Womens day special: ఉమెన్స్ డే స్పెషల్.. ప్రతీ మహిళ ఫోన్‌లో ఈ యాప్స్ ఉండాల్సిందే

Womens day special:
నేడే మహిళల దినోత్సం.. ఈ ఒక్క రోజు మాత్రమే మహిళలను గౌరవించి మిగతా రోజుల్లో కనీసం వాల్యూ ఇవ్వరు. ప్రస్తుత కాలంలో మహిళపై దాడులు పెరిగిపోతున్నాయి. నిజం చెప్పాలంటే అసలు మహిళలకు భద్రత అనేదే లేదు. చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకు అందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. ఎక్కడికైనా ఒంటరిగా వెళ్లాలంటే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దేశంలో అమ్మాయిలపై దారుణాలు పెరుగుతున్నాయి. వీటికి భయపడి ఎక్కడికి వెళ్లకుండా ఉండలేరు. బయట అనే కాకుండా సొంతింట్లో అమ్మాయిలకు అసలు భద్రత లేదు. సోదరుడు, తండ్రి ఇలా ఎవరో ఒకరు కూడా ఇబ్బందులు పెడుతున్నారు. అడుగడుగున మహిళలు ఇలాంటి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇంట్లో, పని ప్రదేశంలో ఎక్కడా కూడా మహిళలకు భద్రత లేకుండా పోతుంది. అయితే ప్రస్తుతం జనరేషన్ బట్టి మహిళలు కాస్త సేఫ్టీగా ఉండాలి. ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు అత్యవసర సమయాల్లో కొన్ని మొబైల్ యాప్స్ వాడాలి. వాటి వల్ల మహిళలకు రక్షణ ఉంటుంది. మరి ఆ మొబైల్ యాప్స్ ఏంటో ఈ స్టోరీలో చూద్దాం.
112 ఇండియా యాప్ (112 India App)
ఈ 112 ఇండియన్ యాప్ మహిళలకు చక్కగా పనిచేస్తుంది. ఇంటి నుంచి ఎక్కడికి వెళ్లిన తర్వాత ఇబ్బందులు వస్తే వెంటనే సంప్రదించవచ్చు. ఈ యాప్‌ను సంప్రదించడం వల్ల మహిళలకు రక్షణ ఉంటుంది. వెంటనే అందరూ కూడా స్పందిస్తారు. ఎల్లప్పుడూ కూడా సేవలు ఉంటాయి. కాబట్టి ప్రతీ మహిళ ఈ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాల్సిందే.
సేఫ్టీపిన్ యాప్ (Safetipin App)
ఈ యాప్ సాయంతో మహిళలను రక్షించవచ్చు. ప్రయాణ సమయాల్లో మీకు అసురక్షితంగా అనిపిస్తే వెంటనే ఈ యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి. ఇందులో మీరు సాయం కోరినప్పుడు మీకు వెంటనే లభిస్తుంది. ఈ యాప్ వల్ల మీకు వెంటనే అన్ని వివరాలను కూడా అందిస్తుంది. ఎలాంటి ఇబ్బంది సమయాల్లో అయినా ఈ యాప్ బాగా ఉపయోగపడుతుంది. ఫోన్ డేలా లేకపోయినా కూడా ఈ యాప్ పనిచేస్తుంది.
స్మార్ట్ 24×7 యాప్ (Smart 24×7 app)
దేశంలో చాలా రాష్ట్రాల్లో ఈ యాప్ ఉంది. ఈ యాప్‌ను ఏదైనా అత్యవసర పరిస్థితిలో వాడవచ్చు. దీనివల్ల మహిళలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. మీరు బయటకు వెళ్లేటప్పుడు ఈ యాప్‌ను తప్పనిసరిగా వాడాలి. మహిళల భద్రతా విషయంలో ఇది బాగా పనిచేస్తుంది. దీనివల్ల ఎలాంటి ఇబ్బందులు కూడా ఉండవు. స్మార్ట్ యాప్‌తో మహిళలు స్మార్ట్‌గా ఆలోచిస్తే కాస్త దారుణాలు తగ్గుతాయి.