Car Plate: కారు ప్లేట్‌పై ఈ నంబర్ ఉంటే.. మీకు అదృష్టమే అదృష్టం

Car Plate:
కారు అనేది చాలా మంది మిడిల్ క్లాస్ వారి కల. కష్టపడిన డబ్బులను ఈ కారు కోసం దాచి పెడుతుంటారు. తక్కువ బడ్జెట్‌లో అయినా కూడా మంచి కారు కొనుక్కోవాలని డబ్బులు సేవ్ చేస్తుంటారు. కారు కొని అంతా చక్కగా ఉందని అనుకునే లోపే కొన్ని సమస్యలు వస్తాయి. కొందరికి వాస్తు నియమాలు సరిగ్గా లేకపోవడం వల్ల కారు కొన్ని కొన్ని రోజులకే పాడవుతుంది. ఏదో ఒక సమస్య కారులో వస్తూనే ఉంటుంది. ముఖ్యంగా కారు దెబ్బ తినే ప్రమాదం కూడా ఉంటుంది. అయితే కారు అనేది కొన్న తర్వాత కూడా ఎలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే నంబర్ ప్లేట్ విషయంలో కొన్ని రూల్స్ పాటించాలి. అప్పుడే కొత్త కారు మంచిగా ఉంటుంది. ఆ కారు వల్ల అదృష్టం కూడా కలసి వస్తుందని పండితులు అంటున్నారు. అయితే కారుకి కేవలం ఒక నంబర్ మాత్రమే ఉండదు. ఉదాహరణకు మీ కారు నంబర్ 862 అనుకోండి. ఈ మూడింటిని కలపగా ఏ నంబర్ వస్తుందో అది కారు నంబర్. ఇలా కలపగా మీకు ఏ నంబర్ వస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఈ స్టోరీలో చూద్దాం.
సంఖ్య 1
కారు ప్లేటు నంబర్‌లోని అన్ని కలిపితే 1 వస్తే దాన్ని అందరూ కూడా వాడకూడదు. ఈ నంబర్ ఎక్కువగా వస్తువులు ఎగుమతి చేయడం, అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు బాగా కలసి వస్తుంది.
సంఖ్య 2
ఈ నంబర్ చాలా మంచిది. దీనివల్ల ఎవరికి కూడా ఎలాంటి సమస్యలు రావు. ఈ నంబర్ కారు నడిపే వ్యక్తులకు సమాజంలో ఎక్కువ పేరు ప్రతిష్టలు ఉంటాయి.
నంబర్ 3
ఈ నంబర్ అనేది ఆర్థిక సమస్యల నుంచి బయట పడేలా చేస్తుంది. ఆర్థిక సలహాదారులు, ఆర్థికవేత్తలు, స్టాక్ బ్రోకర్లు ఎక్కువగా ఈ నంబర్‌ను వాడుతుంటారు. ఇది వారికి అదృష్టాన్ని తీసుకొస్తుంది.
నంబర్ 4
ఆ వాహనం అనేది ఎక్కువగా జ్ఞానాన్ని ఇస్తుంది. ఈ నంబర్ ఉన్న వాహనం నడిపితే పెద్దగా సమస్యలు రావు. అలాగే కుటుంబంలో సంబంధాలు కూడా బలపడతాయి.
నంబర్ 5
భయాల నుంచి బయట పడాలంటే ఈ నంబర్ బాగా ఉపయోగపడుతుంది. అదృష్టానికి చిహ్నంగా ఈ 5వ నంబర్‌ను వాడుతారు. ఈ నంబర్ వల్ల వ్యాపారాల్లో వృద్ధి కనిపిస్తుంది.
నంబర్ 6
ఈ సంఖ్య ప్రేమకు చిహ్నం. ప్రేమగా ఇతరులతో ఉండటానికి ఇది బాగా ఉపయోగపడుతుంది.
నంబర్ 7
బాగా ఎమోషనల్‌గా ఉండే వారు ఈ నంబర్ వాహనాన్ని వాడకూడదు. ఎందుకంటే ఎక్కువగా ఆలోచిస్తుంటారు. దీనివల్ల మానసిక సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. అలాగే కొన్నిసార్లు ప్రమాదం కూడా వస్తుంది.
నంబర్ 8
కష్టపడి పని చేసి జీవితంలో ఉన్నతంగా ఉండాలని అనుకునే వారికి బాగా ఉపయోగపడుతుంది. ఇది వ్యాపారులకు అయితే అసలు సెట్ కాదు. కానీ ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రం ఈ కారు నంబర్ బాగా ఉపయోగపడుతుంది.
నంబర్ 9
ఈ నంబర్ వాడితే ఎక్కువ తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే సంతోషం కంటే ఎక్కువగా బాధలు ఉంటాయి. అయితే కొందరికి ఈ నంబర్ అదృష్టాన్ని కూడా తీసుకొస్తుంది.