Jasprit Bumrah: ముంబై ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. వచ్చేస్తున్న బుమ్రా
Jasprit Bumrah ఐపీఎల్ ప్రారంభం కాకముందే.. బుమ్రా వెన్ను నొప్పితో బాధపడుతున్నాడు. ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ(ఎన్‌సీఏ)లో బుమ్రా రిహాబిలిటేషన్ తీసుకున్నాడు. ఎన్‌సీఏలోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లో బౌలింగ్ ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టాడు.

Jasprit Bumrah: ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే శుభవార్త. ముంబై జట్టు స్టార పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఐపీఎల్‌లో ఆడేందుకు సిద్ధమయ్యాడు. గత కొన్ని రోజుల నుంచి వెన్నెముక సమస్యతో ఇబ్బంది పడుతున్న బుమ్రా జట్టులోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నాడని ముంబై జట్టు సోషల్ మీడియా ద్వారా తెలిపింది. ది లయన్ ఈజ్ బ్యాక్ అంటూ ముంబై ఇండియన్స్ ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అయితే ఈ వీడియోలో బుమ్రా సతీమణితో పాటు కొడుకు అంగద్ కూడా కనిపించాడు. కుమారుడు అంగద్‌కు బుమ్రా సతీమణి.. తన ఐపీఎల్ జర్నీ గురించి స్టోరీలా చెబుతున్నట్లు చూపించారు. బుమ్రా జట్టులోకి రీ ఎంట్రీ ఇవ్వడంతో ముంబై జట్టుతో పాటు ఫ్యాన్స్ కూడా సంతోషపడుతున్నారు. ఇక బుమ్రాను తట్టుకోవడం కష్టమని అంటున్నారు. అయితే బుమ్రా జట్టులోకి చేరాడు. ఏ మ్యాచ్ నుంచి ఆడతాడనే విషయంపై ఇంకా క్లారిటీ లేదు. సోమవారం రాయల్స్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో బుమ్రా ఆడే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఏప్రిల్ 13 వ తేదీన మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో బుమ్రా ఆడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో అయితే బుమ్రా తప్పకుండా ఆడుతాడు.
ఇదిలా ఉండగా ఐపీఎల్ ప్రారంభం కాకముందే.. బుమ్రా వెన్ను నొప్పితో బాధపడుతున్నాడు. ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ(ఎన్‌సీఏ)లో బుమ్రా రిహాబిలిటేషన్ తీసుకున్నాడు. ఎన్‌సీఏలోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లో బౌలింగ్ ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టాడు. కానీ ప్రస్తుతం పూర్తి స్థాయిలో బుమ్రా బౌలింగ్ వేయలేకపోయాడు. ఇలా ప్రాక్టీస్ సమయంలో కూడా మళ్లీ ఎలాంటి ఫ్రాక్చర్ కాకుండా ఉండేందుకు బుమ్రా జాగ్రత్త పడ్డాడు. రోజురోజుకీ వర్క్ లోడ్ కూడా పెంచుతున్నారు. జనవరి మొదటి వారంలో ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ జరిగింది. ఈ టోర్నీలో చివరి టెస్ట్ మ్యాచ్‌లో బుమ్రా గాయపడ్డాడు. మ్యాచ్ మధ్యలో మైదానం నుంచి వెళ్లిపోయాడు. వెంటనే మన దేశానికి వచ్చి బెంగళూరులో చికిత్స తీసుకున్నాడు.
బుమ్రా ఛాంపియన్స్ ట్రోఫీ సమయం దగ్గరకి వచ్చినా సరే గాయం నుంచి కోలుకోలేక పోయాడు. బుమ్రాకి ఎలాంటి ఇబ్బంది కూడా లేకపోయినా బౌలింగ్ అయితే చేయకూడదని వైద్యులు తెలిపారు. దీంతో ఛాంపియన్స్ ట్రోఫీకి కూడా బుమ్రా దూరం అయ్యాడు. ఇతని స్థానంలో వరుణ్ చక్రవర్తిని తీసుకున్నారు. ఏది ఏమైనా టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీని గెలిచింది. అయితే ఐపీఎల్ సీజన్ తర్వాత భారత్ ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనుంది. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ జట్టు 5 సార్లు ట్రోఫీ గెలిచింది. కానీ ఈ సీజన్‌లో రెండు మ్యాచ్‌లు వరుసగా ఓడిపోయింది.
𝑹𝑬𝑨𝑫𝒀 𝑻𝑶 𝑹𝑶𝑨𝑹 🦁#MumbaiIndians #PlayLikeMumbai #TATAIPL pic.twitter.com/oXSPWg8MVa
— Mumbai Indians (@mipaltan) April 6, 2025
-
MS Dhoni : ఐపీఎల్‌లో సీఎస్కేకి ఫ్యూచర్ ఉందా? ధోని ఏమైనా ప్లాన్ చేశాడా?
-
Hardik Pandya: ఐపీఎల్ హిస్టరీలోనే కెప్టెన్‌గా హార్దిక్ రికార్డు
-
IPL 2025: ఐపీఎల్‌లో రిటైర్డ్ ఔట్ ప్లేయర్స్ లిస్ట్ ఇదే
-
Tilak Varma: తిలక్ వర్మ రిటైర్డ్ ఔట్.. తెలుగు కుర్రాడికి ఘోర అవమానం
-
Jasprit Bumrah: ముంబై ఇండియన్స్‌ను గుడ్ న్యూస్.. బుమ్రా ఎంట్రీ అప్పుడే?
-
Shreyas Iyer: రూ.23 కోట్లకు న్యాయం చేసిన అయ్యర్.. ఒక్క మ్యాచ్‌తో నోళ్లు మూయించేశాడుగా!