ICC Champions Trophy: కివీస్‌పై ఇండియా గ్రాండ్ విక్టరీ

ICC Champions Trophy:
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని భారత్ సొంతం చేసుకుంది. దుబాయ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ జట్టు 251/7 స్కోర్ చేసింది. 252 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ మరో ఓవర్ మిగిలి ఉండగానే నాలుగు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట్లో టీమిండియా బ్యాటర్లు బాగానే రాణించినా.. మ్యాచ్ చివరకు వచ్చేసరికి కాస్త ఒత్తిడికి గురయ్యారు. కీలక బ్యాటర్లు రోహిత్, గిల్, కోహ్లీ పెవిలియన్ చేరడంతో బ్యాటర్లతో పాటు ఇండియా ఫ్యాన్స్ కూడా కాస్త ఆందోళన చెందారు. చివరకు భారత్ కివీస్ జట్టుపై ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కివీస్ జట్టు 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది. 252 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ఒక ఓవర్ ఉందనగానే 6 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది.
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ 83 బంతుల్లో 76 పరుగులు చేశాడు. ఇందులో 7 ఫోర్లు, 3 సిక్స్‌లు ఉన్నాయి. ఆ తర్వాత శుభ్‌మన్ గిల్ (31) పెవిలియన్ చేరగా విరాట్ కోహ్లీ కేవలం ఒక పరుగుతో తీవ్ర నిరాశ పర్చాడు. ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్ 48 పరుగులు, కేఎల్ రాహుల్ 34* పరుగులు చేశాడు. అక్షర్ పటేల్ 29, హార్దిక్ పాండ్య 18, రవీంద్ర జడేజా 9* పరుగులు చేశారు. చివరగా రవీంద్ర జడేజా ఫోర్‌తో టీమిండియాను గెలిపించాడు. అయితే భారత్ జట్టు ఛాంపియన్స్ ట్రోఫీ గెలవడం ఇది మూడోసారి. గతంలో శ్రీలంకతో కలిసి సంయుక్త విజేతగా 2002లో గెలిచింది. ఆ తర్వాత 2013లో టీమిండియా గెలవగా మళ్లీ ఇప్పుడు గెలిచింది.
Team India are the 2025 Champions Trophy winners India 🇮🇳🏆#INDvsNZ | #ChampionsTrophy2025 pic.twitter.com/8olCg56F1d
— Indian Cricket Team (@incricketteam) March 9, 2025
మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ బ్యాటర్లు బాగానే రాణించారు. డారిల్ మిచెల్ (63), మైకేల్ బ్రాస్‌వెల్ (53*) పరుగులు చేయగా.. రచిన్ రవీంద్ర (37), గ్లెన్ ఫిలిప్స్ (34), విల్ యంగ్ (15), కేన్ విలియమ్సన్ (11), టామ్ లేథమ్ (14), మిచెల్ శాంట్నర్ (8) పరుగులు చేశారు. నాథన్ స్మిత్ 0 (1) నాటౌట్‌గా ఈ మ్యాచ్‌లో నిలిచాడు. భారత్ బౌలర్లు కుల్‌దీప్ యాదవ్ 2, వరుణ్ చక్రవర్తి 2 వికెట్లు తీయగా.. రవీంద్ర జడేజా, షమి చెరో వికెట్ తీశారు.
𝐂𝐇𝐀𝐌𝐏𝐈𝐎𝐍𝐒 🇮🇳🏆
India get their hands on a third #ChampionsTrophy title 🤩 pic.twitter.com/Dl0rSpXIZR
— ICC (@ICC) March 9, 2025
-
Subhman Gil: మరో అమ్మాయితో ప్రేమలో పడిన శుభమన్ గిల్.. ఇక సారా లేనట్టేనా?
-
Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీ ప్రైజ్ మనీలో ఒక్కో ఆటగాడికి ఎంత వచ్చిందంటే?
-
Champions Trophy 2025: గెలిచిన జట్టు వైట్ బ్లేజర్స్ ఎందుకు ధరిస్తారో మీకు తెలుసా?
-
Rohit Sharma: తప్పుడు ప్రచారాలు చేయవద్దు.. రిటైర్మెంట్‌పై హిట్ మ్యాన్ కీలక ప్రకటన
-
Yuzvendra Chahal: స్టేడియంలో మరో అమ్మాయితో చాహల్.. ఇంతకీ ఎవరీ మిస్టరీ గర్ల్?
-
ICC Champions Trophy: టీమిండియా విన్నింగ్ చూసి.. చిన్నపిల్లాడిలా సునీల్ గవాస్కర్ డ్యాన్స్.. వైరలవుతున్న వీడియో!