IPL: KKRకు బిగ్ షాక్.. టోర్నీ నుంచి ఉమ్రాన్ మాలిక్ ఔట్
Ipl ఈ ఏడాది ఐపీఎల్ 2025 మ్యాచ్ ఈడెన్ గార్డెన్స్‌లో జరగనుంది. ఈ సీజన్‌లో మొత్తం 74 మ్యాచ్‌లు 10 జట్లు ఆడనున్నాయి. మొత్తం 65 రోజుల పాటు ఐపీఎల్ 18వ సీజన్ జరగనుంది.

Ipl: మార్చి 22వ తేదీ నుంచి ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభం కానుంది. ఈ సీజన్‌లో తొలి మ్యాచ్ కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్), రాయల్స్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్లు మధ్య జరగనుంది. ఈడెన్ గార్డెన్స్‌లో మ్యాచ్ జరగనుంది. అయితే ఐపీఎల్ ప్రారంభం కాక ముందే కోల్‌కతా నైట్ రైడర్స్‌కి బిగ్ షాక్ తగిలింది. ఈ జట్టులో కీలక ప్లేయర్ అయిన ఉమ్రాన్ మాలిక్ గాయం వల్ల ఈ సీజన్‌కి దూరం కానున్నాడు. ఐపీఎల్ ఇంకో నాలుగో రోజుల్లో ప్రారంభం కానుండగా గాయం వల్ల మాలిక్ దూరమవుతున్నాడు. కేకేఆర్ జట్టులోకి మాలిక స్థానంలో ఎడమ చేతి వాటం ఫాస్ట్ బౌలర్ సకారియాను తీసుకుంది. ఉమ్రాన్ మాలక్ గతంలో హైదరాబాద్ సన్‌రైజర్స్ జట్టు తరఫున ఆడాడు. ఇతను ఫాస్ట్ బౌలర్ కావడంతో ఇతని స్పీడ్ చూసి ఈ ఐపీఎల్ వేలంలో కేకేఆర్ జట్టు తీసుకుంది. కానీ గాయం కారణంగా నిష్క్రమించాల్సి వస్తుంది. అయితే మాలిక్ ప్లేస్‌లో తీసుకున్నా సకారియాను ఇండియా నుంచి అంతర్జాతీయ టోర్నీలు ఆడాడు. సకారియా ఐపీఎల్‌లో 19 మ్యాచ్‌లలో మొత్తం 20 వికెట్లు పడగొట్టాడు. అయితే ఇతన్ని ఈ వేలంలో ఏ జట్టు కూడా కోనుగోలు చేయలేదు. దీంతో కేకేఆర్ జట్టు సకారియాను రూ.75 లక్షలకు కొనుగోలు చేసింది. మాలిక్ స్థానంలో సాకరియాకు చోటు ఇచ్చింది. మరి మాలిక్ లేని లోటును సకారియా తీరుస్తాడో లేదో చూడాలి. అయితే కేకేఆర్ ఫైనల్ జట్టు క్వింటన్ డి కాక్ (వికెట్ కీపర్), అజింక్య రహానే, వెంకటేశ్ అయ్యర్, అంగ్‌క్రిష్ రఘువంశీ, రింకు సింగ్, రమణ్‌దీప్ సింగ్, ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, హర్షిత్ రాణా, అన్రిచ్ నోర్ట్జే/స్పెన్సర్ జాన్సన్, వరుణ్ చక్రవర్తి. అయితే ఇది కేవలం అంచనా మాత్రమే. ఈ సీజన్‌లో కేకేఆర్ జట్టు చాలా మార్పులు చేసింది. టీమ్ కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్‌ను తీసుకోవాలని ప్లాన్ చేసింది. కానీ వేలంలో శ్రేయస్ అయ్యర్‌ను పంజాబ్ ఫ్రాంచైజీ తీసుకుంది.
ఈ ఏడాది ఐపీఎల్ 2025 మ్యాచ్ ఈడెన్ గార్డెన్స్‌లో జరగనుంది. ఈ సీజన్‌లో మొత్తం 74 మ్యాచ్‌లు 10 జట్లు ఆడనున్నాయి. మొత్తం 65 రోజుల పాటు ఐపీఎల్ 18వ సీజన్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్‌లు మొత్తం 11 వేదికల్లో జరగనుంది. అలాగే రాజస్థాన్ జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో ఐదు మ్యాచ్‌లు, అస్సాంలోని బర్సాపరా క్రికెట్ స్టేడియంలో రెండు మ్యాచ్‌లు ఆడనుంది. ఢిల్లీ క్యాపిటల్స్ వైజాగ్ స్టేడియంలో రెండు హోమ్ మ్యాచ్‌లు ఆడనున్నట్లు తెలుస్తోంది. మిగతా మ్యాచ్‌లు ఢిల్లీలో జరుగుతాయి.ఫైనల్ మ్యాచ్ మే 25న ఈడెన్ గార్డెన్స్‌లో జరుగుతుంది.
-
Rashid Khan: బుమ్రా రికార్డ్ బ్రేక్ చేసిన రషీద్ ఖాన్
-
Vignesh Putur: చెన్నైకి చెమటలు పట్టించిన పుతుర్.. ఇంతకీ ఎవరు?
-
IPL: ఐపీఎల్‌లో చీర్లీడర్లు ఒక్కో మ్యాచ్‌కు ఎంత సంపాదిస్తారంటే?
-
IPL: ఐపీఎల్ సీజన్‌లో ఈ స్టాక్స్ కొంటే.. లాభమంతా మీదే!
-
IPL క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. Airtel, VI సూపర్ ప్లాన్స్..!
-
IPl 2025:క్రికెట్ ఫ్యాన్స్ షాకింగ్ న్యూస్.. ఆ మ్యాచ్ రీ షెడ్యూల్?