Most Sixes In IPL: ఐపీఎల్లో సిక్సర్లలో టాప్ వీరే

Most Sixes In IPL: క్రికెట్ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూసే ఐపీఎల్ 18వ సీజన్ వచ్చేస్తుంది. మార్చి 22వ తేదీ నుంచి ఐపీఎల్ ప్రారంభం కానుంది. మొదటి మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు డిఫెండింగ్ ఛాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య జరగనుంది. అయితే ఐపీఎల్ మ్యాచ్‌లు అంటే ప్రతీ ఒక్కరూ కూడా ఎంజాయ్ చేస్తారు. ప్రేక్షకులతో పాటు బ్యాటర్లు కూడా ఫోర్లు, సిక్స్‌లు కొడుతూ ఎంజాయ్ చేస్తారు. అయితే ఇప్పటి వరకు ఐపీఎల్ చరిత్రలో ఎందరో క్రికెటర్లు సిక్స్‌లు కొట్టారు. అయితే ఐపీఎల్లో సిక్సర్లు కొట్టిన వారి జాబితాలో టాప్ ప్లేస్‌లో ఉన్న ఆటగాళ్లు ఎవరో ఈ స్టోరీలో చూద్దాం.
ఐపీఎల్ చరిత్రలో ఎక్కువగా సిక్సర్లు కొట్టి టాప్ ప్లేస్‌లో ఉన్నది క్రిస్ గేల్. ఇతను పంజాబ్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తరఫున ఆడాడు. అయితే మొత్తం అన్ని ఫాంఛైజీలు కలిపి 142 మ్యాచ్‌లు ఆడాడు. వీటిలో 357 సిక్సర్లు కొట్టిన ఏకైక ఆటగాడిగా గిల్ రికార్డు సృష్టించాడు. ఎక్కువగా సిక్సర్లు కొట్టిన వారిలో టాప్ ప్లేస్‌లో గిల్ ఉన్నాడు. ఇతని తర్వాత టీమిండియా కెప్టెన్, హిట్ మ్యాన్ రోహిత్ శర్మ రెండో స్థానంలో ఉన్నాడు. ఐదు సార్లు మంబై ఇండియన్స్‌ను ఛాంపియన్స్‌గా నిలిచేలా చేశాడు. ఐపీఎల్లో ఎక్కువగా సార్లు కప్ గెలిచిన జట్లులో ముంబై ఇండియన్స్ జట్టు కూడా ఒకటి. రోహిత్ శర్మ ఐపీఎల్లో మొత్తం 257 మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో మొత్తం 280 సిక్సర్లు కొట్టి రెండో స్థానంలో నిలిచాడు. ఇక మూడో స్థానంలో స్టార్ క్రికెటర్ ఆర్సీబీ జట్టు విరాట్ కోహ్లీ ఉన్నాడు. రాయల్స్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు నుంచి కోహ్లీ మొత్తం 252 మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో 272 సిక్సర్లు కొట్టి మూడో స్థానంలో ఉన్నాడు. రోహిత్ శర్మకు, కోహ్లీకి కేవలం 8 సిక్స్‌లు మాత్రమే తేడా. ఈ సీజన్లో కోహ్లీ రోహిత్ శర్మను దాటే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక నాలుగో స్థానంలో మహేంద్ర సింగ్ ధోనీ ఉన్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ధోనీ నాయకత్వం వహిస్తున్నాడు. ఇతను 264 మ్యాచ్‌ల్లో 252 సిక్సర్లు కొట్టి నాలుగో స్థానంలో ఉన్నాడు. ఐదో స్థానంలో ఏబీ డివిలియర్స్ ఉన్నాడు. ఐపీఎల్లో మొత్తం 184 మ్యాచ్‌ల్లో 251 సిక్సర్లు కొట్టాడు.
ఇదిలా ఉండగా ఇప్పటి వరకు ఐపీఎల్లో ఎక్కువగా ఫోర్లు కొట్టిన బ్యాట్స్‌మెన్ జాబితాలో శిఖర్ ధావన్ ఉన్నాడు. మొత్తం ఇతను 222 మ్యాచ్‌లు ఆడి.. 768 ఫోర్లు కొట్టి ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నాడు. మొత్తం ఐపీఎల్లో 6769 పరుగులు చేశాడు. ఈ జాబితాలో ధావన్ తర్వాత రెండవ స్థానంలో విరాట్ కోహ్లీ ఉన్నాడు. విరాట్ కోహ్లీ మొత్తం ఐపీఎల్లో 705 ఫోర్లు కొట్టి రెండో స్థానంలో ఉన్నాడు. ధావన్‌కి, కోహ్లీకి కేవలం 64 ఫోర్లు మాత్రమే తేడా ఉంది. ఈ సీజన్లో కోహ్లీ అద్భుతమైన ప్రదర్శన చేస్తే తప్పకుండా శిఖర్ ధావన్ రికార్డును అధిగమించవచ్చు.
-
MS Dhoni : ఐపీఎల్లో సీఎస్కేకి ఫ్యూచర్ ఉందా? ధోని ఏమైనా ప్లాన్ చేశాడా?
-
Jasprit Bumrah: ముంబై ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. వచ్చేస్తున్న బుమ్రా
-
Hardik Pandya: ఐపీఎల్ హిస్టరీలోనే కెప్టెన్‌గా హార్దిక్ రికార్డు
-
IPL 2025: ఐపీఎల్లో రిటైర్డ్ ఔట్ ప్లేయర్స్ లిస్ట్ ఇదే
-
Tilak Varma: తిలక్ వర్మ రిటైర్డ్ ఔట్.. తెలుగు కుర్రాడికి ఘోర అవమానం
-
Jasprit Bumrah: ముంబై ఇండియన్స్‌ను గుడ్ న్యూస్.. బుమ్రా ఎంట్రీ అప్పుడే?