IPL: కేంద్రం కీలక నిర్ణయం.. ఇకపై ఐపీఎల్‌లో ఆ యాడ్స్ బ్యాన్

IPL:
క్రికెట్ ప్రియులు ఎంతగానో ఎదురు చూసే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2025) మార్చి 22 నుంచి ప్రారంభం కానుంది. ఈ సమయంలో ఐపీఎల్‌కి కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. పొగాకు, మద్యం ప్రకటనలను పూర్తిగా ఐపీఎల్‌లో నిషేధించాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో ఐపీఎల్ ఛైర్మన్ అరుణ్ ధుమాల్‌కు కేంద్ర ఆరోగ్యశాఖ లేఖ రాసింది. క్రికెటర్లు భారత యువతకు ఎంతో ఆదర్శంగా ఉంటారు. ఇలాంటి ఆటగాళ్లు ఎలాంటి పొగాకు, మద్యం ప్రకటనలతో సంబంధం ఉండకూడదని తెలిపింది. ఐపీఎల్ మ్యాచ్‌లు, దీనికి సంబంధించే కార్యక్రమాలు, అన్ని ప్రాంగణాల్లో పొగాకు, మద్యం ప్రకటనలు ఇవ్వడం, అమ్మకాలు జరపడం వంటివి కూడా చేయకూడదని తెలిపింది. ఎందుకంటే ఐపీఎల్‌ను ఎక్కువ మంది వీక్షిస్తారు. ఈ క్రమంలో వాటి వల్ల యువతి చెడు అలవాట్లకు బానిస అవుతారు. ఈ క్రమంలోనే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రతీ ఏడాది దేశంలో ఎక్కువ శాతం మరణాలు క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, మధుమేహం వంటి వాటితో చనిపోతున్నారు. అదే పొగాకు, ఆల్కహాల్ వల్ల ఇలాంటి సమస్యలు వస్తున్నాయని గుర్తించింది. మన దేశం పొగాకు మరణాల్లో రెండో స్థానంలో ఉందని కేంద్రం తెలిపింది.
ఇదిలా ఉండగా మార్చి 22వ తేదీ నుంచి మే 25 వరకు ఐపీఎల్ టోర్నీ జరగనుంది. ప్రారంభ మ్యాచ్ డిఫెండింగ్ ఛాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్ (Kolkata Knight Riders), రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (Royal Challangers Banglore) జట్ల మధ్య జరుగుతుంది. అయితే హైదరాబాద్‌లో క్వాలిఫయర్, ఒక ఎలిమేనటర్ మ్యాచ్ జరగనుంది. ఈ ఏడాది ఐపీఎల్ 2025 మ్యాచ్ ఈడెన్ గార్డెన్స్‌లో జరగనున్నట్లు సమాచారం. ప్లేఆఫ్ మ్యాచ్‌లు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం, కోల్‌కతాలో జరగనున్నాయి. అయితే ఈ సీజన్‌లో మొత్తం 74 మ్యాచ్‌లు 10 జట్లు ఆడనున్నాయి. మొత్తం 65 రోజుల పాటు ఐపీఎల్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్‌ల కోసం మొత్తం 11 వేదికల్లో జరగనుంది. తెలుగు రాష్ట్రాల్లో మ్యాచ్ జరగనుండటంతో క్రికెట్ ప్రేమికులకు పండగ అని చెప్పవచ్చు. ఫైనల్ మ్యాచ్ మే 25న ఈడెన్ గార్డెన్స్‌లో జరుగుతుంది. అలాగే రాజస్థాన్ జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో ఐదు మ్యాచ్‌లు, అస్సాంలోని బర్సాపరా క్రికెట్ స్టేడియంలో రెండు మ్యాచ్‌లు ఆడనుంది. ఢిల్లీ క్యాపిటల్స్ వైజాగ్ స్టేడియంలో రెండు హోమ్ మ్యాచ్‌లు ఆడనున్నట్లు తెలుస్తోంది. మిగతా మ్యాచ్‌లు ఢిల్లీలో జరుగుతాయి.
-
Rashid Khan: బుమ్రా రికార్డ్ బ్రేక్ చేసిన రషీద్ ఖాన్
-
Vignesh Putur: చెన్నైకి చెమటలు పట్టించిన పుతుర్.. ఇంతకీ ఎవరు?
-
IPL: ఐపీఎల్‌లో చీర్లీడర్లు ఒక్కో మ్యాచ్‌కు ఎంత సంపాదిస్తారంటే?
-
IPL: ఐపీఎల్ సీజన్‌లో ఈ స్టాక్స్ కొంటే.. లాభమంతా మీదే!
-
IPL క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. Airtel, VI సూపర్ ప్లాన్స్..!
-
IPl 2025:క్రికెట్ ఫ్యాన్స్ షాకింగ్ న్యూస్.. ఆ మ్యాచ్ రీ షెడ్యూల్?