PM Kisan: అకౌంట్‌లోకి పీఎం కిసాన్ డబ్బులు ఆరోజే.. ఇలా చేస్తేనే డబ్బులు?

PM Kisan:
ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన (PM Kisan) పథకం కింద కేంద్ర ప్రభుత్వం రైతులకు ఏడాదికి రూ.6 వేలు ఇస్తుంది. ఈ డబ్బులను ఒకేసారి కాకుండా మూడు విడతల్లో రైతుల ఖాతాల్లోకి జమ చేస్తారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పథకాన్ని 2019 ఫిబ్రవరి 24 తేదీన ప్రారంభించారు. అయితే ప్రతీ ఏడాది పీఎం కిసాన్ డబ్బులు రైతుల ఖాతాల్లో జమ అవుతాయి. ఇదిలా ఉండగా తాజాగా 19వ విడత పీఎం కిసాన్ నిధుల జమపై ఓ కీలక అప్డేట్‌ను ప్రభుత్వం ఇచ్చింది. ఈ నెల 24వ తేదీన రైతుల ఖాతాల్లోకి రూ.2 వేలు జమ కానున్నట్లు ప్రభుత్వం తెలిపింది. పంట పెట్టుబడి సాయం కింద రైతులకు ప్రభుత్వం ఈ డబ్బులు అందిస్తుంది. ఇప్పటి వరకు మొత్తం 18 విడతల్లో పీఎం కిసాన్ డబ్బులు రైతుల ఖాతాల్లోకి జమ అయ్యయి. ఇప్పుడు విడుదల చేసేది 19వ విడత డబ్బులు. అయితే బీహార్‌లోని భాగల్‌పూర్‌లో జరిగే కార్యక్రమంలో ప్రధాని మోదీ ఈ పీఎం కిసాన్ డబ్బులు విడుదల చేయనున్నారు. ప్రతీ రైతు అకౌంట్‌లోకి రూ.2 వేలు చొప్పున డబ్బులు జమ అవుతాయి.
ఇదిలా ఉండగా పీఎం కిసాన్ డబ్బులు పడాలంటే ఈ-కేవైసీ తప్పనిసరిగా ఉండాలి. అప్పుడే అకౌంట్‌లోకి డబ్బులు జమ అవుతాయి. అయితే దీనికి ఈ-కేవైసీని రైతులు డైరెక్ట్‌గా పీఎం కిసాన్ వెబ్‌సైట్‌లో చేసుకోవచ్చు. అయితే ఈ వెబ్‌సైట్‌లో ఇప్పటికే పీఎం కిసాన్ బెనిఫిషియరీ జాబితాను ఉంచారు. అర్హులైన రైతుల పేర్లు ఇందులో ఉంచారు. వీరికి మాత్రమే డబ్బులు వస్తాయి. అయితే మీరు ఇప్పటికీ చేయకపోతే.. వెంటనే దరఖాస్తు చేసుకుని ఈ-కేవైసీ కంప్లీట్ చేయండి. పీఎం కిసాన్ యోజనకి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలంటే అధికారిక వెబ్‌సైట్ pmkisan.gov.in లోకి వెళ్లాలి. ఇందులోకి వెళ్లిన తర్వాత Former Corner పై క్లిక్ చేసి చేయండి. ఆ తర్వాత రైతు ఆధార్ నంబర్ నమోదు చేసి పీఎం కిసాన్ దరఖాస్తు ఫారమ్‌ను కంప్లీట్ చేయాలి. ఆ తర్వాత https://pmkisan.gov.in/ లోకి వెళ్లి ఈ-కేవైసీ చేసుకోవాలి. ఓటీపీ ఆధారిత ఈ-కేవైసీపై క్లిక్ చేసి 12 అంకెల ఆధార్ నంబర్‌ను నమోదు చేయాలి. ఆ తర్వాత మీ మొబైల్ నంబర్‌కి ఓటీపీ వస్తుంది. సబ్మిట్ చేస్తే ఈ-కేవైసీ పూర్తి అయినట్లే. ఈ-కేవైసీ పూర్తి కాకపోతే అకౌంట్‌లోకి డబ్బులు జమ కావు. కాబట్టి ఒకసారి మీరు అధికారిక వెబ్‌సైట్ లోకి వెళ్లి చెక్ చేసుకోండి.