BCCI: ఆ రూల్ మార్చం.. తగ్గేదేలే అంటున్న బీసీసీఐ

BCCI:
ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా ఓటమి పాలైన తర్వాత బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ తర్వాత ఛాంపియన్స్ ట్రోపీ జరిగింది. ఈ సమయంలో బీసీసీఐ ఆటగాళ్ల విషయంలో కొన్ని కండీషన్స్ పెట్టింది. ఆటగాళ్లతో పాటు కుటుంబ సభ్యులను తీసుకెళ్లకూడదని తెలిపింది. 45 రోజుల కంటే ఎక్కువ రోజలు టోర్నీ ఉంటేనే ఆటగాళ్లు తమ కుటుంబాలను తీసుకెళ్లాలి. లేకపోతే తీసుకెళ్లకూడదని తెలిపింది. ఒకవేళ తీసుకొచ్చినా కూడా కుటుంబ సభ్యుల ఖర్చు అంతా కూడా ఆటగాడే భరించాలి. అయితే వీటిపై ఆటగాళ్లు అందరూ కూడా కండించారు. అయినా కూడా బీసీసీఐ ఎలాంటి మార్పు చేయలేదు. అయితే ఇటీవల విరాట్ కోహ్లీ వీటిపై స్పందించాడు. బీసీసీఐ పెట్టిన రూల్స్పై అసంతృప్తి వ్యక్తం చేశాడు. మ్యాచ్ జరిగిన తర్వాత ఒంటరిగా రూమ్లో కూర్చోని ఎడవాలా? కుటుంబ సభ్యులతో కాస్త సమయం గడిపితే రిలాక్స్ గా ఉంటుంది. కుటుంబంతో సమయం గడిపే ఏ నిమిషాన్ని కూడా నేను వృథా చేసుకోనని తెలిపాడు.
కుటుంబంతో కలిసి ఉండే ప్రతీ అవకాశాన్ని కూడా నేను యూజ్ చేసుకుంటానని, ఫ్యామిలీస్ కూడా ఉంటే బాగుంటుందని తెలిపాడు. దీనిపై మిగతా క్రికెటర్లు కూడా కోహ్లీ బాటలోనే నడిచారు. దీంతో బీసీసీఐ విదేశీ మ్యాచ్లకు కూడా కుటుంబాని తీసుకెళ్లవచ్చని వార్తలు వచ్చాయి. కుటుంబాన్ని కూడా తీసుకెళ్లాలంటే ముందుగా బీసీసీఐ అనుమతి తీసుకోవాలని, దరఖాస్తు చేసుకుంటే బీసీసీఐ తర్వాత నిర్ణయం తీసుకుంటుందని వార్తలు వచ్చాయి. కోహ్లీ మాటలకే బీసీసీఐ తగ్గిందన్నారు. కానీ దీనిపై బీసీసీఐ తాజాగా స్పందించింది. ఈ నిబంధనను మార్చడం కుదరదని తెలిపింది. గతంలో కుటుంబాలను ఆటగాళ్లలో 45 రోజుల వరకు ఉండవచ్చు. కానీ ఇప్పుడు కేవలం రెండు వారాలకు మాత్రమే అది పరిమితం చేసింది. దీంతో క్రికెటర్లు నుంచి విమర్శలు కూడా వచ్చాయి.
టీమిండియా వరుసగా ఓటమి పాలు కావడంతో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. కుటుంబాలు లేకపోతే ఇంకా బాగా ఆడతారనే ఉద్దేశంతో ఈ కొత్త నిబంధనను తీసుకొచ్చింది. ఈ నిబంధనపై విరాట్ కోహ్లీ అసంతృప్తి వ్యక్తం చేశాడు. కుటుంబానితో గడిపే కొద్ది సమయాన్ని కూడా వృథా చేసుకోనని తెలిపాడు. అయితే బీసీసీఐ తగ్గి రూల్ మారుస్తుందని వార్తలు వచ్చాయి. కానీ వీటికి చెక్ పెడుతూ బీసీసీఐ ప్రకటించింది. ఇకపై ఏ విదేశీ పర్యటన ఉన్నా కూడా కుటుంబాలను కేవలం రెండు వారాలు మాత్రమే తీసుకెళ్లాలి. అది కూడా ఎక్కువ రోజుల పర్యటన ఉంటేనే ఈ రూల్. అయితే ఈ రూల్ను ప్రతీ ఒక్క ఆటగాడు తప్పకుండా పాటించాలని బీసీసీఐ తెలిపింది.
BCCI, Virat Kohli, Champions Trophy, Family, New rule
-
IPL 2025: ప్లే ఆఫ్స్కు చేరిన ఆర్సీబీకి తప్పని భయం.. ఆందోళనలో ఫ్యాన్స్
-
IPL 2025 : బీసీసీఐ నిర్ణయం పై మండిపడుతున్న అభిమానులు..కోల్కతా ఫ్యాన్స్ ఆగ్రహావేశాలు!
-
Gautam Gambhir: విరాట్, రోహిత్ ఔట్.. ఇక గౌతమ్ గంభీర్ హవానే!
-
Test Matches: టెస్ట్ మ్యాచ్లకు విరాట్ రిటైర్మెంట్.. కారణమిదే!
-
CIBIL Score: పెళ్లికి ముందు సిబిల్ స్కోర్ తప్పనిసరిగా చెక్ చేయాలా?
-
Bank Deposit: బ్యాంకులో ఎక్కువగా డిపాజిట్ చేశారో.. మీకు నోటీసులు తప్పవు