Navratri: నవరాత్రులు తొమ్మిది రోజులే ఎందుకు జరుపుకుంటారు?
Navratri వసంత కాలంలో చైత్ర శుద్ధ పాడ్యమి నాడు కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. అయితే ఈ ఉగాది నాటి నుంచి చైత్ర శుద్ధ నవమి వరకు ఉన్న తొమ్మిది రోజుల పాటు నవరాత్రుల పూజలు నిర్వహిస్తారు.

Navratri: నవరాత్రులు అంటే దసరా పండుగ సమయంలో జరుపుకుంటారని చాలా మంది అనుకుంటారు. అయితే కేవలం దసరాకి మాత్రమే కాకుండా ఉగాదికి కూడా నవరాత్రులను జరుపుకుంటారు. నవరాత్రులు మొత్తం 9 రోజుల పాటు జరుపుకుంటారు. అయితే ఉగాది నుంచి స్టార్ట్ అయ్యే నవరాత్రుల సమయంలో ఏ దేవుడిని పూజిస్తారు? ఈ వసంత సమయంలో ఏ దేవుడిని పూజిస్తే ఫలితం ఉంటుంది? ఎందుకు తొమ్మిది రోజుల నవరాత్రులను జరుపుకుంటారు? పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
వసంత కాలంలో చైత్ర శుద్ధ పాడ్యమి నాడు కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. అయితే ఈ ఉగాది నాటి నుంచి చైత్ర శుద్ధ నవమి వరకు ఉన్న తొమ్మిది రోజుల పాటు నవరాత్రుల పూజలు నిర్వహిస్తారు. వసంత కాలంలో ఆకులు అన్ని కూడా పచ్చగా కనిపిస్తాయి. అయితే ఈ వసంత ఋతువులోనే దేవ దేవుడైన శ్రీ మహావిష్ణువు పరిపూర్ణ మానవునిగా భూమిపై అవతరించాడని.. దీన్నే శ్రీరామావతారం అని అంటారు. అప్పటి వరకు రాక్షసుల యుద్ధాలతో విసిగిపోయిన ప్రజలు శ్రీరాముడు పుట్టడంతో మంచి రోజులు వచ్చాయని భావిస్తారు. అందులో కొత్త ఏడాది అయిన ఉగాది పండుగ నుంచి శ్రీరామ నవమి వరకు తొమ్మిది రోజుల పాటు నవరాత్రులను జరుపుకుంటారు. వీటినే వసంత నవరాత్రులు అని అంటారు. నవ అంటే తొమ్మిది కాబట్టి మొత్తం 9 రోజుల పాటు నవరాత్రులను జరుపుకుంటారు. అయితే ఈ నవరాత్రులు వసంత కాలంలో రావడంతో వీటిని వసంత నవరాత్రులు అని అంటారు. అలాగే నవ అంటే నూతన అని కూడా అర్థం.
నవ రాత్రులను శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మ నివేదనం అనే వేదాలతో నవ రాత్రులు చేయాలి. దేవుని మార్గంలోకి వెళ్లడానికి ఇవి చాలా ముఖ్యమైనవి. వసంత నవరాత్రులను దక్షిణ భారతంలో కన్నా ఉత్తర భారత దేశంలో ఎక్కువగా జరుపుకుంటారు. వసంత నవరాత్రులు చేసేవారు గురువు సమక్షంలో దీక్ష స్వీకరించి వస్త్రాలను ధరిస్తారు. ప్రతి రోజు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఉపవాసం ఉంటారు. తొమ్మిది రోజుల పాటు ఇలా చేస్తారు. ఉదయం సాయంత్రం దేవునికి అర్చనలు, ధూపదీప నైవేద్యాలు చేయాలి. రోజంతా శ్రీరామ నామ స్మరణం, రాముని కీర్తనలు, భజనలు భక్తి శ్రద్ధలతో ఉండాలి. తొమ్మిదవ రోజు శ్రీరామనవమి రోజున శ్రీరాముని కళ్యాణం చేసి దీక్షను విరమించాలి. ఇలా చేస్తే విజయం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. హిందూ పురాణాల్లో శ్రీరాముడిని ఎంతో భక్తితో పూజిస్తారు. శ్రీరామ నవమి వేడుకలను అయితే బాగా నిర్వహిస్తారు.
Disclaimer: కేవలం అవగాహన కోసం మాత్రమే ఈ సమాచారం ఇవ్వడం జరిగింది. దీన్ని trendingtelugus.com నిర్ధారించదు. గూగుల్ ఆధారంగా తెలియజేయడం జరిగింది.