Sri Rama Navami 2025: నవమి నైవేద్యాలతో ఆరోగ్యం మీ సొంతం
Sri Rama Navami 2025 శ్రీరాముడికి నైవేద్యంగా పెట్టే వాటిలో పానకం, వడపప్పు ముఖ్యమైనది. తప్పకుండా వీటిని ప్రతీ ఒక్కరూ కూడా నైవేద్యంగా పెడతారు. అయితే వీటిని ఆచారం ప్రకారం మాత్రమే కాకుండా ఆరోగ్య పరంగా కూడా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

Sri Rama Navami 2025: శ్రీరాముడు ఛైత్ర మాసంలోని శుక్లపక్షం నవమి రోజున పుట్టాడని పురాణాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో నేడు శ్రీరామ నవమి పండుగను జరుపుకుంటున్నారు. చైత్ర శుద్ధ నవమి రోజున శ్రీరాముడి జననం, వివాహ మహోత్సవం, పట్టాభిషేకము జరిగాయి. ఈ నవమి రోజున ఇంట్లో పూజలు చేస్తే అంతా కూడా మంచి జరుగుతుందని పండితులు చెబుతున్నారు. శ్రీరామ నవమి రోజు బ్రహ్మ ముహుర్తంలోనే నిద్ర లేచి తలస్నానం చేయాలి. కొత్త దుస్తులు ధరించి.. పట్టు వస్త్రాలు రాముడికి సమర్పించి, పువ్వులు, పండ్లు, నైవేద్యాలు పెడితే కోరిన కోరికలు అన్ని కూడా నెరవేరుతాయని పండితులు చెబుతున్నారు. అయితే నవమి రోజు రాముడికి ఎక్కువగా చలిమిడి, వడపప్పు పానకం, చక్కెర పొంగలి, పాయసం వంటివి పెడుతుంటారు. అయితే నవమికి పెట్టే నైవేద్యాల వల్ల ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అవేంటో మరి ఈ స్టోరీలో తెలుసుకుందాం.
శ్రీరాముడికి నైవేద్యంగా పెట్టే వాటిలో పానకం, వడపప్పు ముఖ్యమైనది. తప్పకుండా వీటిని ప్రతీ ఒక్కరూ కూడా నైవేద్యంగా పెడతారు. అయితే వీటిని ఆచారం ప్రకారం మాత్రమే కాకుండా ఆరోగ్య పరంగా కూడా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే పానకంలో వాడే బెల్లంలో ఎన్నో పోషకాలు ఉన్నాయి. వీటిలోని ఐరన్, పొటాషియం, యాంటీ యాక్సిడెంట్లు శరీర ఆరోగ్యానికి బాగా ఉపయోగపడతాయి. ఇవి శరీరానికి తక్షణమే శక్తిని ఇస్తుంది. అలాగే బాడీకి వేడి చేయకుండా చలవ చేస్తుంది. ముఖ్యంగా ఎలాంటి ఇన్ఫెక్షన్లు రాకుండా కాపాడుతుంది. ఇందులోని పోషకాలు రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అయితే పానకంలో కేవలం బెల్లం మాత్రమే కాకుండా యాలకుల పొడిని కూడా వాడుతారు. రుచికి దీన్ని వాడుతారు. కానీ ఇందులోని పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్‌లు, విటమిన్లు, సెలీనియం, బీటా కెరోటిన్ వంటివి నోటి దుర్వాసనను తగ్గిస్తుంది. అలాగే మూత్ర సంబంధిత సమస్యలను కూడా తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఈ యాలకులు జీర్ణ సమస్యలు, కడుపు నొప్పి వంటి సమస్యలను తగ్గిస్తుందని అంటున్నారు.
పానకంలో ఘాటు కోసం మిరియాలు వాడుతారు. వీటిలోని పోషకాలు దగ్గు, జలుబు, జ్వరం, ఇన్ఫెక్షన్ వంటి సమస్యలను తగ్గిస్తుంది. ఇందులోని పోషకాలు ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా చేస్తుంది. అలాగే ఎన్నో పోషకాలు ఉండే తులసి ఆకులను కూడా పానకంలో వాడుతారు. ఇందులో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ ఫంగల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి ఇమ్యూనిటీ పవర్‌ను పెంచి రోగనిరోధక శక్తిని కాపాడతాయి. అలాగే వడదెబ్బ బారిన పడకుండా చేస్తుంది. వీటితో పాటు కడుపు సంబంధిత సమస్యలను కూడా తగ్గిస్తుంది. అయితే పానకంలో శొంఠిని కూడా వాడుతారు. ఇది కఫం, అజీర్తి, కడుపు నొప్పి వంటి సమస్యలను కూడా తగ్గిస్తుంది. ఎలాంటి ఇన్ఫెక్షన్లు రాకుండా చేస్తుందని నిపుణులు అంటున్నారు. వీటితో పాటు వడపప్పును తీసుకుంటే.. అనారోగ్య సమస్యలు అన్ని కూడా క్లియర్ అవుతాయి. చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. ఎలాంటి చర్మ సమస్యలు కూడా రావని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఆచారం ప్రకారం మాత్రమే కాకుండా ఆరోగ్యం కోసమైనా నవమి నైవేద్యాలను తప్పకుండా తీసుకోండి. వీటివల్ల శరీర ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఎలాంటి అనారోగ్య సమస్యలు రావని అంటున్నారు.
Disclaimer: కేవలం అవగాహన కోసం మాత్రమే ఈ సమాచారం ఇవ్వడం జరిగింది. దీన్ని trendingtelugus.com నిర్ధారించదు. గూగుల్ ఆధారంగా తెలియజేయడం జరిగింది.
-
Sri Rama Navami: నవమి రోజు వీటిని నైవేద్యంగా పెడితే.. అదృష్టమే
-
Sri Sama Navami Pooja: నవమి రోజు ఈ పని చేస్తే చాలు.. మీకు పెళ్లి కావడం గ్యారెంటీ
-
Sri rama navami: శ్రీరామ నవమి రోజు ఎలా పూజిస్తే.. సమస్యలు తొలగిపోతాయంటే?
-
Sri rama navami: శ్రీరామ నవమి రోజు ఈ పనులు చేస్తే అదృష్టమే
-
IPl 2025:క్రికెట్ ఫ్యాన్స్ షాకింగ్ న్యూస్.. ఆ మ్యాచ్ రీ షెడ్యూల్?