Vastu Tips: దిండు కింద వీటిని పెట్టుకుని నిద్రపోతున్నారా.. అయితే ఇది మీ కోసమే
Vastu Tips చాలా మందికి నిద్రపోయేటప్పుడు చదివే అలవాటు ఉంటుంది. దీంతో చదువుతూ నిద్రపోతారు. ఇక ఆ పుస్తకాన్ని అక్కడే పెట్టేస్తారు. అయితే ఇలా దిండు లేదా మంచం మీద పుస్తకాలు పెడితే మతిమరుపు వస్తుందని పండితులు అంటున్నారు.

Vastu Tips: దేవుడి మీద నమ్మకం ఉన్నవారు చాలా మంది ఇంట్లో వాస్తు నియమాలు పాటిస్తుంటారు. ఇంట్లో ఏ వస్తువు ఎక్కడ ఉంచాలి? ఎక్కడ ఉంచితే మంచిదనే విషయాలు తప్పకుండా పాటిస్తారు. ఇలా వాస్తు నియమాలు సరిగ్గా పాటించకపోతే మాత్రం తప్పకుండా ఇంట్లో కొన్ని సమస్యలు వస్తాయని పండితులు అంటున్నారు. తెలిసో తెలియక చేసిన కొన్ని తప్పుల వల్ల ఎక్కువ సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. ఇంట్లో సంతోషం ఉండదు. ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది. ముఖ్యంగా అనారోగ్య సమస్యలు, చిరాకు, ఇంట్లో బాధలు, ఎల్లప్పుడూ కూడా ఏదో ఒక సమస్యతో బాధపడటం వంటివి వస్తాయని నిపుణులు అంటున్నారు. అయితే కొందరు తెలిసో తెలియక నిద్రపోయేటప్పుడు బెడ్ పక్కన కొన్ని వస్తువులను పెట్టుకుని నిద్రపోతారు. వీటివల్ల ఇంట్లో సమస్యలు, గొడవలు, అనారోగ్య సమస్యలు వస్తాయి. కొన్ని వస్తువులను బెడ్ మీద పెట్టడం వల్ల ప్రతికూల ఎనర్జీ ఫామ్ అవుతుంది. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం ఎలాంటి వస్తువులను దిండు కింద పెట్టుకుని నిద్రపోకూడదో ఈ స్టోరీలో చూద్దాం.
వాచ్
కొందరు సమయం తెలియడానికి వాచ్ను దిండు కింద లేదా పక్కన పెట్టుకుని నిద్రపోతారు. ఇలా చేయడం వల్ల ఇబ్బందులు వస్తాయని పండితులు చెబుతున్నారు. నిద్రపోయేటప్పుడు వీటిని చుట్టు ఉంచుకుంటే వాటి వల్ల నిద్రకు కూడా ఆటంటం కలుగుతుంది. అలాగే వాటిలోని విద్యుదయస్కాంత తరంగాలు శరీరంపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తాయి. దీంతో నెగిటివ్ ఎనర్జీ ఫామ్ అవుతుంది. ఇంట్లో ఇక హ్యాపీనెస్ ఉండదని నిపుణులు అంటున్నారు.
పుస్తకాలు ఉంచకూడదు
చాలా మందికి నిద్రపోయేటప్పుడు చదివే అలవాటు ఉంటుంది. దీంతో చదువుతూ నిద్రపోతారు. ఇక ఆ పుస్తకాన్ని అక్కడే పెట్టేస్తారు. అయితే ఇలా దిండు లేదా మంచం మీద పుస్తకాలు పెడితే మతిమరుపు వస్తుందని పండితులు అంటున్నారు. చదువులో కాస్త వెనుకపడతారట. పుస్తకాలు, పెన్నులను మంచం మీద, నేల మీద ఉంచకూడదని, ఇలా నిద్రపోయే పక్కన కూడా ఉంచకూడదని పండితులు అంటున్నారు.
మందులు ఉంచవద్దు
కొందరికి అనారోగ్య సమస్యలు ఏవైనా ఉంటే మందులు వేసుకుంటారు. వీటిని బెడ్ దగ్గరే ఉంచుతారు. వీటిని మంచం మీద ఉంచడం వల్ల ఇంట్లో ప్రతికూల శక్తి వస్తుందట. అలాగే అనారోగ్య సమస్యలు తగ్గకుండా పెరుగుతాయని పండితులు అంటున్నారు. వీటిని మంచం నిద్రపోయే దానికి దూరంగా ఉంచాలి. అప్పుడు మీకు అనారోగ్య సమస్యలు కూడా తగ్గుతాయని పండితులు చెబుతున్నారు. వీటితో పాటు మానసిక ప్రశాంతత కూడా ఉండదు. కాస్త ఒత్తిడిగా ఉంటుంది. ఇంకా అనారోగ్య సమస్యలు కూడా ఎక్కువ అవుతాయి. ఎట్టిపరిస్థితుల్లో కూడా వీటిని మంచం పక్కన పెట్టుకోకూడదని పండితులు చెబుతున్నారు.
Disclaimer: కేవలం అవగాహన కోసం మాత్రమే ఈ సమాచారం ఇవ్వడం జరిగింది. దీన్ని trendingtelugus.com నిర్ధారించదు. గూగుల్ ఆధారంగా తెలియజేయడం జరిగింది.
-
Easter: ఈస్టర్లో కలర్ఫుల్ ఎగ్స్ ఎందుకో మీకు తెలుసా?
-
Vastu Tips: ఈ వస్తువులను ఫ్రిడ్జ్పై పెట్టారో.. మీకు సమస్యలు తప్పవు
-
Sankatahara Chaturthi: సంకటహర చతుర్థి నాడు.. ఇలా పూజిస్తే కోరికలు నెరవేరడం ఖాయం
-
Spiritual: ఈ తేదీల్లో పుట్టిన వారు బంగారం వేసుకుంటే.. అంతే సంగతి
-
Mobile Settings: ఈ సెట్టింగ్స్ మారిస్తే.. పోయిన ఫోన్ మళ్లీ దొరకాల్సిందే
-
Vastu Tips: కిచెన్ స్లాబ్పై చపాతీ చేస్తున్నారా.. ఇది మీ కోసమే