Pilli Jathakam: జాతకాలు కలవకుండా పెళ్లి చేసుకోవచ్చా?
Pilli Jathakam పుట్టిన సమయం బట్టి జాతకాన్ని చూస్తారు. అయితే ఇప్పుడు రోజుల్లో పుట్టిన పిల్లల సమయం అన్ని కూడా రాస్తారు. కానీ పూర్వం పుట్టిన సమయం అన్ని కూడా గుర్తు పెట్టుకోవాలనే ఆలోచన పెద్దగా ఉండేది కాదు.

Pilli Jathakam: పెళ్లి అనేది ఒక పవిత్ర బంధం. జీవితాంతం సంతోషంగా కలసి ఉండాలని జాతకాల అన్ని చూసి సరైన సమయంలో పెళ్లి చేస్తారు. పుట్టిన సమయం బట్టి వరుడు, వధువు జాతకాలు చూసి వివాహం చేసుకుంటారు. అయితే వీటిని నమ్మని వారు అసలు జాతకాలు చూడకుండా వివాహం చేసుకుంటారు. ఈ జాతకాలు పడకపోతే పెళ్లి చేసుకుంటే.. అసలు సంతోషంగా ఉండరని, ఏదో విధంగా గొడవలు వస్తాయని అంటుంటారు. అసలు జాతకాలను నమ్మవచ్చా? జాతకాలు పడకపోతే పెళ్లి చేసుకోకూడదా? చేసుకుంటే ఏమవుతుంది? పూర్తి వివరాలు మీకు తెలియాలంటే స్టోరీపై ఓ లుక్కేయండి.
పుట్టిన సమయం బట్టి జాతకాన్ని చూస్తారు. అయితే ఇప్పుడు రోజుల్లో పుట్టిన పిల్లల సమయం అన్ని కూడా రాస్తారు. కానీ పూర్వం పుట్టిన సమయం అన్ని కూడా గుర్తు పెట్టుకోవాలనే ఆలోచన పెద్దగా ఉండేది కాదు. నిజానికి అప్పట్లో జాతకాలు కూడా ఉండేవి కాదు. అయితే జాతకాలు అనేవి కేవలం అపోహ మాత్రమేనని కొందరు అంటున్నారు. మరికొందరు జాతకాలు చూడకుండా పెళ్లి చేసుకుంటే గొడవలు వస్తాయని అసలు హ్యాపీగా ఉండరని అంటున్నారు. అయితే ప్రేమించి పెళ్లి చేసుకున్న వారు అసలు జాతకాలే చూడరు. వీరిలో కొందరు సంతోషంగా ఉంటే.. మరికొందరు గొడవలు పడుతున్నారు. అయితే పెళ్లికి అనేది జాతకం అంత ముఖ్యం కాదు. జాతకాలు కలవకపోయినా పెళ్లి చేసుకోవాలంటే మాత్రం పెళ్లి చేసుకున్న వ్యక్తిని అర్థం చేసుకోవాలి. భాగస్వామి ఆలోచనా విధానం ఎలా ఉంటుంది? పెళ్లయిన తర్వాత కుటుంబాన్ని ఎలా చూసుకుంటారు? ఎంత వరకు అర్థం చేసుకుంటారు? అన్ని విషయాలు తెలుసుకున్న తర్వాత మాత్రమే పెళ్లి చేసుకోవాలి. పెళ్లికి జాతకాలు కలిసినా కలవకపోయినా కూడా.. ఇద్దరు మనస్సులు అయితే తప్పకుండా కలవాలని నిపుణులు అంటున్నారు.
ఒక్కోక్కరి మనస్తత్వం ఒక్కోలా ఉంటుంది. ఒక మనిషిని అర్థం చేసుకుని సంతోషంగా ఉండే స్వభావం అయితే ఎలాంటి గొడవలు ఉండవు. అదే ప్రతీ విషయానికి కోపం, చిరాకు, అనుమానం వంటివి ఉన్నట్లయితే అలాంటి వారితో కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి భాగస్వామి ఎవరికి ఉన్నా కూడా గొడవలు వస్తాయి. ఎన్ని గొడవలు వచ్చినా కూడా మళ్లీ కలిసిపోయే స్వభావం ఉండాలి. అప్పుడే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అయితే ప్రస్తుత కాలంలో అయితే ఎక్కువగా పెళ్లి చేసుకుని విడిపోతున్నారు. వీటివల్ల తల్లిదండ్రులు జాతకాలు చూసి వివాహం చేస్తున్నారు. ఎందుకంటే పెళ్లయిన తర్వాత ఎలాంటి గొడవలు లేకుండా సంతోషంగా ఉండాలని తల్లిదండ్రులు జాతకాలు చూస్తున్నారు. ప్రస్తుతం రోజుల్లో పెళ్లి చేసుకున్న కొన్ని నెలలకే విడిపోతున్నారు. ప్రతీ చిన్న విషయానికి గొడవలు పడుతున్నారు. దీనికి తోడు కాలం మారడంతో ఎంజాయ్‌లకు బాగా అలవాటు పడి భాగస్వాములను దూరం చేసుకుంటున్నారు.