Ugadi: ఉగాది రోజు ఈ ఆలయానికి ముస్లింలు.. ఎందుకో తెలుసా?
Ugadi కడపలోని శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామివారి ఆలయానికి ఉగాది రోజు ముస్లిం మహిళలు వెళ్తుంటారు. కేవలం ఆలయానికి వెళ్లడం మాత్రమే కాకుండా ప్రత్యేక పూజలు కూడా నిర్వహించారు. బీబీ నాంచారమ్మ తమ ఇంటి ఆడబిడ్డని వేంకటేశ్వర స్వామి తమ ఇంటి అల్లుడు అని ముస్లింలు ఈ ఆలయంలో పూజలు నిర్వహిస్తారు.

Ugadi: ఉగాది పండుగ రోజు ప్రతీ ఒక్కరూ కూడా గుడికి వెళ్తారు. అయితే హిందువులు మాత్రమే ఉగాది రోజు ఆలయానికి వెళ్తారు. కానీ కడపలోని ఓ ఆలయానికి మాత్రం ముస్లింలు వెళ్తారు. కడపలోని శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామివారి ఆలయానికి ఉగాది రోజు ముస్లింలు వెళ్తారు. అసలు ఈ ఆలయానికి ముస్లిం మహిళలు ఎందుకు వెళ్తారు? దీనికి గల కారణం ఏంటి? పూర్తి వివరాలు తెలుసుకుందాం.
కడపలోని శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామివారి ఆలయానికి ఉగాది రోజు ముస్లిం మహిళలు వెళ్తుంటారు. కేవలం ఆలయానికి వెళ్లడం మాత్రమే కాకుండా ప్రత్యేక పూజలు కూడా నిర్వహించారు. బీబీ నాంచారమ్మ తమ ఇంటి ఆడబిడ్డని వేంకటేశ్వర స్వామి తమ ఇంటి అల్లుడు అని ముస్లింలు ఈ ఆలయంలో పూజలు నిర్వహిస్తారు. ఈ ఆలయానికి ఎప్పటి నుంచో ముస్లిం మహిళలు పూజలు నిర్వహిస్తున్నారు. చాలా మంది ముస్లిం మహిళలు తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులు ఫస్ట్ ఇక్కడ పూజలు చేసి ఆ తర్వాత వెళ్తారు. ఈ ఆలయానికి ముస్లిం భక్తులు వెళ్లడం అనేది ఎప్పటి నుంచో ఆనవాయితీగా వస్తుంది. ప్రతీ ఉగాదికి ఈ ఆలయానికి ముస్లింలు వెళ్లి వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటారు. ఇక్కడ ముస్లింలు తొలి పూజలు నిర్వహిస్తారు. ఆడబిడ్డగా భావించి స్వామివారికి సారె ఇచ్చి ఉగాది పండగకి వారి ఇంటికి తీసుకెళ్తారు. ఈ ఆలయంలో గర్భగుడి వెనుకవైపు ఇక్కడ క్షేత్రపాలకుడైన ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది. అలాగే ఆలయ మండపంలో రాతి బల్లులు ఉంటాయి. వీటిని బల్లులు తాకుతాయి. పాప నివారణ కోసం వీటిని భక్తులు తాకుతారు.
శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో విష్వక్సేన మందిరం, నాగుల విగ్రహాలు, ఆండాళ్ మందిరం, శమీ వృక్షం, ఆళ్వార్ల సన్నిధి, కళ్యాణ మంటపం, ఆలయం వెలుపల పుష్కరిణి, అద్దాల మందిరం కూడా ఉంటాయి. ఇవి చూడటానికి ఎంతో అందంగా ఉంటాయి. అయితే ఇక్కడ వినాయకుని విగ్రహానికి నిలువు నామాలు కూడా ఉంటాయి. అయితే ఈ ఆలయంలో కృపాచార్యులు శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ప్రతిష్టించినట్లు చెప్పుకుంటారు. అయితే ఇక్కడ ఉండే వెంకటేశ్వర స్వామిని వారిని కడప రాముడని, వెంకటాద్రి కడప రాముడని కూడా అంటారు. ఈ ఆలయానికి ఎంతో ప్రత్యేకత ఉంది. ఎన్నో ఏళ్ల చరిత్ర కూడా ఉందని పురాణాలు చెబుతున్నాయి.
Disclaimer: కేవలం అవగాహన కోసం మాత్రమే ఈ సమాచారం ఇవ్వడం జరిగింది. దీన్ని trendingtelugus.com నిర్ధారించదు. గూగుల్ ఆధారంగా తెలియజేయడం జరిగింది.