IPL: ఐపీఎల్లో ఆ ఒక్క టీమ్‌కి తప్పా.. అన్నింటికి ఇండియన్ క్రికెటర్లే కెప్టెన్
IPL ఐదుసార్లు ఛాంపియన్ అయిన ముంబై ఇండియన్స్‌కి హార్డిక్ పాండ్యా కెప్టెన్‌గా ఉండనున్నాడు. కానీ మొదటి మ్యాచ్ అతనిపై బ్యాన్ ఉండటంతో ఆడటం లేదు. ఈ క్రమంలో సూర్య కుమార్ యాదవ్ కెప్టెన్‌గా వ్యవహరించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

IPL: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 మార్చి 22వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. మొత్తం 10 జట్లు ఈ లీగ్‌లో పోటీపడనున్నాయి. ప్రారంభ మ్యాచ్ డిఫెండింగ్ ఛాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరుగుతుంది. అయితే హైదరాబాద్‌లో క్వాలిఫయర్, ఒక ఎలిమేనటర్ మ్యాచ్ జరగనుంది. ఈ ఏడాది ఐపీఎల్ 2025 మ్యాచ్ ఈడెన్ గార్డెన్స్‌లో జరగనుంది. ఈ సీజన్లో మొత్తం 74 మ్యాచ్‌లు 10 జట్లు ఆడనున్నాయి. మొత్తం 65 రోజుల పాటు ఐపీఎల్ 18వ సీజన్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్‌లు మొత్తం 11 వేదికల్లో జరగనుంది. అలాగే రాజస్థాన్ జైపూర్‌లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో ఐదు మ్యాచ్‌లు, అస్సాంలోని బర్సాపరా క్రికెట్ స్టేడియంలో రెండు మ్యాచ్‌లు ఆడనుంది. ఢిల్లీ క్యాపిటల్స్ వైజాగ్ స్టేడియంలో రెండు హోమ్ మ్యాచ్‌లు ఆడనున్నట్లు తెలుస్తోంది. మిగతా మ్యాచ్‌లు ఢిల్లీలో జరుగుతాయి.ఫైనల్ మ్యాచ్ మే 25న ఈడెన్ గార్డెన్స్‌లో జరుగుతుంది. అయితే గత సీజన్లో ఉన్న జట్లుతో పోలిస్తే ఈ సీజన్లో చాలా వరకు ప్లేయర్లు మారారు. ముఖ్యంగా కెప్టెన్లు ఇండియన్స్ కంటే విదేశీయులు ఉండేవారు. కానీ ఈసారి కేవలం హైదరాబాద్ జట్టుకు మాత్రమే విదేశీ ప్లేయర్ ఉన్నారు. మిగతా అన్ని జట్లుకు ఇండియన్ కెప్టెన్లు ఉన్నారు. అయిత బాగా మారిపోయారు. కేవలం హైదరాబాద్ సన్‌రైజర్స్ జట్టుకు మాత్రమే గత సీజన్ కెప్టెన్ ఉన్నారు. మిగతా 10 జట్లలో 9 జట్లకు భారత ప్లేయర్లే కెప్టెన్లుగా వ్యవహరించనున్నారు. ఏ జట్టుకు కెప్టెన్‌గా ఉన్నారో ఈ స్టోరీలో చూద్దాం.
ఐదుసార్లు ఛాంపియన్ అయిన ముంబై ఇండియన్స్‌కి హార్డిక్ పాండ్యా కెప్టెన్‌గా ఉండనున్నాడు. కానీ మొదటి మ్యాచ్ అతనిపై బ్యాన్ ఉండటంతో ఆడటం లేదు. ఈ క్రమంలో సూర్య కుమార్ యాదవ్ కెప్టెన్‌గా వ్యవహరించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఐదు సార్లు చాంపియన్‌గా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్‌గా ఉండనున్నాడు. మూడు సార్లు చాంపియన్‌గా నిలిచిన కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకి కొత్త కెప్టెన్ అజింక్యా రహానే. ఇక ఢిల్లీ క్యాపిటల్స్‌కి కెప్టె్న్‌గా అక్షర్ పటేల్ ఉండనున్నాడు. ఇక రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకి కెప్టెన్‌గా రజత్ పటిధార్ ఉండనున్నాడు. అయితే అక్షర్ పటేల్, రజత్ పటిధార్ మొదటిసారి కెప్టెన్‌గా ఉండనున్నారు. లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్‌గా రిషభ్ పంత్ ఉంటాడు. పంజాబ్ కింగ్స్ జట్టుకు శ్రేయస్ అయ్యర్, రాజస్థాన్ రాయల్స్ జట్టుకు సంజూ శాంసన్ కెప్టెన్‌గా ఉండనున్నాడు. రిషబ్ పంత్ గత సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్‌కి కెప్టెన్‌గా ఉండేవాడు. కానీ మెగా వేలంలో లక్నో సూపర్ జెయింట్స్ రూ.16 కోట్లకు కొనుగోలు చేసింది.
-
LSG vs SRH: సన్‌రైజర్స్‌ను లక్నో సూపర్ జెయింట్స్ తట్టుకోగలదా?
-
Rashid Khan: బుమ్రా రికార్డ్ బ్రేక్ చేసిన రషీద్ ఖాన్
-
Vignesh Putur: చెన్నైకి చెమటలు పట్టించిన పుతుర్.. ఇంతకీ ఎవరు?
-
IPL: ఐపీఎల్లో చీర్లీడర్లు ఒక్కో మ్యాచ్‌కు ఎంత సంపాదిస్తారంటే?
-
IPL: ఐపీఎల్ సీజన్లో ఈ స్టాక్స్ కొంటే.. లాభమంతా మీదే!
-
IPL క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. Airtel, VI సూపర్ ప్లాన్స్..!