత్రలో రిషబ్ పంత్ అత్యధిక ఖరీదైన ఆటగాడు. అయితే ఈ ఐపీఎల్ సీజన్లో మొదటి మ్యాచ్‌లో రిషబ్ పంత్ డకౌట్ అయ్యాడు. అప్పుడే రిషబ్ పంత్‌పై బాగా ట్రోలింగ్ జరిగింది. అత్యధిక ఖరీదైన ఆటగాడు.. కానీ డకౌట్ అయ్యాడని రూ.21 కోట్లు బొక్క అని ట్రోల్ చేశారు.

Rishabh Pant : ప్రస్తుతం ఐపీఎల్ 18వ సీజన్ జరుగుతోంది. దీనిలో భాగంగా లక్నో వేదికగా లక్నో సూపర్ జెయింట్స్, పంజాబ్ కింగ్స్‌కి మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. లక్నో సూపర్ జెయింట్స్ రిషబ్ పంత్‌ను కోట్లు పెట్టి మరి తీసుకుంది. ఐపీఎల్ చరిత్రలో రిషబ్ పంత్ అత్యధిక ఖరీదైన ఆటగాడు. అయితే ఈ ఐపీఎల్ సీజన్లో మొదటి మ్యాచ్‌లో రిషబ్ పంత్ డకౌట్ అయ్యాడు. అప్పుడే రిషబ్ పంత్‌పై బాగా ట్రోలింగ్ జరిగింది. అత్యధిక ఖరీదైన ఆటగాడు.. కానీ డకౌట్ అయ్యాడని రూ.21 కోట్లు బొక్క అని ట్రోల్ చేశారు. ఇప్పుడు మళ్లీ పంజాబ్ కింగ్స్‌పై ఓడిపోవడంతో లక్నో కెప్టెన్ రిషబ్ పంత్‌పై ట్రోలింగ్ జరుగుతోంది. ఖరీదైన ఆటగాడు కావడంతో రిషబ్ పంత్‌పై భారీగానే అంచనాలు ఉన్నాయి. కానీ వరుస మ్యాచ్‌ల్లోనూ విఫలం కావడంతో పంత్‌పై సెటైర్లు వేస్తున్నారు. నిన్నటి మ్యాచ్ ఓడిపోవడంతో లక్నో ఓనర్ గోయెంకా రిషబ్ పంత్‌ను ఏకిపారేస్తున్నాడు. లక్నో వేదికగా జరిగిన మ్యాచ్‌లో 171 పరుగులు చేసింది. పంజాబ్ కింగ్స్ కేవలం 16.2 ఓవర్లలో 2 వికెట్లకు 177 పరుగులు చేసి మ్యాచ్‌లో ఘన విజయం సాధించింది. ఓపెనర్ సిమ్రాన్ సింగ్ (34 బంతుల్లో 69) కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (30 బంతుల్లో 52) అదరగొట్టారు.
ఈ మ్యాచ్ తర్వాత లక్నో ఓనర్ సంజీవ్ గోయెంకా, కెప్టెన్ రిషభ్ పంత్ మధ్య జరిగిన సంభాషణ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కేఎల్ రాహుల్, గోయెంకా మధ్య జరిగిన ఎపిసోడ్ రీక్రియేట్ అయ్యిందని సోషల్ మీడియాలో ఎక్కువగా మాటలు వినిపిస్తున్నాయి. అయితే వీటిపై కొందరు పాజిటివ్ అంటే.. మరికొందరు నెగిటివ్‌గా స్పందిస్తున్నారు. డ్రెస్సింగ్ రూమ్‌లో మ్యాచ్ ఫలితంపై కెప్టెన్‌తో ఓనర్ మాట్లాడాల్సిన అవసరం లేదని, వాటి కోసం కోచ్‌లు ఉన్నారని అంటున్నారు. గతంలో కూడా కేఎల్ రాహుల్ విషయంలో గోయెంకా ఇలానే వ్యవహరించారని అంటున్నారు. కెప్టెన్‌కు కాస్త ఫ్రీడమ్ ఇవ్వాలని, ఇస్తేనే ఫలితాలు సానుకూలంగా ఉంటాయని అంటున్నారు. ఇతర ఫ్రాంచైజీల ఓనర్లు ఇలా లేరని అంటున్నారు. మొదటి మ్యాచ్‌లో కూడా పంత్ డకౌట్ కావడంతో ఓనర్ సంజీవ్ గోయెంకా క్లాస్ పీకినట్లు తెలుస్తోంది. పంత్ రూ.27 కోట్లు తీసుకుంటే.. రూ.1 కోటికి చొప్పున ఒక పరుగు చేస్తున్నాడని సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.
గతంలో ఢిల్లీ జట్టుకు కెప్టెన్‌గా ఉన్న రిషబ్ పంత్‌ను లక్నో సూపర్ జెయింట్స్ మెగా వేలంలో భారీ ధరకు కొనుగోలు చేసింది. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధర పలికిన ఆటగాడు కూడా పంత్. మొత్తం అన్ని ఐపీఎల్ సీజన్లో చూసుకుంటే ఇంత ధరకు ఏ ఆటగాడు కూడా పలకలేదు. లక్నో సూపర్ జెయింట్స్ ఫ్రాంచైజీ రూ.27 కోట్లకు పంత్‌ను కొనుగోలు చేసింది. కానీ ఆశించినంత స్థాయిలో ఆడటం లేదు. ఫ్యాన్స్‌ని నిరాశ పరుచుతున్నాడు. దీంతో ట్రోలింగ్‌కు గురి అవుతున్నాడు.
-
MS Dhoni : ఐపీఎల్లో సీఎస్కేకి ఫ్యూచర్ ఉందా? ధోని ఏమైనా ప్లాన్ చేశాడా?
-
Abhishek Sharma : అభిషేక్ శర్మ రికార్డ్.. ఏకంగా రాహుల్‌నే దాటేసి!
-
ICC : ఐసీసీ కీలక నిర్ణయం.. ఒక బంతితోనే వన్డే!
-
Jasprit Bumrah: ముంబై ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. వచ్చేస్తున్న బుమ్రా
-
Hardik Pandya: ఐపీఎల్ హిస్టరీలోనే కెప్టెన్‌గా హార్దిక్ రికార్డు
-
Rishabh Pant: ఒక్కో కోటికి ఒక్కో పరుగు లెక్క.. ఒత్తిడికి గురవుతున్న పంత్