Red Rice Benefits: వైట్ కంటే ఈ రైస్ ఎందుకు ఆరోగ్యానికి మంచివి?
Red Rice Benefits వైట్ రైస్ కంటే రెడ్ రైస్ వల్ల ఆరోగ్యంగా ఉంటారు. ముఖ్యంగా గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఎర్ర బియ్యంలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి రక్తపోటును అదుపులో ఉంచుతాయి.

Red Rice Benefits: ఆరోగ్యంగా ఉండటానికి ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. ముఖ్యంగా ఆహార విషయంలో అయితే తప్పకుండా కొన్ని నియమాలు పాటిస్తారు. అయితే తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా రైస్ తీసుకుంటారు. అందులోనూ కేవలం తెల్ల అన్నం మాత్రమే తింటారు. ఎన్ని టిఫిన్లు తిన్నా కూడా అన్నం తినకపోతే కొందరికి అసలు కడుపు నిండదు. అయితే వైట్ రైస్‌ను ఎక్కువగా తీసుకోకూడదు. వీటివల్ల శరీరానికి ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉండవు. ఇంకా అనారోగ్య సమస్యలు ఎక్కువగా వస్తాయని నిపుణులు అంటున్నారు. అయితే వైట్ రైస్‌కి బదులు కొందరు చపాతీ తింటారు. ఎందుకంటే ఇందులోని పోషకాలు శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. అయితే డైలీ చపాతీ తినడం అసలు కొందరికి ఇష్టం ఉండదు. అయినా కూడా చపాతీ తింటారు. అయితే రైస్‌లోనే కొన్ని రకాలు ఉన్నాయి. ముఖ్యంగా వైట్ రైస్‌కి బదులు రెడ్ రైస్‌ను తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటారని నిపుణులు చెబుతున్నారు. అయితే రెడ్ రైస్ తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఈ స్టోరీలో చూద్దాం.
వైట్ రైస్ కంటే రెడ్ రైస్ వల్ల ఆరోగ్యంగా ఉంటారు. ముఖ్యంగా గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఎర్ర బియ్యంలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి రక్తపోటును అదుపులో ఉంచుతాయి. అలాగే వీటిలో సెలీనియం, విటమిన్ సి, బీటా కెరోటీన్ వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి ఫ్రీరాడికల్స్ నుంచి శరీరాన్ని కాపాడడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. అలాగే రక్తంలోని చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడంలో రెడ్ రైస్ ముఖ్య పాత్ర పోషిస్తుంది. వీటిలో కేలరీలు, కొవ్వులు తక్కువగా ఉంటాయి. ఇవి ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా కాపాడతాయి. అలాగే రెడ్ రైస్ వల్ల తొందరగా బరువు పెరగరు. మీ శరీరంలో ఎలాంటి కొవ్వు కూడా పేరుకుపోకుండా ఉంటుంది. ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి. వీటిలోని క్యాల్షియం, ఫాస్పరస్ వంటి ఖనిజాలు ఎముకలు బలహీనం కాకుండా కాపాడతాయి. అలాగే చర్మ, జుట్టు సమస్యలను కూడా తగ్గిస్తుంది. ఇందులోని పోషకాలు చర్మం మెరిచేలా చేస్తుంది. చపాతీ కంటే రెడ్ రైస్ తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది. వీటిని డైలీ తీసుకుంటే ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఆరోగ్యంగా ఉంటారని నిపుణులు అంటున్నారు. కాబట్టి వైట్ రైస్‌కి బదులు రెడ్ రైస్‌ను తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది.
ఎర్ర రైస్‌లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది ఎక్కువ సేపు కడుపును నిండుగా ఉంచుతుంది. దీనివల్ల మీకు తొందరగా ఆకలి వేయదు. దీంతో ఈజీగా బరువు తగ్గుతారని నిపుణులు అంటున్నారు. ఇందులో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తహీనత సమస్య రాకుండా కాపాడుతుంది. అనీమియా సమస్యతో బాధపడుతున్నట్లయితే డైలీ వైట్ రైస్‌కి బదులు రెడ్ రైస్ తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదని నిపుణులు అంటున్నారు. అలాగే క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన వ్యాధులు రాకుండా కాపాడుతుందని నిపుణులు చెబుతున్నారు.
Disclaimer: కేవలం అవగాహన కోసం మాత్రమే ఈ సమాచారం ఇవ్వడం జరిగింది. దీన్ని trendingtelugus.com నిర్ధారించదు. గూగుల్ ఆధారంగా తెలియజేయడం జరిగింది.