Sri Sama Navami Pooja: నవమి రోజు ఈ పని చేస్తే చాలు.. మీకు పెళ్లి కావడం గ్యారెంటీ
Sri Sama Navami Pooja శ్రీరామ నవమి వేడుకలను ఉదయం పూట నిర్వహిస్తారు. నవమి రోజున శ్రీరాముల కళ్యాణం ఆచరిస్తారు. అయితే రాముని వివాహం జరిగిన తర్వాత సాయంత్రం ఆలయానికి వెళ్లి పూజలు చేయాలి.

Sri Sama Navami Pooja: చైత్రమాసంలో తొమ్మిదవ రోజు నవమి రోజున శ్రీరాముడు పుట్టాడని ఆ రోజున ప్రతీ ఏడాది శ్రీరామ నవమి ఉత్సవాలను జరుపుకుంటారు. అయితే ఈ ఏడాది ఏప్రిల్ 6వ తేదీన శ్రీరామ నవమిని జరుపుకుంటారు. చైత్ర శుద్ధ నవమి రోజున శ్రీరాముడి జననం, వివాహ మహోత్సవం, పట్టాభిషేకము జరిగాయని పురాణాలు చెబుతున్నాయి. అయితే రాముడి జననం నవమి రోజు కావడంతో ప్రతీ ఏడాది ఛైత్ర మాసంలో వచ్చే శుక్ల పక్ష నవమి తిథి నాడు శ్రీరామ నవమి పండుగను జరుపుకుంటారు. శ్రీరామ నవమి పూజను ఎంతో భక్తితో పూజిస్తే ఇంట్లో ఉన్న సమస్యలు అన్ని కూడా తొలగిపోతాయని అంటుంటారు. అయితే ప్రస్తుతం చాలా మంది ఎన్నో సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఆర్థిక సమస్యలు, పెళ్లి వంటి వాటితో బాధపడుతున్నారు. కొందరికి ఎన్ని సంబంధాలు చూసినా కూడా పెళ్లి కావడం లేదు. అయితే ఇలాంటి వారు శ్రీరామ నవమి రోజు ఈ ఒక్క పని చేస్తే చాలు. మీకు నెల రోజుల్లోనే పెళ్లి ఫిక్స్ అవుతుందని పండితులు చెబుతున్నారు. మరి నవమి రోజు ఏం చేస్తే పెళ్లి జరుగుతుందో ఈ స్టోరీలో చూద్దాం.
శ్రీరామ నవమి వేడుకలను ఉదయం పూట నిర్వహిస్తారు. నవమి రోజున శ్రీరాముల కళ్యాణం ఆచరిస్తారు. అయితే రాముని వివాహం జరిగిన తర్వాత సాయంత్రం ఆలయానికి వెళ్లి పూజలు చేయాలి. పసుపు, గంధం, కుంకుమతో పూజలు చేసి భక్తితో రాముడిని పూజించాలి. ముఖ్యంగా ఆలయంలో ప్రశాంతంగా కూర్చోని ఓం జై సీతారాం అని మంత్రాన్ని 108 సార్లు జపించాలి. ఇలా జపిస్తే తప్పకుండా పెళ్లి అవుతుందని పండితులు చెబుతున్నారు. కేవలం పెళ్లి మాత్రమే కాకుండా కోరిన కోరికలు అన్ని కూడా నెరవేరుతాయని పండితులు అంటున్నారు. ప్రస్తుతం రోజుల్లో చాలా మంది కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా దీర్ఘాకాలికంగా రుణ బాధలతో బాధపడుతున్నారు. ఇలాంటి వారు కూడా ఈ మంత్రాన్ని 108 సార్లు జపిస్తే అంతా కూడా మంచే జరుగుతుందని పండితులు అంటున్నారు. ఎలాంటి కోరికలు అయినా కూడా నెల రోజుల్లో తీరిపోతాయని చెబుతున్నారు. ఉద్యోగం లేకపోయినా, బాధలు, అప్పులు ఇలా అన్ని సమస్యలు కూడా తీరిపోతాయని పండితులు అంటున్నారు.
శ్రీ రామ నవమి రోజు కొన్ని పనులు చేస్తే మంచి జరుగుతుందని పండితులు చెబుతున్నారు. ఎలాంటి ఆర్థిక సమస్యలు లేకుండా ఉండాలంటే వస్త్ర దానం, అన్నదానం వంటివి చేయాలని పండితులు అంటున్నారు. వీటితో పాటు డబ్బులు కూడా దానం చేయాలని పండితులు చెబుతున్నారు. వీటిని దానం చేయడం వల్ల ఇంట్లో సమస్యలు అన్ని కూడా తొలగిపోతాయి. పేదవారికి అన్నం, వస్త్రాలు దానం చేస్తే మీ సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉంటారు. ఇంట్లో ఉన్న సమస్యలు అన్ని కూడా క్లియర్ అవుతాయని పండితులు అంటున్నారు. అలాగే రాముడికి పట్టు వస్త్రాలు ఇవ్వాలి. వాటి మీద శ్రీరాముని విగ్రహాలు పెట్టి పూజలు చేయాలి. రామ చరిత్ర మానస్ కూడా చదివి.. రాముడిని భక్తితో పూజిస్తే అంతా కూడా మంచే జరుగుతుందని పండితులు అంటున్నారు.
Disclaimer: కేవలం అవగాహన కోసం మాత్రమే ఈ సమాచారం ఇవ్వడం జరిగింది. దీన్ని trendingtelugus.com నిర్ధారించదు. గూగుల్ ఆధారంగా తెలియజేయడం జరిగింది.