Maha Shivaratri: శివరాత్రికి జాగరణ ఎలా చేస్తే.. పుణ్య ఫలం లభిస్తుందంటే?

Maha Shivaratri:
మహా శివరాత్రి పండుగ అంటే ఉపవాసం, జాగరణ తప్పకుండా చేస్తారు. శివుడిని భక్తితో పూజించడంతో పాటు తప్పకుండా ఈ రెండింటిని పాటిస్తారు. అయితే మహా శివరాత్రి నాడు ఎలాంటి చెడు ఆలోచనలు పెట్టుకోకుండా భక్తితో శివుడిని పూజించాలి. అప్పుడే కోరిన కోరికలు అన్ని కూడా నెరవేరుతాయని పండితులు చెబుతున్నారు. ఈ మహా శివరాత్రిని ఎంతో పవిత్రంగా భావిస్తారు. చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకు అందరూ కూడా మహా శివరాత్రి పండుగను జరుపుకుంటారు. చిన్న పిల్లలు కూడా భక్తితో శివుడిని పూజిస్తారు. వేకువ జామున లేచి.. శివుడిని పూజిస్తారు. ఇంటిని శుభ్రం చేసుకుని కొత్త దుస్తులు ధరించి శివుడిని పూజించాలి. కొత్త దుస్తులు ధరించి, పండ్లు, పువ్వులు, అభిషేకం, నైవేద్యం పెట్టాలి. శివుడికి అభిషేకం చాలా ముఖ్యమైనది. పంచామృతాలతో అభిషేకం చేసిన తర్వాతే పూజ చేయాలి. పాలు, పెరుగు, పంచదార, కొబ్బరి నీరు, మంచి నీటితో అభిషేకం చేస్తారు. శివుడికి అభిషేకం అంటే చాలా ఇష్టం. వీటితో ఇంట్లో లేదా శివాలయంలో పూజ చేయాలి. శివరాత్రి పూజను ఆచరించిన వారు ఉపవాసం, జాగరణ కూడా తప్పకుండా చేస్తారు. అయితే జాగరణ చేసేటప్పుడు కొందరు తెలియక కొన్ని మిస్టేక్స్ చేస్తుంటారు. జాగరణ అంటే నిద్రపోకుండా ఉండటమని, ఏదో టైమ్ పాస్ చేస్తుంటారు. ఇలా జాగరణ చేయవచ్చా? జాగరణ ఎలా చేస్తే ఫుణ్య ఫలం దక్కుతుందో ఈ స్టోరీలో చూద్దాం.
జాగరణ చేసే వారు ఎలాంటి చెడు ఆలోచనలు రాకుండా చూసుకోవాలి. రాత్రంతా సినిమాలు చూడటం, బయట తిరగడం ఇలా టైమ్ పాస్ చేయకూడదని పండితులు చెబుతున్నారు. శివుడిని ధ్యానం చేస్తూ.. రాత్రంతా జాగరణ చేయాలి. ఇలా చేస్తేనే పుణ్యం దక్కుతుంది. ఉపవాసం, జాగరణ ఇలా నియమ ప్రకారం చేయాలి. అప్పుడు మీకు ఆ శివుడు ఆశీస్సులు దక్కుతాయని పండితులు చెబుతున్నారు. జాగరణ అనేది మహా శివరాత్రి తర్వాత రోజు వరకు ఉండాలి. ఉదయం వరకు జాగరణ చేసి, స్నానం చేసి శివుడిని పూజించాలి. ఆ తర్వాతే ఉపవాసం, జాగరణ వదలాలి. అప్పుడే మీరు కోరిన కోరికలు అన్ని కూడా నెరవేరుతాయని నిపుణులు చెబుతున్నారు. శివరాత్రి రోజు అన్ని జ్ఞానేంద్రియాలను మీ కంట్రోల్‌లో పెట్టుకోవాలి. ఎలాంటి చెడు ఆలోచనలు రాకుండా చూసుకోవాలి. అలాగే ఎల్లప్పుడూ కూడా శివుని నామ స్మరణం చేస్తుండాలి. ఇలా చేస్తేనే మీ జాగరణ ప్రతిఫలం దక్కుతుంది. అంతే కానీ సినిమాలు చూడటం, ఆటలు ఆడటం ఇలా టైమ్ పాస్ చేయకూడదని పండితులు చెబుతున్నారు.
-
Ramadan: పవిత్రమైన రంజాన్ ఉపవాసం.. ఈ సమయంలో పాటించాల్సిన నియమాలివే
-
Ramadan: రంజాన్ ఉపవాసం ఆచరిస్తున్నారా.. అయితే బోలెడన్నీ ఆరోగ్య ప్రయోజనాలు మీకే
-
Ramadan: రంజాన్ మాసంలో రోజంతా యాక్టివ్‌గా ఉండాలంటే.. సహూర్‌లో తీసుకోవాల్సినవి ఇవే
-
Ramadan: వచ్చేస్తున్న రంజాన్.. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉపవాసం ఆచరించాలంటే?
-
Vastu Tips: వారం రోజులు ఇలా చేస్తే చాలు.. మీ ఇళ్లంతా డబ్బే డబ్బు
-
Maha Shivaratri: మహా శివరాత్రి పండుగ ఎందుకు జరుపుకుంటారు? కారణమేంటో మీకు తెలుసా?