Abhishek Sharma : అభిషేక్ శర్మ రికార్డ్.. ఏకంగా రాహుల్‌నే దాటేసి!
Abhishek Sharma: ఐపీఎల్‌లో అత్యధిక స్కోర్లు సాధించిన వారి జాబితాలో చేరాడు. ఏకంగా కేఎల్ రాహుల్ రికార్డును బ్రేక్ చేశాడు. రాహుల్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై 132 పరుగులు చేశాడు. ఇప్పుడు ఆ రికార్డును అభిషేక్ శర్మ బ్రేక్ చేశాడు.

Abhishek Sharma : ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు మొదటి మ్యాచ్ మాత్రమే గెలిచింది. ఆ తర్వాత వరుస మ్యాచ్‌లు ఓడిపోవడంతో.. ఇక ఇంటికే అనుకున్నారు. ఏప్రిల్ 12వ తేదీన జరిగిన మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్ విన్ కాకపోతే మాత్రం ఇంటికే అనుకున్నారు. ఇంతలో సన్‌రైజర్స్ హైదరాబాద్ పంజాబ్‌పై 8 వికెట్ల తేడాతో గెలిచింది. ఓపెనర్‌గా వచ్చిన అభిషేక్ వర్మ అయితే చెలరేగిపోయాడు. అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి.. ఇది కదా ఫ్యాన్స్‌కు కావాల్సిందని అనేలా చేశారు. అయితే అభిషేక్ శర్మ ఈ మ్యాచ్‌లో మొత్తం 55 బంతుల్లో 141 పరుగులు చేసి రికార్డు సృష్టించాడు. ఇందులో 10 సిక్స్‌లు, 14 ఫోర్లు కూడా ఉన్నాయి. దీంతో అభిషేక్ రికార్డు సృష్టించాడు. ఐపీఎల్‌లో అత్యధిక స్కోర్లు సాధించిన వారి జాబితాలో చేరాడు. ఏకంగా కేఎల్ రాహుల్ రికార్డును బ్రేక్ చేశాడు. రాహుల్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై 132 పరుగులు చేశాడు. ఇప్పుడు ఆ రికార్డును అభిషేక్ శర్మ బ్రేక్ చేశాడు. క్రిస్ గేల్ 175 పరుగులతో మొదటి స్థానంలో ఉండగా.. బ్రెండన్ మెకల్లమ్ 158 పరుగులతో రెండో స్థానంలో, అభిషేక్ శర్మ 141 పరుగులతో మూడో స్థానంలో, క్వింటన్ డి కాక్ 140 పరుగులో నాలుగో స్థానంలో AB డివిలియర్స్ 133 పరుగులతో ఐదో స్థానంలో ఉన్నారు.
అభిషేక్ శర్మ దీంతో పాటు సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మన్‌గా కూడా నిలిచాడు. 2017లో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)పై 126 పరుగులు చేసిన డేవిడ్ వార్నర్‌ను అభిషేక్ అధిగమించాడు. ఐపీఎల్‌లో అతిపెద్ద ఇన్నింగ్స్ ఆడిన బ్యాట్స్‌మన్‌గా కూడా అభిషేక్ నిలిచాడు. అయితే ఇందులో అభిషేక్ శర్మ 24 బౌండరీలు కొట్టాడు. ఐపీఎల్ మ్యాచ్‌లో క్రిస్ గేల్ మాత్రమే ఎక్కువ బౌండరీలు కొట్టాడు. 2013లో పూణే వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గేల్ 30 బౌండరీలు బాదాడు. అయితే సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాట్స్‌మన్ ఒక మ్యాచ్‌లో 10 సిక్సర్లు బాదడం ఇదే తొలిసారి. అభిషేక్ శర్మ తన సెంచరీ పూర్తి చేయడానికి 40 బంతులు తీసుకున్నాడు. ఇది ఐపీఎల్ చరిత్రలో వేగవంతమైన సెంచరీలో ఇది ఆరోది.
IPLలో అత్యంత వేగవంతమైన సెంచరీలు
30- క్రిస్ గేల్
37- యూసుఫ్ పఠాన్
38- డేవిడ్ మిల్లర్
39- ట్రావిస్ హెడ్
39- ప్రియాంష్ ఆర్య
40- అభిషేక్ శర్మ
-
MS Dhoni : ఐపీఎల్‌లో సీఎస్కేకి ఫ్యూచర్ ఉందా? ధోని ఏమైనా ప్లాన్ చేశాడా?
-
ICC : ఐసీసీ కీలక నిర్ణయం.. ఒక బంతితోనే వన్డే!
-
Shreyas Iyer: రూ.23 కోట్లకు న్యాయం చేసిన అయ్యర్.. ఒక్క మ్యాచ్‌తో నోళ్లు మూయించేశాడుగా!
-
IPL 2025: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. బుమ్రా ఎంట్రీ కష్టమే
-
IPL 2025: సన్ రైజర్స్ కు ఆడలేదు.. లక్నోకు దంచికొడుతుండు..ఇదేందయ్యా ఇదీ
-
Rishabh Pant: రూ.27 కోట్లు వేస్ట్.. పంత్‌ను ఏకిపారేస్తున్నా గోయెంకా