Sri Rama Navami: నవమి రోజు వీటిని నైవేద్యంగా పెడితే.. అదృష్టమే
Sri Rama Navami శ్రీరామ నవమి రోజు ఆలస్యంగా కాకుండా బ్రహ్మ ముహుర్తంలోనే నిద్రలేవాలి. తలస్నానం ఆచరించి కొత్త దుస్తులు ధరించి రాముడిని పూజించాలి. అయితే ఛైత్ర మాసంలో వచ్చే శుక్ల పక్ష నవమి తిథి నాడు రాముడిని భక్తితో పూజించాలి.

Sri Rama Navami: శ్రీరాముడు ఛైత్ర మాసంలోని శుక్లపక్షం నవమి రోజున పుట్టాడని పురాణాలు చెబుతున్నాయి. అయితే ఈ ఏడాది ఏప్రిల్ 6వ తేదీన శ్రీరామ నవమిని జరుపుకుంటారు. చైత్ర శుద్ధ నవమి రోజున శ్రీరాముడి జననం, వివాహ మహోత్సవం, పట్టాభిషేకము జరిగాయని పురాణాలు చెబుతున్నాయి. శ్రీరామ నవమి రోజు రాముడు పూజను ఎంతో భక్తితో పూజిస్తే ఇంట్లో ఉన్న సమస్యలు అన్ని కూడా తొలగిపోతాయని అంటుంటారు. అయితే రాముడికి ఇష్టమైన కొన్నింటిని నైవేద్యంగా చేసి పెడితే తప్పకుండా కోరికలు నెరవేరుతాయని పండితులు చెబుతున్నారు. అయితే రామ నవమి రోజున ఎలాంటి నైవేద్యాలు పెడితే ఆశీస్సులు అందుతాయో ఈ స్టోరీలో చూద్దాం.
శ్రీరామ నవమి రోజు ఆలస్యంగా కాకుండా బ్రహ్మ ముహుర్తంలోనే నిద్రలేవాలి. తలస్నానం ఆచరించి కొత్త దుస్తులు ధరించి రాముడిని పూజించాలి. అయితే ఛైత్ర మాసంలో వచ్చే శుక్ల పక్ష నవమి తిథి నాడు రాముడిని భక్తితో పూజించాలి. అయితే శ్రీ రామ నవమి నాడు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1.35 నిమిషాల లోగా రాముడిని పూజించాలని పండితులు అంటున్నారు. అయితే రాముడికి పట్టు వస్త్రాలు సమర్పించి, పువ్వులు, పండ్లు, కొన్ని నైవేద్యాలు పెడితే కోరిన కోరికలు అన్ని కూడా నెరవేరుతాయని పండితులు చెబుతున్నారు. అయితే నవమి రోజు రాముడికి చలిమిడి, వడపప్పు పానకం, చక్కెర పొంగలి, పాయసం వంటివి నైవేద్యంగా పెట్టాలి. వీటిని పెడితే శరీరంలోని వేడి తగ్గుతుంది. అలాగే బాడీకి చలవ చేస్తుంది. వీటితో పాటు పెసరపప్పు, కొబ్బరి ముక్కలు, సపోటా పండ్లు వంటివి పెడితే అంతా కూడా మంచే జరుగుతుందని, కోరిన కోరికలు అన్ని కూడా నెరవేరుతాయని పండితులు అంటున్నారు.
శ్రీరామ నవమి రోజు వీటితో పాటు కొన్ని పనులు చేస్తే మంచి జరుగుతుందని పండితులు చెబుతున్నారు. ఎలాంటి ఆర్థిక సమస్యలు లేకుండా ఉండాలంటే వస్త్ర దానం, అన్నదానం వంటివి చేయాలని పండితులు అంటున్నారు. వీటితో పాటు డబ్బులు కూడా దానం చేయాలని పండితులు చెబుతున్నారు. వీటిని దానం చేయడం వల్ల ఇంట్లో సమస్యలు అన్ని కూడా తొలగిపోతాయి. పేదవారికి అన్నం, వస్త్రాలు దానం చేస్తే మీ సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉంటారు. ఇంట్లో ఉన్న సమస్యలు అన్ని కూడా క్లియర్ అవుతాయని పండితులు అంటున్నారు. అలాగే రాముడికి పట్టు వస్త్రాలు ఇవ్వాలి. వాటి మీద శ్రీరాముని విగ్రహాలు పెట్టి పూజలు చేయాలి. రామ చరిత్ర మానస్ కూడా చదివి.. రాముడిని భక్తితో పూజిస్తే అంతా కూడా మంచే జరుగుతుందని పండితులు అంటున్నారు. కాబట్టి మీరు తప్పకుండా ఈ నియమాలు పాటించండి.
Disclaimer: కేవలం అవగాహన కోసం మాత్రమే ఈ సమాచారం ఇవ్వడం జరిగింది. దీన్ని trendingtelugus.com నిర్ధారించదు. గూగుల్ ఆధారంగా తెలియజేయడం జరిగింది.
-
Sri Rama Navami 2025: నవమి నైవేద్యాలతో ఆరోగ్యం మీ సొంతం
-
Sri Sama Navami Pooja: నవమి రోజు ఈ పని చేస్తే చాలు.. మీకు పెళ్లి కావడం గ్యారెంటీ
-
Sri rama navami: శ్రీరామ నవమి రోజు ఎలా పూజిస్తే.. సమస్యలు తొలగిపోతాయంటే?
-
Sri rama navami: శ్రీరామ నవమి రోజు ఈ పనులు చేస్తే అదృష్టమే
-
IPl 2025:క్రికెట్ ఫ్యాన్స్ షాకింగ్ న్యూస్.. ఆ మ్యాచ్ రీ షెడ్యూల్?