Skin Care: ఈ కేర్ లేకపోతే మీ స్కిన్ త్వరగా పాడవడం గ్యారంటీ.. కేర్ మస్ట్ బ్యూటీ నెక్ట్స్

Skin Care: వాతావరణం మారుతుంటే ఆరోగ్యంతో పాటు చర్మం కూడా ప్రభావితం అవుతుంటుంది. అందుకే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. ఇక ఈ వాతావరణ మార్పుల వల్ల చర్మం కూడా ఎన్నో సమస్యలను ఎదుర్కొంటుంది. కాలాన్ని బట్టి చర్మం పొడిబారడం, జిడ్డుగా మారడం, మొటిమలు, అలెర్జీలు వంటి సమస్యలు చుట్టుముడుతుంటాయి. సో మీ చర్మం ఆరోగ్యంగా, ప్రకాశవంతంగా ఉండాలంటే కేర్ చాలా అవసరం. మరి ఆ కేర్ ఏంటో కూడా ఓ సారి చూసేద్దామా.
వాతావరణం మారుతుంటే ముందుగా మీ స్కిన్ ఎలాంటిదో తెలుసుకోవాలి. కొందరిది డ్రై స్కిన్ అయితే కొందరిది జిడ్డు స్కిన్ మరికొందరిది నార్మల్ స్కిన్ ఉంటుంది.అయితే పొడి చర్మం ఉన్నవారు ఎక్కువ హైడ్రేటింగ్ , మాయిశ్చరైజింగ్ క్రీములను ఉపయోగించాల్సి ఉంటుంది. అంతేకాదు విటమిన్ ఇ, గ్లిజరిన్ వంటివి ఉపయోగించడం వల్ల మీ స్కిన్ సాఫ్ట్ గా ఉంటుంది.
కొందరిది జిడ్డు స్కిన్ అయితే మాత్రం తేలికైన, నూనె లేని మాయిశ్చరైజర్లు వాడాలి. ఇక జెల్ గా ఉండే క్రీములను వినియోగించాలి. దీని వల్ల స్కిన్ మీద అదనపు నూనె పేరుకుపోదు. మీ రంధ్రాలు కూడా మూసుకొని పోవు. ఇక చాలా మందికి సెన్సిటివ్ స్కిన్ ఉంటుంది. వారు కఠినమైన రసాయనాలు అసలు వాడవద్దు. లేదంటే చికాకు, అలెర్జీ వంటివి వస్తాయి.
చలికాలంలో స్కిన్ లో తేమ తగ్గుతుంది. సో మాయిశ్చరైజింగ్ మస్ట్. చర్మం పొడిబారి, నిర్జీవంగా మారవద్దు అంటే కచ్చితంగా మాయిశ్చరైజ్ చేస్తూనే ఉండాలి. రాత్రి పడుకునే ముందు కూడా దీన్ని ఉపయోగించవచ్చు. లేదంటే మధ్యాహ్నం అయినా జెల్ ను వాడవచ్చు.
సన్‌స్క్రీన్: ఎండలో బయటకు వెళ్తున్నా, ముఖ్యంగా వేసవి కాలంలో సన్ స్క్రీన్ ను మాత్రం మస్ట్ గా వినియోగించాల్సిందే. కేవలం వేసవిలో మాత్రమే కాదు ప్రతి సీజన్ లో వినియోగించాలి అంటున్నారు నిపుణులు. ఇది మిమ్మల్ని సూర్యుని హానికరమైన యూవీ కిరణాల నుంచి స్కిన్ ను కాపాడుతుంది. కానీ ఓ ముఖ్యమైన విషయం ఏంటంటే SPF 30 లేదా అంతకంటే ఎక్కువ ఉన్న సన్‌స్క్రీన్‌ను వాడాలి.
వాటర్ మస్ట్: చాలా మంది నీరును ఎక్కువగా తీసుకోరు. కానీ వాటర్ కంటెంట్ శరీరంలో సరిపడా ఉండాల్సిందే. లేదంటే స్కిన్ నిర్జీవంగా మారుతుంది. సో స్కిన్ డల్ అవుతుంది. మెరవదు. అందుకే వాటర్ కావాల్సినంత తీసుకోండి. ఇక వేసవిలో అయితే మరింత ఎక్కువ తాగాల్సి ఉంటుంది.
జీవనశైలి: ఇక బిజీ అని లైఫ్ ను లైట్ తీసుకోవద్దు. కేర్ మస్ట్. పండ్లు, కూరగాయలు, ముఖ్యంగా గ్రీన్ కూరగాయలు మీ డైలీ లైఫ్ లో యాడ్ చేసుకోండి. డ్రై ఫ్రూట్స్ కూడా ఉండేలా చూసుకోవాలి. విటమిన్లు, పోషకాలు వంటివి కూడా మిస్ కావద్దని గుర్తు పెట్టుకోండి.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని trendingtelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోగలరు.
-
Drink Milk: ఈ సమస్యలున్న వారు మిల్క్ తాగితే అంతే సంగతులు
-
Ice cream : ఐస్ క్రీమ్ లో రెండు రకాలు.. ఆ రెండోది తింటే మీకు గుండె ఫెయిల్ ఖాయం
-
Health Care : ప్రతి ముగ్గురిలో ఒక్కరికి ఈ వ్యాధి ఉందట..
-
Skin Care Tips: వేసవిలో చర్మం దెబ్బతింటుందా? ఇలా చేయండి
-
Periods Problem : 16 సంవత్సరాలైన రుతుస్రావం రాలేదా? లేదా వచ్చి ఆగిపోయిందా?
-
Paneer : పనీర్ అంటే ఇష్టమా? కానీ మీరు తినవద్దు..