Srikalahasti Temple: శ్రీకాళహస్తి దర్శనం తర్వాత వేరే ఆలయానికి వెళ్లకూడదా?
Srikalahasti Temple చిత్తూరులో ఉన్న శ్రీకాళహస్తి ఆలయాన్ని సందర్శించుకుని, అక్కడ పూజలు నిర్వహించిన తర్వాత ఏ ఆలయానికి కూడా వెళ్లకూడదు. సర్పదోషం ఉన్నవారు ఇక్కడ ఎక్కువగా పూజలు నిర్వహిస్తారు.

Srikalahasti Temple: శ్రీకాళహస్తి ఆలయానికి ఓ ప్రత్యేకత ఉంది. ఈ ఆలయంలో వాయు లింగం ఉండటంతో చాలా మంది ఇక్కడికి వెళ్తుంటారు. కేవలం శివుడిని ఆరాధించే వాళ్లు కాకుండా చాలా మంది కూడా ఈ ఆలయానికి వెళ్తుంటారు. అయితే చిత్తూరు జిల్లాలో ఉన్న ఈ ఆలయంలో వెలసిన లింగాన్ని వాయు లింగం అని అంటారు. తిరుపతి వెళ్లిన ప్రతీ ఒక్కరూ కూడా తప్పకుండా ఈ ఆలయానికి వెళ్తుంటారు. ఈ ఆలయానికి వెళ్లి పూజలు కూడా నిర్వహిస్తుంటారు. ఎక్కువగా సమస్యలతో బాధపడుతున్న వారు తప్పకుండా ఈ ఆలయానికి వెళ్లి పూజలు నిర్వహిస్తే అంతా కూడా మంచే జరుగుతుందని నమ్ముతారు. కొందరికి సర్పదోషం ఉంటుంది. అలాంటి వారు తప్పకుండా శ్రీకాళహస్తి వెళ్లి పూజలు నిర్వహిస్తారు. అయితే ఈ ఆలయంలో పూజలు నిర్వహించిన తర్వాత తిరిగి ఇంటికి మాత్రమే వెళ్లాలి. ఇంకా ఏ ఆలయానికి కూడా వెళ్లకూడదని పండితులు చెబుతున్నారు. ఎందుకు శ్రీకాళహస్తిలో పూజలు నిర్వహించిన తర్వాత ఏ ఆలయానికి కూడా వెళ్లకూడదు? దీని వెనుక ఉన్న కారణం ఏంటి? పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
చిత్తూరులో ఉన్న శ్రీకాళహస్తి ఆలయాన్ని సందర్శించుకుని, అక్కడ పూజలు నిర్వహించిన తర్వాత ఏ ఆలయానికి కూడా వెళ్లకూడదు. సర్పదోషం ఉన్నవారు ఇక్కడ ఎక్కువగా పూజలు నిర్వహిస్తారు. రాహువు, కేతువు పూజలు నిర్వహిస్తారు. ఈ పూజలు నిర్వహించడం వల్ల అన్ని సమస్యలు కూడా తీరిపోతాయి. పెళ్లి కాని వారికి సెట్ అవుతుంది. ఉద్యోగం రాని వారికి ఉద్యోగం వస్తుంది. ఇలా అన్ని విధాలుగా కూడా మంచే జరుగుతుంది. ఎలాంటి దీర్ఘకాలిక సమస్యలు ఉన్నా కూడా తీరిపోతాయి. అయితే శ్రీకాళహస్తిలో రాహువు, కేతువు పూజ చేయడానికి ఓ కారణం ఉంది. మీకు ఉన్న పాపాలు అన్ని కూడా తొలగిపోవాలనే ఉద్దేశంతో ఈ పూజలు చేస్తారు. మీరు అక్కడ పూజలు నిర్వహిస్తే పాపాలు అన్ని కూడా తొలగిపోతాయి. మళ్లీ మీరు ఇంటికి వెళ్తేనే ఆ పాపాలు తొలగిపోతాయి. మీరు ఇంటికి వెళ్లకుండా వేరే ఆలయానికి వెళ్లినా మీ పాపాలు తొలగిపోవు. మీరు మళ్లీ వేరే ఆలయానికి వెళ్తే.. మీ దోష నివారణ జరగదు. అందుకే శ్రీకాళహస్తిలో పూజలు నిర్వహించిన తర్వాత తిరిగి ఇంటికి మాత్రమే వెళ్లాలి. అంతే కానీ మళ్లీ వేరే ఆలయానికి అసలు వెళ్లకూడదు.
ఎక్కువగా రుణ బాధలు, పెళ్లి సమస్యలు, ఉద్యోగం ఇలా అన్ని విధాలుగా ఇబ్బందులు పడుతున్న వారు ఎక్కువగా ఈ ఆలయంలో పూజలు నిర్వహిస్తారు. రాహువు, కేతువు పూజలు నిర్వహించడం వల్ల అన్ని సమస్యలు కూడా తీరిపోతాయి. ముఖ్యంగా దీర్ఘకాలికంగా ఇబ్బంది పడుతున్న సమస్యలు అన్ని కూడా తీరిపోతాయి. ఎలాంటి సమస్యలు అయినా కూడా తీరిపోతాయి. ఈ ఆలయాన్ని గ్రహణం సమయంలో అసలు మూయరు. సాధారణంగా అన్ని ఆలయాలను కూడా గ్రహణం సమయంలో మూసివేస్తారు. కానీ ఈ ఆలయంలోని పరమ శివుడికి ఎలాంటి గ్రహణ ప్రభావం ఉండదు. అందుకే ఈ ఆలయాన్ని అసలు మూయరు. ఏడాది మొత్తం తెరిచే ఉంటుంది. ఈ ఆలయానికి భక్తులు ఎక్కువగా వెళ్తుంటారు. అక్కడ పూజలు నిర్వహించి వారి సమస్యలను క్లియర్ చేసుకుంటారు.
Disclaimer: కేవలం అవగాహన కోసం మాత్రమే ఈ సమాచారం ఇవ్వడం జరిగింది. దీన్ని trendingtelugus.com నిర్ధారించదు. గూగుల్ ఆధారంగా తెలియజేయడం జరిగింది.