Ram Navami 2025: సీతారాముల నుంచి ఈ విషయాలు తెలుసుకుంటే.. మీ వైవాహిక జీవితం ఆనందం
Ram Navami 2025 భర్త వెనుక భార్య అడుగులు వేయాలని చెబుతుంటారు. ఒక భార్యకు భర్తే దేవుడు. అతనే ఆదర్శమూర్తి. రాముడు వనవాసానికి వెళ్తే.. కట్టుబట్టలతో చెప్పులు లేకుండా సీత రాముడు వెంట పయనమైంది.

Ram Navami 2025: పెళ్లయిన ప్రతీ జంటకి కూడా మన పెద్దలు సీతారాముల వలే జీవితాంతం సంతోషంగా ఉండాలని దీవిస్తారు. అసలు పెళ్లి పనులు ప్రారంభం అవుతున్నాయనంటే ఆ కార్డులపైన తప్పకుండా సీతారాముల కళ్యాణ శ్లోకం కూడా ఉంటుంది. ఎవరైనా భార్యాభర్తలు అన్యోన్యంగా ఉంటే మాత్రం సీతారాముల వలె ఎంత చక్కగా ఉన్నారో అని అంటారు. ఎందుకంటే సీతకు తోడుగా రాముడు, రాముడికి తోడుగా సీత ఎన్ని సమస్యలు వచ్చినా కూడా వదల్లేదు. రాముడి కోసం సీత కూడా వనవాసం చేసింది. అయితే నేటి ప్రపంచంలో అయితే భార్యాభర్తలు లేరు. భర్త లేదా భార్య చిన్న తప్పు చేసిన వదిలేయడం, ఇతరులతో కనెక్షన్లు పెట్టుకోవడం వంటివి చేస్తున్నారు. అయితే నేటి ప్రపంచంలో ఉన్న భార్యాభర్తలు ఎలాంటి విషయాలు సీతారాములను చూసి నేర్చుకోవాలో ఈ స్టోరీలో చూద్దాం.
భర్త వెనుక భార్య అడుగులు వేయాలని చెబుతుంటారు. ఒక భార్యకు భర్తే దేవుడు. అతనే ఆదర్శమూర్తి. రాముడు వనవాసానికి వెళ్తే.. కట్టుబట్టలతో చెప్పులు లేకుండా సీత రాముడు వెంట పయనమైంది. అందుకే భార్య అంటే సీతలా ఉండాలని చెబుతుంటారు. తన భర్త కోసం అడవిలో ఎన్నో ఇబ్బందులు పడుతూ.. జీవించింది. కానీ తన భర్తను వదిలి మధ్యలో వదిలేయలేదు. వనవాసానికి రావద్దని రాముడు చెప్పినా కూడా వినకుండా.. తన భర్త వెంటనే ఉండాలని వెళ్లింది. భర్త సుఖంలో ఉన్నప్పుడే కాదు కష్టాల్లో ఉన్నప్పుడు కూడా భార్య తోడుగా ఉండాలని తన భర్త వెంట నడిచింది. ఎన్ని కష్టాలు వచ్చినా కూడా తన భర్తే జీవితం అనుకుంది. తన భర్త పక్కన ఎక్కడ ఉన్నా కూడా సుఖమే అని అనుకుంది. వనవాసం చేయడంతో పాటు ఎన్నో ఉపవాసాలు, సమస్యలను సీతమ్మ ఫేస్ చేసింది. ఇప్పుడు కాలం అమ్మాయిలు తప్పకుండా సీతమ్మను చూసి నేర్చుకోవాలి. ఒక్కసారి పెళ్లయితే భర్తనే సర్వస్వంగా భావించి తనతోనే జీవితాంతం తోడు ఉండాలి. వనవాసం సమయంలో రావణుడు సీతను తీసుకెళ్లి ఎంత ఆశపెట్టినా కూడా మారలేదు. తాను ఎప్పటికీ రాముడే భార్యగా ఉంటానని తెలిపింది. కనీసం పర పురుషుడిని అసలు చూడలేదు. తన భర్త కోసం వేచి చూసింది. అందుకే ప్రతీ భార్య కూడా సీత అంత పతివ్రతగా ఉండాలని అంటుంటారు.
సీత తన భర్తకు ఎంత విలువ ఇచ్చిందో.. రాముడు కూడా తన భార్య సీతకు అంతే విలువ ఇచ్చాడు. తన తల్లికి ఎంత గౌరవం ఇచ్చాడో.. సీతకు కూడా అంతే ఇచ్చాడు. తనకి ఎలాంటి కష్టం రాకుండా చూశాడు. భార్యాభర్తలుగా ఇద్దరూ కూడా సమానమేనని సీతకు గౌరవం ఇచ్చాడు. ఆమెను దూషించడం, బాధపెట్టడం వంటివి చేయలేదు. రాముడు కూడా సీతలా తన కోసమే వేచి చూశాడు. అందుకే వివాహ బంధంలో సీతారాములుగా ఉండాలని ఆశీర్వదిస్తారు. నేటి సమాజంలో ప్రతీ దంపతులు ఇలా ఉంటే ఎలాంటి ఇబ్బందులు రావని, ఇలా ఉండాలని చెబుతుంటారు. సీతారాముల జంట నుంచి ఈ విషయాలు దంపతులు పాటిస్తే.. వారి వివాహ బంధం సంతోషంగా ఉంటుందని సూచిస్తున్నారు.
Disclaimer: కేవలం అవగాహన కోసం మాత్రమే ఈ సమాచారం ఇవ్వడం జరిగింది. దీన్ని trendingtelugus.com నిర్ధారించదు. గూగుల్ ఆధారంగా తెలియజేయడం జరిగింది.