Kadapa: ఈ శివాలయంలో రాయి పడితే.. మీ కోరికలు నెరవేరడం ఖాయం
మన దేశంలో ఎన్నో శివాలయాలు ఉన్నాయి. కార్తీకం, మహా శివరాత్రి సమయాల్లో శివుని ఆలయాలు భక్తులతో నిండిపోతాయి.

Kadapa:
మన దేశంలో ఎన్నో శివాలయాలు ఉన్నాయి. కార్తీకం, మహా శివరాత్రి సమయాల్లో శివుని ఆలయాలు భక్తులతో నిండిపోతాయి. అయితే మన దేశంలో ఉండే కొన్ని ఆలయాలు చాలా ప్రసిద్ధమైనవి. వీటిలో మనం నమ్మలేని కొన్ని నిజాలు కూడా దాగి ఉన్నాయి. అలాంటి ఆలయాల్లో పుష్పగిరిలో ఉన్న ఆలయం ఒకటి. దక్షిణకాశిగా పిలిచే ఆ ఆలయం ఏపీలోని కడప జిల్లాలో ఉంది. ఈ ఆలయానికి భక్తులు కూడా భారీ సంఖ్యలో వెళ్తుంటారు. ఈ ఆలయంలో శ్రీ మహావిష్ణువు చెన్నకేశ్వరస్వామిగా, శివుడు చంద్రమౌళీశ్వరుడిగా పూజలు అందుకుంటున్నారు. అయితే ఈ ఆలయాన్ని ఏడో శతాబ్దంలో నిర్మించారట. అప్పట్లో పల్లవులు, చోళులు కూడా సందర్శించారట. అయితే ఈ పుష్పగిరి ఆలయంలో ఓ ప్రత్యేకత ఉంది. ఈ ఆలయం వెనుక కూడా ఓ స్టోరీలో ఉంది. పూర్తి వివరాలు ఏంటో తెలియాలంటే స్టోరీ మొత్తం చదివేయండి.
పూర్వం కశ్యప మహర్షి భార్యలు వినత,కద్రువ ఇద్దరూ పందెం వేసుకున్నారట. ఎవరైతే ఓడిపోతారో వారు గెలిచిన వారికి దాస్యం చేయాలి. ఇలా వినత ఓడి కద్రువకు దాసిగా పని చేస్తుంది. అయితే వినతకు గరత్మంతుడు జన్మించాడు. ఇతని నుంచి ఆమెకు శాపవిముక్తి కలగింది. దీనికోసం కద్రువను కోరగా.. ఆమె అమృతం కావాలని కోరింది. దీంతో దేవేంద్రుడి దగ్గర ఉన్న అమృతాన్ని తీసుకొస్తుండగా.. ఈ క్రమంలో కడప పినాకిని నదిలో రెండు చుక్కలు పడ్డాయని చెప్పుకుంటారు. అయితే ఈ నదిలో స్నానం చేస్తే అందరూ యువకులుగా మారిపోయేవారు. దీన్ని చూసిన దేవతలు షాక్ అయ్యి.. కైలాశ పర్వతంలోని చిన్న ముక్కను తీసుకొచ్చి ఆ నదిలో వేశారు. అయితే అమృతం వల్ల ఆ రాయి మునగకుండా తేలింది. ఈ నీటిలో రాయి వేసినా కూడా పువ్వులా తేలుతుంది. అందులో ఈ ప్రాంతాన్ని పుష్పగిరి అని పిలుస్తారు. ఈ ఆలయానికి ఎక్కువగా భక్తులు వెళ్తుంటారు. అయితే ఈ పుష్పగిరిలోని చెన్నకేశ్వర స్వామి ఆలయంలో ఇంకో ప్రత్యేకత ఉంది. ఆ ఆలయంలో మూలన ఓ ద్వారం ఉంటుంది. దీని కింద ఇంకో కన్నం ఉంటుంది. పైన ఉన్న కన్నం నుంచి వేస్తే అది సరిగ్గా కింద కన్నంలో పడాలి. ఇలా జరిగితే కోరిన కోరికలు అన్ని కూడా నెరవేరుతాయని నమ్ముతుంటారు. ఎలాంటి కోరికలు అయినా కూడా తప్పకుండా నెరవేరుతాయని పురాణాలు చెబుతున్నాయి. కోరికను కోరి.. కన్నం నుంచి రాయి వేస్తే తప్పకుండా నెరవేరుతాయి.