Ravindra Jadeja: రిటైర్మెంట్ వార్తలపై స్పందించిన జడేజా.. నాలుగు పదాలతో పుకార్లకు చెక్ పెట్టేశాడుగా!

Ravindra Jadeja:
దుబాయ్ వేదికగా జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీని టీమిండియా సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. నాలుగు వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌పై టీమిండియా ఘన విజయం సాధించింది. అయితే ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ తర్వాత టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా వన్డే క్రికెట్‌కు వీడ్కోలు పలికే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. రవీంద్ర జడేజా, కోహ్లీ కంటే రోహిత్ శర్మ తప్పకుండా రిటైర్మెంట్ ప్రకటిస్తాడని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగింది. ఈ ముగ్గురు ఆటగాళ్లు కూడా రిటైర్మెంట్ ప్రకటించలేదు. ఫైనల్ మ్యాచ్ విన్నింగ్ తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ ప్రెస్ మీట్ ద్వారా రిటైర్మెంట్ విషయంపై క్లారిటీ ఇచ్చాడు. అయితే రవీంద్ర జడేజా రిటైర్మెంట్ వార్తలపై రియాక్ట్ అయ్యాడు. సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశాడు. కేవలం నాలుగు పదాలతో రిటైర్మెంట్ పుకార్లకు చెక్ పెట్టేశాడు. అనవసరమైన పుకార్లు వద్దు.. ధన్యవాదాలు అని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. కేవలం నాలుగు పదాలతో రిటైర్మెంట్ వార్తలకు పూర్తిగా చెక్ పెట్టేశాడు. అయితే టీ 20 వరల్డ్ కప్ తర్వాత 2024లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా రిటైర్మెంట్ ప్రకటించారు. ఈ క్రమంలోనే ఈ వన్డే క్రికెట్‌కు కూడా ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత రిటైర్మెంట్ ప్రకటిస్తారని జోరుగా ప్రచారం సాగింది.
ఇదిలా ఉండగా ఈ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ తర్వాత కెప్టెన్ రోహిత్ వన్డేల్లో రిటైర్మెంట్ ప్రకటిస్తారని వార్తలు వచ్చాయి. దీనిపై బీసీసీఐ కూడా రోహిత్‌తో సంప్రదింపులు జరిపినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇలాంటి వార్తలకు చెక్ పెట్టే ఆన్సర్ రోహిత్ ఇచ్చాడు. మ్యాచ్ గెలిచిన తర్వాత ప్రెస్ మీట్లో కొందరు విలేకర్లు రోహిత్ శర్మను రిటైర్మెంట్ గురించి ప్రశ్నించారు. ఈ సందర్భంగా రోహిత్ శర్మ స్పందిస్తూ.. తాను ఇప్పటిలో రిటైర్ కావడం లేదని స్పష్టం చేశాడు. రిటైర్మెంట్పై వచ్చే వార్తలను నమ్మవద్దని తెలిపాడు. తప్పుడు వార్తలను ప్రచారం చేయవద్దని చెబుతూ.. రిటైర్మెంట్పై క్లారిటీ ఇచ్చాడు. భవిష్యత్తు ప్లానింగ్స్ బట్టి రిటైర్మెంట్ ఉంటుందని తెలిపాడు. రోహిత్ రిటైర్మెంట్ లేకపోవడంతో ఫ్యాన్స్ కాస్త ఊపిరి పీల్చుకున్నారు. ముగ్గురు క్రికెటర్లు కూడా రిటైర్మెంట్పై ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో సంతోష పడ్డారు. అయితే వీరు ముగ్గురు ఎప్పుడైనా రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉందని అంటున్నారు. మళ్లీ 2027లో జరిగే వన్డే వరల్డ్ కప్‌లో పాల్గొంటారా? లేదా? అనే సందేహం కూడా చాలా మందిలో ఉంది. మరి వీరు ముగ్గురు రిటైర్మెంట్ ప్రకటిస్తారో చూడాలి.