MS Dhoni: సీఎస్కేకి కెప్టెన్‌గా ధోని.. అసలు కారణమేంటి?
MS Dhoni ఐపీఎల్ మొత్తం సీజన్స్‌లో ధోని మోస్ట్ సక్సెస్ ఫుల్ కెప్టెన్. ఇతని నాయకత్వంలో చెన్నై సూపర్ కింగ్స్ మొత్తం ఐదు సార్లు ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలిచింది. ధోని అద్భుతమైన ఆటతో పాటు టీం కూడా సూపర్‌గా ఆడింది.

MS Dhoni: ఐపీఎల్ సీజన్ చెన్నై సూపర్ కింగ్స్‌కు బిగ్ షాక్ తగిలింది. ఈ జట్టు కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ఈ ఐపీఎల్ సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. ఈ కారణంతో కెప్టెన్‌గా ధోని (MS Dhoni) ప్రస్తుతం బాధ్యతలు అందుకున్నాడు. చెన్నై కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ ఈ విషయాన్ని ధ్రువీకరించాడు. సీఎస్కే జట్టుకు ఒక అన్‌క్యాప్డ్ ప్లేయర్ ఉన్నాడడని, అతని పేరు ధోని అని, ఇకపై అన్ని మ్యాచ్‌లకు కూడా తనే ఇక కెప్టెన్‌గా వ్యవహరిస్తాడని తెలిపారు. అయితే ధోని గతంలో కూడా సీఎస్కే జట్టుకు కెప్టెన్‌గా ఉన్నాడు. ధోని 2008 నుంచి 2023 వరకు చెన్నై జట్టుకి కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఈ సమయంలో చెన్నై జట్టు మొత్తం ఐదు ట్రోఫీలు అందుకుంది. అయితే రుతురాత్ 2024 సీజన్‌కు కెప్టెన్‌గా మారాడు. మార్చి30వ తేదీన రాజస్థాన్‌తో మ్యాచ్ ఆడుతుంటే రుతురాజ్ చేతికి గాయం తగిలింది. అయినా కూడా తిరిగి రెండు మ్యాచ్‌లు ఆడాడు. కానీ ఇప్పుడు ఎక్కువ కావడంతో సీజన్‌కు దూరమయ్యాడు. అయితే మోచేయి విరిగినట్లు స్కానింగ్‌లో తెలుస్తోంది. కుదటపడటానికి ఇంకా చాలా సమయం పడుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటి వరకు ఈ సీజన్ ఐపీఎల్‌లో సీఎస్కే టీం కేవలం ఐదు మ్యాచ్‌ల్లో ఒక్కటి మాత్రమే గెలిచింది. మిగతా అన్ని మ్యాచ్‌లు కూడా ఓడిపోయింది. ధోని రాకతో అయినా కూడా మ్యాచ్‌లు గెలుస్తుందో లేదో చూడాలి. ధోనీ సారథ్యంలో సీఎస్కే జట్టు మ్యాచ్‌లు గెలుస్తుందని ఫ్యాన్స్ అంటున్నారు.
ఐపీఎల్ మొత్తం సీజన్స్‌లో ధోని మోస్ట్ సక్సెస్ ఫుల్ కెప్టెన్. ఇతని నాయకత్వంలో చెన్నై సూపర్ కింగ్స్ మొత్తం ఐదు సార్లు ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలిచింది. ధోని అద్భుతమైన ఆటతో పాటు టీం కూడా సూపర్‌గా ఆడింది. ఈ సీజన్‌లో అయితే ధోని మార్క్ కనిపించడం లేదు. రుతురాజ్ కెప్టెన్సీలో సీఎస్కే ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో ఒక్క దాంట్లోనే విజయం సాధించింది. అయితే పాయింట్ల పట్టికలో ఈ జట్టు 9వ స్థానంలో ఉంది. సీఎస్కే తర్వాత సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఉంది. మొదటి ప్లేస్‌లో గుజరాత్ టైటాన్స్ ఉండగా.. రెండో ప్లేస్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఉంది. ఇక మూడో స్థానానికి వస్తే ఆర్సీబీ జట్టు మూడో స్థానంలో ఉంది. ఈ సీజన్‌లో మొత్తం 5 మ్యాచ్‌లు ఆడగా.. అందులో మొత్తం మూడు మ్యాచ్‌లు గెలిచింది. దీంతో మూడో స్థానంలో ఉంది. ఆ తర్వాత స్థానాల్లో పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్ ఉన్నాయి. ఈ సీజన్‌లో దుల్లగొడుతుందని అనుకున్న సన్‌రైజర్స్ జట్టు మాత్రం కేవలం చివరి ప్లేస్‌లో ఉంది. ఈ జట్టు మొత్తం 300కు పైనే స్కోర్ చేస్తుందంటే.. కనీసం 150 కూడా కొట్టడం లేదు.