Vastu Tips: వారం రోజులు ఇలా చేస్తే చాలు.. మీ ఇళ్లంతా డబ్బే డబ్బు

Vastu Tips:
డబ్బు అనేది ప్రతీ ఒక్కరికి కావాల్సిందే. డబ్బులు లేకపోతే అసలు ఈ ప్రపంచంలో ఏ పని కూడా సరిగ్గా జరగదు. ఒక్క రూపాయి కోసం చాలా మంది ఎంతగానో కష్టపడుతుంటారు. కొందరు ఎంత కష్టపడినా కూడా డబ్బు నిలవదు. వాటర్ ఖర్చు అయినట్లు డబ్బు అవుతుంది. దీంతో ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతుంటారు. ఎన్ని సమస్యలు ఉన్నా కూడా ఆర్థిక సమస్యలు ఉంటే మాత్రం చాలా కష్టం. ఎందుకంటే అన్నింటికి డబ్బులు కావాలి. ఇవి లేకపోతే మాత్రమే ఏ పని కూడా సరిగ్గా జరగదు. అయితే కొందరు ఎంత కష్టపడి సేవ్ చేసినా కూడా డబ్బు నిలవదు. దీనికి ముఖ్య కారణం ఇంట్లో కొన్ని వాస్తు నియమాలు పాటించకపోవడమే. అయితే ఇంట్లో ఎలాంటి వాస్తు నియమాలు పాటించడం వల్ల ఇంట్లో డబ్బు ఉంటుందో ఈ స్టోరీలో చూద్దాం.
ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడు నిలవాలంటే మాత్రం తప్పకుండా వేకువ జామునే లేవాలి. ఇలా లేచి ఇంటిని శుభ్రం చేసి దీపం పెట్టాలి. ఇలా చేస్తేనే లక్ష్మీదేవి ఇంట్లో ఉంటుంది. లక్ష్మీదేవికి ఇళ్లు అన్ని కూడా శుభ్రంగా ఉంటేనే ఉంటుంది. అశుభ్రంగా ఉన్న ఇంట్లో ఉండదు. సూర్యోదయానికి ముందు లేచి, పూజలు అన్ని ఎవరు అయితే నిర్వహిస్తారో వారి ఇంట్లోనే లక్ష్మీదేవి ఉంటుందని పండితులు చెబుతున్నారు. అలాగే ఇంట్లో ఎలాంటి దుర్వాసన కూడా ఉండకూడదు. దీనికోసం ఇంట్లో దూపం వంటివి చల్లండి. ఆ సువాసనలకు లక్ష్మీదేవి ఇంట్లోనే ఉంటుంది. అలాగే కొందరు బట్టలను డైలీ వాష్ చేయరు. మురికి బట్టలను ఇంట్లోనే ఉంచుతారు. ఇలా ఎక్కువ రోజులు మురికి బట్టలను ఇంట్లో ఉంచడం వల్ల లక్ష్మీదేవి ఉండదు. ఎప్పటికప్పుడూ మురికి దుస్తులను శుభ్రం చేసుకోవాలని పండితులు చెబుతున్నారు. అప్పుడే లక్ష్మీదేవికి కోపం రాదు. వీటితో పాటు ఎక్కడ పడితే అక్కడ వస్తువులను పడేయకూడదు. వీటిని ఎప్పటికప్పుడు సర్దుకోవాలి. ఇలా నీట్‌గా ఉంటేనే లక్ష్మీదేవి ఇంట్లో ఉంటుంది. మీరు కూడా ఏ పని మొదలు పెట్టినా జరుగుతుంది.
మీరు ఇంటి నుంచి బయటకు ఎక్కడికైనా వెళ్లినప్పుడు తప్పకుండా ఇంటిని శుభ్రం చేసి వెళ్లండి. ముఖ్యంగా వంటగదిని అయితే తప్పకుండా క్లీన్ చేయండి. ఇవన్నీ నీట్‌గా ఉంటేనే లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది. మీరు సంపాదించిన డబ్బు కూడా ఆదా అవుతుంది. ఎలాంటి ఆర్థిక సమస్యలు ఉండవు. లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా ఇంట్లోనే ఉండాలంటే మాత్రం ఈ నియమాలు తప్పకుండా ఒక వారం పాటించాలి. మీరు ఎన్ని పనులు ఉన్నా కూడా ఈ నియమాలు పాటిస్తూ.. ఉంటే మీ ఇంట్లో డబ్బు ఎప్పటికీ ఉంటుంది.
-
Tips:పాత బంగారు నగలు కొత్తగా మెరవాలా? అయితే ఈ చిట్కాలు పాటించండి
-
Maha Shivaratri: శివరాత్రికి జాగరణ ఎలా చేస్తే.. పుణ్య ఫలం లభిస్తుందంటే?
-
Maha Shivaratri: మహా శివరాత్రి పండుగ ఎందుకు జరుపుకుంటారు? కారణమేంటో మీకు తెలుసా?
-
Maha Shivaratri: ఈ నియమాలు పాటిస్తూ ఉపవాసం ఆచరిస్తే.. పుణ్యమంతా మీదే
-
Maha sivaratri: మహా శివరాత్రి నాడు ఈ మిస్టేక్స్ చేశారో.. దరిద్రమంతా ఇక మీతోనే!