HEALTH: పాలు, బాదం పాలు.. వీటిలో ఎందులో ఎక్కువ పోషకాలు ఉంటాయంటే

HEALTH: పాలు ఆరోగ్యానికి మంచివే. ఇందులోని పోషకాలు శరీర ఆరోగ్యానికి మేలు చేస్తాయి. కొందరు డైరెక్ట్ పాలు తాగలేక బాదం పాలు తాగుతుంటారు. పాలలోని పోషకాలు ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. కండరాల సమస్యలు రాకుండా ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. అయితే సాధారణ పాలు లేదా బాదం పాలు రెండింటిలో ఏ పాలు ఆరోగ్యానికి మంచివి. అసలు ఈ రెండింటిలో పోషకాలు ఎందులో ఎక్కువగా ఉంటాయి. అసలు ఏ పాలు తాగడం ఆరోగ్యానికి మంచిది? పూర్తి వివరాలు కూడా ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.
డ్రైఫ్రూట్స్‌లో బాదం పప్పులను చాలా మంది ఎక్కువగా తీసుకుంటారు. వీటిలోని పోషకాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా కాపాడతాయి. వీటిని రాత్రిపూట నానబెట్టి ఉదయం తింటారు. ఇలా తినడం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుంది. అలాగే చర్మ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. అయితే బాదం కంటే బాదం పాలు కూడా ఆరోగ్యానికి మంచివే. సాధారణ పాలలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. బాదం, పాలు కలిపి తీసుకుంటే పోషకాలు ఇంకా ఎక్కువగా ఉంటాయి. ఇవి ఎముకలు, దంతాల నిర్మాణానికి బాగా ఉపయోగపడతాయి. కండరాలు, ఎముకల ఆరోగ్యానికి కాల్షియం తప్పకుండా అవసరం. శరీరానికి సరిపడా లేకపోతే బోలు ఎముకల వ్యాధి వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రెండింటిని కలిపి తీసుకోవడం వల్ల అందులోని విటమిన్లు, మెగ్నీషియం, ఫాస్పరస్ ఉన్నాయి. అలాగే వీటితో పాటు యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉన్నాయి. ఇవి ఎముకల ఆరోగ్యాన్ని కాపాడతాయి. సాధారణ పాలు కంటే బాదం పాలు ఎముకల ఆరోగ్యాన్ని కాపాడటానికి బాగా ఉపయోగపడతాయి.
సాధారణ పాలతో పోలిస్తే బాదం పాలలో కాల్షియం కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇందులోని పోషకాలు ఆరోగ్యానికి బాగా ఉపయోగపడతాయి. సాధారణ పాలలో కంటే ఇందులో ఎక్కువగానే కాల్షియం ఉంటుంది. ఒక కప్పు బాదం పాలకు సుమారుగా 300 నుంచి 450 మి.గ్రాముల కాల్షియం ఉంటుంది. అలాగే బాదం పాలలో విటమిన్ డి కూడా ఎక్కువగా ఉంటుంది. అయితే బాదం పాలలో కేలరీలు కూడా చాలా తక్కువగా ఉంటాయి. ఇవి బరువు తగ్గేలా చేస్తాయి. అయితే కొందరు వీటిని తయారు చేసుకోకుండా బయట మార్కెట్‌లో కొనుగోలు చేస్తుంటారు. వీటిలో రసాయనాలు కలిపి తయారు చేస్తుంటారు. ఇలాంటివి తాగడం కంటే ఇంట్లోనే తయారు చేసి తాగడం ఆరోగ్యానికి మంచిది.
-
Weight lose: ఈజీగా బరువు తగ్గాలంటే రాత్రిపూట ఇవి తినాల్సిందే
-
Ice creams: సమ్మర్లో పిల్లలకు ఇలాంటి ఐస్‌క్రీమ్స్ ఇస్తున్నారా?
-
Drink Milk: ఈ సమస్యలున్న వారు మిల్క్ తాగితే అంతే సంగతులు
-
Ice cream : ఐస్ క్రీమ్ లో రెండు రకాలు.. ఆ రెండోది తింటే మీకు గుండె ఫెయిల్ ఖాయం
-
joint pain : కీళ్ల నొప్పులు బాధ పెడుతున్నాయా? ఇలా చేయండి. నొప్పులు మాయం అవుతాయి.
-
Health Care : ప్రతి ముగ్గురిలో ఒక్కరికి ఈ వ్యాధి ఉందట..