Vastu Tips: తలుపు వెనుక బట్టలు పెడుతున్నారా.. ఎంత అరిష్టమో మీకు తెలుసా?

Vastu Tips:
చాలా మంది ఇళ్లలో డోర్ బ్యాక్ సైడ్ హ్యాంగర్ ఉంటుంది. ఇలా డోర్ వెనుక ఉండటం వల్ల గది అంతా కూడా చెత్తగా ఉండదని ఇలా పెడుతుంటారు. అయితే డోర్ వెనుక దుస్తులు వేలాడదీయడం వల్ల ఇళ్లు చెత్తగా కనిపిస్తుందో లేదో తెలియదు. కానీ ఇంట్లో సమస్యలు ఎక్కువగా వస్తాయని పండితులు చెబుతున్నారు. ఎందుకంటే వాస్తు శాస్త్రం ప్రకారం తలుపులు వెనుక ఇలా దుస్తులు వేలాడదీయడం వల్ల ఇంట్లో మంచి జరగదు. ఎల్లప్పుడూ కూడా ఏదో సమస్య వస్తూనే ఉంటుంది. డోర్ వెనుక హ్యాంగర్ ఉండటం వల్ల ప్లేస్ కలిసి రావడంతో పాటు మురికి దుస్తులు అన్ని కూడా ఒక మూలకి ఉంటాయని భావిస్తారు. అయితే తలుపుకు మురికి దుస్తులు వేలాడదీయడం వల్ల ఇంట్లో వచ్చే సమస్యలు ఏంటి? పూర్తి వివరాలు కూడా ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ఇంట్లో తలుపులు వెనుక దుస్తులు పెట్టడం వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉండదు. మొత్తం కూడా నెగిటివ్‌గా మారిపోతుంది. ఏ పని ప్రారంభించినా కూడా ఆటంకమే ఏర్పడుతుంది. తలుపుకు ఉన్న దుస్తులు పాజిటివ్ ఎనర్జీని అడ్డుకుంటాయి. దీంతో ఇంట్లో సమస్యలు, సంతోషం లేకపోవడం, అశాంతి ఏర్పడటం, ఒత్తిడి, ఆర్థిక సమస్యలు ఇలా ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. దీనివల్ల ఇంట్లో మానసిక ప్రశాంతత ఉండదు. ప్రారంభించిన ప్రతీ పనిలో కూడా ఆటంకం ఏర్పడుతుంది. అలాగే ఆ మూలన దుమ్ము ఏర్పడుతుంది. కుటుంబంలో సమస్యలు ఏర్పడతాయి. మానసిక సమస్యలు వస్తాయి. ఏ పని అయినా ప్రారంభిస్తే చాలా చిందరవందరగా అనిపిస్తుంది.
ఇంట్లో ఎక్కడ వస్తువులు అక్కడ ఉంటేనే మంచిది. ఇళ్లు ఇలా శుభ్రంగా ఉంటేనే లక్ష్మీదేవి కూడా ఇంట్లో ఉంటుంది. లేకపోతే ఇంట్లో లక్ష్మీ దేవి ఒక్క నిమిషం కూడా ఉండదు. అందుకే మన పెద్దలు ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలని చెబుతుంటారు. ఈ రోజుల్లో చాలా మంది వ్యక్తిగత పనులు, బద్దకం వంటి వాటి వల్ల ఎక్కడ వస్తువులు అక్కడే వదిలేస్తున్నారు. ఏ పనిని కూడా సక్రమంగా చేయడం లేదు. ఇంటిని కనీసం కూడా శుభ్రంగా ఉంచుకోవడం లేదు. దీనివల్ల ఇంట్లో ఎన్నో సమస్యలు వస్తున్నాయి. గొడవలు అన్ని కూడా వాటి నుంచే వస్తున్నాయని పండితులు అంటున్నారు. కుటుంబంలో ఎలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే తప్పకుండా ఇంటిని, ఒంటిని శుభ్రంగా ఉంచుకోవాలని మన పండితులు చెబుతున్నారు. దీనివల్లే ఎలాంటి గొడవలు లేకుండా ఉంటారని పండితులు అంటున్నారు.